BSNL Plans: బీఎస్ఎన్ఎల్ రూ.107 ప్లాన్.. 35 రోజులు వ్యాలిడిటీతో డేటా.. జియో, ఎయిర్టెల్‌లకు గట్టిపోటీ
భారత్‌లో టెలికం దిగ్గజాలు జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడీయా రీఛార్టి టారిఫ్ ధరలు పెంచేశాయి. దీంతో వినియోగదారులకు నెలవారీ రీఛార్జీ ఖర్చులు పెరిగిపోయాయి. ఒక విధంగా చెప్పాలంటే జియో, ఎయిర్టెల్, వీఐ యూజర్లలో తీవ్రమైన అసహనం చెలరేగింది. ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ సూపర్ చీప్ ప్లాన్లతో ముందుకు వచ్చింది. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కంటే తక్కువ టారిఫ్ ప్లాన్లను తీసుకొచ్చింది. ఇంకా వ్యాలిడిటీ కూడా మిగతా వాటితో పోలిస్తే చాలా ఎక్కువ.
బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్
బీఎస్ఎన్ఎల్ 35 రోజుల వ్యాలిడిటీతో చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్ కలిగి ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకత ఏమిటంటే..? ఇతర కంపెనీల మాదిరిగా మరీ ఎక్కువ ధర కాదు. ఈ ప్లాన్ ధర రూ.110 కంటే తక్కువ.
బీఎస్ఎన్ఎల్ ప్లాన్
టారిఫ్ పెంపుపై జియో, ఎయిర్టెల్, వీఐ వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రజలు బీఎస్ఎన్ఎల్ కు మారడం ప్రారంభించారు. బీఎస్ఎన్ఎల్ రూ.107 ప్లాన్ లో వినియోగదారులకు అనేక ప్రయోజనాలు అందిస్తోంది.
బీఎస్ఎన్ఎల్
జియో, ఎయిర్టెల్, వీఐ రీఛార్జ్ ప్లాన్లు ఈ ప్లాన్‌తో పోటీ పడాల్సిన పరిస్థితి నెలకొంది. బీఎస్ఎన్ఎల్ రూ.107 ప్లాన్‌లో వినియోగదారులకు 3 జీబీ హై-స్పీడ్ డేటాను అందిస్తోంది.
BSNL Jio
దీంతో పాటు లోకల్, ఎస్టీడీ కాల్స్‌కి 200 నిమిషాలు ఉచితంగా ఇస్తారు. ఇది మాత్రమే కాదు, బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు 35 రోజులపాటు బీఎస్ఎన్ఎల్ ట్యూన్ ప్రయోజనాన్ని కూడా పొందుతారు. దీనికి పోటీగా ఉన్న జియో రూ.189 ప్లాన్ వాలిడిటీ 28 రోజులు మాత్రమే.
BSNL JIO AIRTEL VI
రూ.189 ప్లాన్‌లో జియో యూజర్లకు 2 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. ఎయిర్టెల్ రూ.199 ప్లాన్ 2 జీబీ హైస్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్ 28 రోజుల వాలిడిటీతో అందిస్తుంది. ఇక, వొడాఫోన్ ఐడియా రూ.179 ప్లాన్‌లో 1 జీబీ హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్ లభిస్తుంది.
మొత్తం మీద ధర, వాలిడిటీ పరంగా బీఎస్ఎన్ఎల్ రూ. 107 ప్లాన్‌కు సాటిలేదు. దేశంలో మూడు ప్రధాన టెలికం కంపెనీలు- రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్‌లలో ఇంత చౌకైన ప్లాన్ లేదు.