- Home
- Business
- Business Ideas: రోజుకు 2, 3 గంటలు కష్టపడితే చాలు, ఈ ఏడాది చివర్లో కోటీశ్వరులు అయ్యే అవకాశం...ఎలాగో తెలుసుకోండి
Business Ideas: రోజుకు 2, 3 గంటలు కష్టపడితే చాలు, ఈ ఏడాది చివర్లో కోటీశ్వరులు అయ్యే అవకాశం...ఎలాగో తెలుసుకోండి
వ్యాపారం చేయడం ద్వారా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తున్నారా, అయితే మీ ఖాళీ సమయాన్ని వ్యాపార అవకాశంగా మార్చుకోవడంలో ద్వారా ప్రతి నెల లక్షల ఆదాయం సంపాదించే అవకాశం ఉంది. ఏం చేయాలో తెలుసుకుందాం. రోజుకు కేవలం రెండు మూడు గంటలు కష్టపడితే చాలు ఈ వ్యాపారం ద్వారా మీరు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. అదేం వ్యాపారమో ప్రస్తుతం తెలుసుకుందాం.

రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రస్తుతం నగరాల నుంచి పల్లెటూర్ల వరకూ పాకింది. ప్రజలు తమ కష్టపడి సంపాదించిన డబ్బును భూమి పైన పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. జనాభా పెరుగుతుంది కానీ మనం ఉన్నటువంటి భూమి మాత్రం పెరగదు. దీన్నే ప్రాథమిక సూత్రం గా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మీరు కూడా రియల్ ఎస్టేట్ రంగాన్ని ఉపయోగించి, చక్కటి లాభాలను పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంలో ఏ విధంగా రాణించవచ్చు తెలుసుకుందాం.
రియల్ ఎస్టేట్ రంగంలో మార్కెటింగ్ అనేది చాలా ముఖ్యమైనది. మీరు మార్కెటింగ్ చేయడం ద్వారా రియల్ ఎస్టేట్ రంగంలో చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. చాలామంది రియల్ ఎస్టేట్ రంగంలో ఫ్రీలాన్స్ పద్ధతిలో మార్కెటింగ్ చేస్తున్నారు. తమ ఖాళీ సమయాన్ని ఉపయోగించి మంచి నెట్ వర్క్ ఏర్పాటు చేసుకుని, ఫ్లాట్ లను విక్రయిస్తూ, మంచి ఆదాయం పొందుతున్నారు. మీరు కూడా ఖాళీ సమయంలో రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేయడం ద్వారా, చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. ఏం చేద్దామో తెలుసుకుందాం.
రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ లో రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఏదైనా ఒక ఆర్గనైజేషన్ కింద మార్కెటింగ్ టీం లో చేరి ఫ్లాట్ లను అమ్మి పెట్టడం ద్వారా, డబ్బు సంపాదించుకోవచ్చు. లేదంటే మీరే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా మారి ఇల్లు, ప్లాట్లు, కమర్షియల్ బిల్డింగ్ లు, ఇతర రియల్ ఎస్టేట్ ఆస్తులను మీరు మధ్య వర్తిగా ఉండి విక్రయించడం ద్వారా, కమీషన్ పద్ధతిలో ఆదాయం పొందే వీలుంది. చాలామంది రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఈ విధంగానే సంపాదిస్తున్నారు.
రియల్ ఎస్టేట్ రంగంలో మార్కెటింగ్ తో పాటు, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకుంటే మీరు ఈ రంగంలో చక్కగా రాణించవచ్చు అదే సమయంలో చట్టవ్యతిరేక, అనైతిక పద్ధతులకు పాల్పడ్డాడనే నీటి న్యాయంతో మీరు ఈ రంగంలో కొనసాగితే, చాలా ఏళ్ల పాటు రియల్ ఎస్టేట్ రంగంలో రాణించే అవకాశం ఉంటుంది. లేకపోతే చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంది.
ఖాళీ సమయంలో క్లయింట్లను దొరకబుచ్చుకొని, వారిని కలిసి, మీ ప్లాట్లను అమ్మాలి, విసుగూ విరామం లేకుండా కష్టపడితే అతి తక్కువ సమయంలోనే ఈ రంగంలో మీరు ఊహించని రేంజ్ లో డబ్బు సంపాదించే అవకాశం ఉంది.
నోట్: పైన పేర్కొన్నటువంటి బిజినెస్ ఐడియా కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఏషియానెట్ తెలుగు ఎలాంటి వ్యాపార సలహాలు ఇవ్వదు. పైన పేర్కొన్నటువంటి ఆదాయాలు అంచనాలు మాత్రమే. మీరు తీసుకునే నిర్ణయాలకు మీరే బాధ్యులు.