MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Business
  • BSNL Best Offer: ఈ ప్లాన్ వేసుకుంటే మార్చి 2026 వరకు రీఛార్జ్ అక్కర్లేదు!

BSNL Best Offer: ఈ ప్లాన్ వేసుకుంటే మార్చి 2026 వరకు రీఛార్జ్ అక్కర్లేదు!

BSNL Recharge Offer: కేంద్ర ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ సంస్థ బీఎస్ఎన్ఎల్ ఒక సంవత్సరం వ్యాలిడిటీ ఉన్న సూపర్ రీఛార్జ్ ప్లాన్‌ను చాలా తక్కువ బడ్జెట్ లో  అమలు చేస్తోంది. ఈ ప్లాన్ ప్రత్యేకతలు తెలుసుకుందాం రండి. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Feb 02 2025, 05:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ కంపెనీలు తమ టెలికమ్యూనికేషన్ సేవలను పోటాపోటీగా అందిస్తున్నాయి. అయితే టారిఫ్ ధరలు పెంచడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. జియో, ఎయిర్‌టెల్ ఇప్పటికే 5G సేవలను అందిస్తున్నా రీఛార్జ్ ప్లాన్స్ ధరలు పెంచడంతో ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ లోకి కస్టమర్లు మారుతున్నారు. అందుకే బీఎస్ఎన్ఎల్ కూడా వినియోగదారులను ఆకట్టుకోవడానికి తక్కువ ధరకు రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తోంది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

బీఎస్ఎన్ఎల్ అందించే సూపర్ రీఛార్జ్ ప్లాన్‌ ఏంటో తెలుసా? బీఎస్ఎన్ఎల్ రూ.1,999 ధరతో ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 12 నెలలు. ఈ ప్లాన్ ద్వారా అన్ని లోకల్, STD కాల్స్ ను సంవత్సరం పాటు అన్ లిమిటెడ్ గా ఫ్రీగా చేయొచ్చు. 

ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే మీకు మొత్తం 600 GB డేటా లభిస్తుంది. దీనికి రోజువారీ డేటా లిమిట్ లేదు. అందువల్ల మీరు ఈ డేటాను ఒకేసారి ఉపయోగించుకోవచ్చు. లేదా ఏడాది పొడవునా ఉపయోగించవచ్చు. అదనంగా ఈ ప్లాన్ రోజుకు 100 ఉచిత SMSలను అందిస్తుంది. తరచుగా రీఛార్జ్ చేయకుండా ఉండాలనుకునే వారికి రూ.1,999 ప్లాన్ చాలా బెస్ట్ ప్లాన్. 

34

ఇన్ని ప్రయోజనాలున్న రీఛార్జ్ ప్లాన్ జియో లో కూడా ఉంది. కాని దీని ధర బీఎస్ఎన్ఎల్‌తో పోలిస్తే కాస్త ఎక్కువ.

జియో రూ. 3,599 ధరతో 365 రోజుల చెల్లుబాటు ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ మొత్తం 912.5GB డేటాను అందిస్తుంది. రోజువారీ పరిమితి 2.5 GB. ఇందులో అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSలు కూడా ఉన్నాయి. అదనంగా మీకు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌కి ఉచిత యాక్సెస్ లభిస్తుంది.

44

బీఎస్ఎన్ఎల్ వార్షిక ప్లాన్‌తో పోలిస్తే జియో ప్లాన్ చాలా ఖరీదైనది. ఇది అదనంగా 300 GB డేటాను అందించినప్పటికీ ధర ఇప్పటికీ ఎక్కువగానే ఉంది. ఈ ప్లాన్ ఏకైక ప్రయోజనం 5G అపరిమిత ఇంటర్నెట్ సేవను అందిస్తుంది. కాబట్టి మీరు ఒక సంవత్సరం పాటు తక్కువ ధరలో రీఛార్జ్ కోరుకుంటే డౌట్ లేకుండా బీఎస్ఎన్ఎల్ వార్షిక ప్లాన్‌ను తీసుకోవడం బెస్ట్. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved