- Home
- Business
- Business Ideas: ఇప్పటి వరకూ ఎవరికీ తెలియని ఫుల్ డిమాండ్ బిజినెస్, సరిగ్గా చేసుకుంటే నెలకు లక్షల్లో ఆదాయం
Business Ideas: ఇప్పటి వరకూ ఎవరికీ తెలియని ఫుల్ డిమాండ్ బిజినెస్, సరిగ్గా చేసుకుంటే నెలకు లక్షల్లో ఆదాయం
ఒకప్పుడు బ్యాంకుల్లో రుణం పొందాలంటే చాలా కష్టంగా ఉండేది, కానీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసి పీఎం ముద్రా యోజన కింద నేడు అనేకమంది సులభంగా ఎలాంటి గ్యారంటీ లేకుండానే రుణం పొందుతున్నారు. అలాగే తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. అలాంటి వ్యాపారం ద్వారా మీరు కూడా లాభపడాలని భావిస్తున్నారా అయితే చక్కటి వ్యాపారం గురించి తెలుసుకుందాం. ఇప్పటి వరకూ ఎక్కడ కూడా పెద్దగా గుర్తింపు లేని బిజినెస్ ఇది. దీనికి కొద్దిగా మార్కెట్ రీసెర్చ్, ఓపిక, సమయం, పెట్టుబడి ఉంటే సరిపోతుంది.

ప్రస్తుతం కరోనా కాలంలో ప్రజలు పరిశుభ్రత పట్ల ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అంతేకాదు పరిశుభ్రత కోసం ఎంత ఖర్చు అయినా పెడుతున్నారు. అయితే అలాంటి బిజినెస్ గురించి తెలుసుకుందాం. సాధారణంగా ఆసుపత్రులు, హోటల్స్, లాడ్జింగ్ , కార్పోరేట్ ఆసుపత్రులకు నిరంతరం హ్యాండ్ వాష్ సొల్యూషన్, టాయిలెట్ వాష్ సొల్యూషన్, ఫినాయల్, అలాగే సానిటైజర్ వంటివి నిరంతరం అవసరం అవుతుంటాయి. వారు దీన్ని రిటైల్ మార్కెట్ లో కొనుగోలు చేసి మెయిన్ టెయిన్ చేయడం పెద్ద ఖర్చుతోనూ, టైం వేస్ట్ తోనూ కూడిన పని దీన్నే మీరు అవకాశంగా మార్చుకోవచ్చు.
మీరు హ్యాండ్ వాష్, యాంటీ సెప్టిక్ లిక్విడ్, ఫినాయిల్, టాయిలెట్ వ్యాష్ సొల్యూషన్ డోర్ డెలివరీ చేయగలిగితే మీరు చక్కటి వ్యాపారంగా మారుతుంది. ఉదాహరణకు ఆసుపత్రుల్లో డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందికి హ్యాండ్ వాష్, సానిటైజర్, ఇతర క్లీనింగ్ సొల్యూషన్స్ అవసరం చాలా ఉంటుంది. వారు ప్రతి రోజు లీటర్ల కొద్దీ వాడుతుంటారు. ఆయా సొల్యూషన్లు అయిపోయిన ప్రతి సారీ కొనుగోలు చేయడం వారికి కష్టమైన పని.
అందుకే మీరు ఆసుపత్రులు, హోటల్స్, కార్పోరేట్ ఆఫీసుల్లో ఉపయోగించే క్లీనింగ్ సొల్యూషన్ బల్క్ గా కొనుగోలు చేసి వారికి, రెగ్యులర్ గా సప్లై చేస్తే సరిపోతుంది. ఇందు కోసం మీరు ఒక కంటెయినర్ ఆటో పెట్టుకుంటే సరిపోతుంది. ముందుగా మీరు బల్క్ గా, ఆసుపత్రులు, హోటల్స్, ఆఫీసుల్లో విరివిగా ఉపయోగించే హ్యాండ్ వాష్, టాయిలెట్ క్లినింగ్ లిక్విడ్, సానిటైజర్, నాప్కిన్స్ వివరాలు తెలుసుకొని వాటిని మాన్యుఫాక్చరింగ్ సంస్థల వద్ద కొనుగోలు చేయాలి.
ఒక గోడౌన్ పెట్టుకొని అందులో సరుకు ఉంచుకోవాలి., ఆ తర్వాత మీరు నెమ్మదిగా మీ ఏరియాలో ఆసుపత్రుల వివరాలను సేకరించి వారికి మీ సర్వీసును పరిచయం చేయాలి. అలాగే వారు రెగ్యులర్ గా ఆయా క్లీనింగ్ లిక్విడ్స్ కొనుగోలు చేసేందుకు ఎంత ఖర్చు పెడుతున్నారు. మీరు వారికి ఎంత తక్కువకు ఇస్తారో వివరించాలి. మొదట్లో మీరు లాభం మార్జిన్ తక్కువగా ఉంచుకోండి. అప్పుడు కస్టమర్లు లభిస్తారు. ఒక సారి కస్టమర్ నెట్ వర్క్ తయారు అయ్యాక, వారికి సర్వీసు విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ ఉండకూడదు.
ఇక ఈ బిజినెస్ కోసం మీకు కావాల్సింది, ఒక కంటెయినర్ ఆటో, ఒకరు, లేదా ఇద్దరు సహాయకులు, సరుకు దాచుకునేందుకు గోడౌన్, లేదా ఒక 100 గజాల గది, ఉంటే సరిపోతుంది. సాధారణంగా ఒక టాయిలెట్ క్లీనర్ లిక్విడ్ ఒక లీటరు ధర మార్కెట్లో 150 రూపాయలకు దొరుకుతుంది. అదే మీరు బల్క్ గా కొనుగోలు చేస్తే 50 రూపాయల నుంచి ప్రారంభం అవుతుంది. మీరు వారికి మరో 50 రూపాయల లాభంతో విక్రయించినా కస్టమర్ కు 50 రూపాయల లాభం వస్తుంది. ఆ విధంగా మీకు లాభం వస్తుంది.
Radico Khaitan Share Return 123 times in 18 Years.
ఇక మీ సర్వీసు ప్రారంభించడానికి రిజిస్ట్రేషన్, కరెంట్ అకౌంట్ ఖాతా, తీసుకోవాలి, అలాగే జీఎస్టీఎన్ నెంబర్ తీసుకోవాలి. అన్ని అనుమతులు పొందినప్పుడే, కార్పోరేట్ ఆసుపత్రులు, ఆఫీసులు, ఇతర పెద్ద సంస్థల నుంచి మనం ఆర్డర్స్ పొందగలం అని గుర్తుంచుకోవాలి.