MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ఏప్రిల్ తర్వాత బంగారం కొనే వాళ్లకి లక్కీ ఛాన్స్

ఏప్రిల్ తర్వాత బంగారం కొనే వాళ్లకి లక్కీ ఛాన్స్

Union Budget 2025: మీరు బంగారం కొనే ఆలోచనలో ఉన్నారా? ఒక్క క్షణం ఆగండి. ఏప్రిల్ తర్వాత బంగారం కొనే వాళ్లు చాలా లక్కీ అవుతారు. ఎందుకో తెలుసుకుందాం రండి. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
| Updated : Feb 01 2025, 05:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

బంగారం ధరలు రోజు రోజుకూ పెరడగమే తప్ప తగ్గడం అనేది చరిత్రలో లేదు. మధ్య మధ్యలో కాస్త తగ్గనా సరాసరి చూస్తే ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది. అందుకే చాలా మంది తమ సేవింగ్స్ ని బంగారం రూపంలో దాచుకుంటారు. అయితే ప్రస్తుతం మీరు కూడా మీ దగ్గర ఉన్న డబ్బులతో బంగారం కొనాలని అనుకుంటే ఏప్రిల్ దాకా ఆగండి. ఆ తర్వాత కొన్న వారికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశ పెట్టారు. అందులో బంగారం, వెండిపై  కస్టమ్ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు. ఇది బంగారంపై పెట్టుబడి పెట్టే వారికి నిజంగా శుభవార్త. ఎందుకంటే తగ్గిన కస్టమ్ డ్యూటీ వల్ల బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశం ఉంది. 

కేంద్ర ప్రభుత్వం గోల్డ్, సిల్వర్ పై కస్టమ్ డ్యూటీని తగ్గించడానికి ఓ బలమైన కారణం ఉంది. అదేంటంటే బంగారం, వెండి లిక్విడిటీ పెంచేందుకు ఇలా కస్టమ్ డ్యూటీని తగ్గించారు. అందుకే బంగారం, వెండి ధరలు తగ్గి, వాటిని దేశ వ్యాప్తంగా డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉంది. 

35

కస్టమ్ డ్యూటీ తగ్గించడం వల్ల వ్యాపారులు ఎక్కువ మొత్తంలో దిగుమతి చేసుకుంటారు. దీని వల్ల ఇల్లీగల్ దిగుమతులు కూడా తగ్గిపోతాయి. దేశ వ్యాప్తంగా ప్రజల నుంచి గోల్డ్ కు డిమాండ్ పెరుగుతుంది. దీంతో నగల తయారీ రంగం కూడా ఊపందుకుంటుంది. నగల తయారీ ఎక్కువగా జరిగితే విదేశాలకు ఎగుమతులు కూడా పెరుగుతాయి. దీని ద్వారా కూడా కేంద్రానికి ట్యాక్స్ లభిస్తుంది. 
 

45

బంగారం దిగుమతులు ఎక్కువగా చేసే కల్యాణ్ జ్యువెలర్స్, టైటాన్ వంటి కంపెనీలకు ఈ వార్త కలిసొచ్చే విషయం. ఎందుకంటే స్టాక్ మార్కెట్ లో వాటి షేర్లు పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎటు చూపినా బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం వల్ల కేంద్రానికి భారీ లాభమే జరగనుందని అర్థమవుతోంది. 

కస్టమ్ డ్యూటీ 15 నుంచి 6 శాతం తగ్గడంతో దిగుమతులు పెరుగుతాయి. బంగారం దిగుమతి చేసుకొనే వ్యాపారులు ఇప్పుడు ఆర్డర్స్ ఇస్తే ఏప్రిల్ లోపు వారికి అందుతాయి. అప్పటికి బంగారం ధరలు కచ్చితంగా తగ్గుతాయని వ్యాపార నిపుణులు ధీమాగా చెబుతున్నారు. అందువల్ల బంగారం కొనాలన్న ఆలోచన ఉన్న వారు  ఏప్రిల్ నెల తర్వాత కొనేలా ప్లాన్ చేసుకుంటే కచ్చితంగా లాభపడతారు. 

55

ప్రస్తుతం హైదరాబాద్ లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే.. 
24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం రూ.84,490గా ఉంది. 
అదే 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం రూ.77,450 గా ఉంది. 
సిల్వర్ 1 కిలో ధర రూ.1,07,000గా ఉంది. 
 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold: ప్రపంచంలోనే అత్యధిక బంగారం ఉన్న దేశం ఏదో తెలుసా? ఆ నంబర్ చూస్తే షాకవుతారు !
Recommended image2
Gold Price Fall: బంగారం మళ్లీ డౌన్ ఫాల్.. వెండి కొండెక్కింది. హైదరాబాద్‌లో ఇవాళ్టి రేట్లు ఇవే!
Recommended image3
ఇక‌పై వాహ‌నాలు నీటితో న‌డ‌వ‌నున్నాయా.? విదేశీ సంస్థ వినూత్న ఆవిష్క‌ర‌ణ‌.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved