- Home
- Business
- Business Ideas: ఈ చిన్న కోర్సు చేసి, జస్ట్ రూ. 50 వేల పెట్టుబడితో ఈ బిజినెస్ చేస్తే, నెలకు రూ. 1 లక్ష మీ సొంతం
Business Ideas: ఈ చిన్న కోర్సు చేసి, జస్ట్ రూ. 50 వేల పెట్టుబడితో ఈ బిజినెస్ చేస్తే, నెలకు రూ. 1 లక్ష మీ సొంతం
వ్యాపారం చేయాలని చూస్తున్నారా అయితే ఎలాంటి వ్యాపారం ప్రారంభించాలో తెలియక సతమతం అవుతున్నారా. అందుకోసమే చక్కటి వ్యాపార ఐడియాలను తెలిసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకూ చదవండి.

ప్రస్తుత కాలంలో ఫుడ్ బిజినెస్ లో చక్కటి వ్యాపార అవకాశాలు ఉన్నాయి. మీరు కూడా ఫుడ్ బిజినెస్ లో రాణించాలి అనుకుంటే మాత్రం ఏ వ్యాపారం చేయాలో తెలుసుకుంటే సరిపోతుంది.
ఈ మధ్యకాలంలో అన్ని నగరాలు , పట్టణాల్లో చిరుతిండ్లను తినేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. మీరు కూడా ఆ దిశగా అడుగులు వేస్తే చక్కటి వ్యాపార అవకాశం మీ సొంతం అవుతుంది.
ఫుడ్ బిజినెస్ లో బేకరీ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. అందులోనూ పిజ్జా, బర్గర్ లను తినేందుకు పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడతారు. మీరు కూడా పిజ్జా బర్గర్ వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే, ముందుగా పిజ్జా బర్గర్ తయారీ గురించి తెలుసుకోవాలి. ఈ వ్యాపారం ప్రారంభించేవారు పని వాళ్ళ పై ఆధారపడకుండా మీరే స్వయంగా తయారీని నేర్చుకుంటే చక్కటి వ్యాపార అవకాశం అవుతుంది.
ఇందు కోసం మీరు పలు హోటల్ మేనేజ్మెంట్ సంస్థలు, స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాలు, కల్లినరీ అకాడమీలు ఉన్నాయి. వీటిలో షార్ట్ టర్మ్ ప్రాతిపదికన ఈ కోర్సులు అందుబాటులో ఉంటాయి తద్వారా మీరు బేకరీ ఉత్పత్తులు ముఖ్యంగా పిజ్జా బర్గర్ తయారీ నేర్చుకోవచ్చు.
ఇక పిజ్జా, బర్గర్ తయారీ షాప్ కోసం మీరు ఒక చిన్న షాపు లేదా రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. అద్దె ప్రాతిపదికన షాపు తీసుకొని పిజ్జా బర్గర్ తయారీ కేంద్రం స్టార్ట్ చేస్తే సరిపోతుంది. పిజ్జా బర్గర్ తయారీ కోసం ఓవెన్ కొనుగోలు చేసుకోవాలి. పిజ్జా తయారీ కోసం ప్రత్యేకమైన ఓవెన్ ఉంటుంది. దీన్ని ఆన్ లైన్ ద్వారా కూడా కొనుగోలు చేసుకోవచ్చు. పెట్టుబడి విషయానికి వస్తే సుమారు రూ. 50 వేల నుంచి రూ. 1 లక్ష వరకూ ఖర్చు వస్తుంది.
ఇక పిజ్జా బర్గర్ లో వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి. పిజ్జా బర్గర్ తయారీలో ఉపయోగించే చీజ్, అలాగే బన్నులు, ఇతర ఉత్పత్తులను హోల్సేల్ మార్కెట్లో కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీకు ఖర్చు తగ్గుతుంది,
ఇక నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దు. మిగిలిపోయిన మాంసము అలాగే కూరగాయలను మొహమాటం లేకుండా పారేయాలి. వాటిని ఉపయోగించి పిజ్జా బర్గర్ తయారు చేసే కష్టమర్స్ ఆరోగ్యం చెడిపోయే ప్రమాదం ఉంది. తద్వారా మీరు నష్టపోయే అవకాశం ఉంది. ఇక పిజ్జా బర్గర్ లో వచ్చే కొత్త కొత్త వెరైటీలను మీరు కస్టమర్లకు అందిస్తూ ఉండాలి. అప్పుడే మీ వద్దకు కస్టమర్లు ఆకర్షితులవుతారు.
ఇక మీరు షాపు ఏర్పాటు చేసుకోవాలంటే సరైన సెంటర్ ముఖ్యం ఇందుకోసం, కాలేజీలు, కమర్షియల్ కాంప్లెక్స్, పార్కులు వంటి ప్లేసుల్లో అయితే ఈ పిజ్జా బర్గర్ పాయింట్ చక్కగా వర్కౌట్ అవుతుంది. ఇక ఆదాయం విషయానికి వస్తే నెలకు ఖర్చులు పోనూ, కనీసం రూ. 1 లక్ష వరకూ సంపాదించే చాన్స్ ఉంటుంది.
Disclaimer: పైన పేర్కొన్న వ్యాపార సలహా కేవలం పాఠకుల అవగాహన కొరకు మాత్రమే. మీరు చేసే పెట్టుబడులకు వ్యాపారాలకు ఏషియా నెట్ తెలుగు వెబ్ సైట్ ఎలాంటి బాధ్యత వహించదు. ఒకవేళ మీరు వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటే సంబంధిత నిపుణులను అడిగి పూర్తి విషయాలు తెలుసుకోవడం మంచిది.