BSNL బంపర్ ఆఫర్.. 5 రూపాయలకే డేటా ప్లాన్..!
BSNL వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్లు ఇస్తోంది. సరికొత్త రీచార్జ్ ప్లాన్ లతో యూజర్లను ఆకర్షిస్తోంది. జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా లాంటి దిగ్గజ సంస్థలకు గట్టి పోటీనిస్తోంది. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటి?

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్-BSNL. తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. దీంతో ఎక్కువమంది BSNL వైపు మొగ్గు చూపుతున్నారు. తాజాగా BSNL కొత్త ప్రకటన లక్షలాది మంది వినియోగదారులను ఆశ్చర్యపరిచింది. 5 రూపాయలకంటే తక్కువ ధరకే, అన్‌లిమిటెడ్ కాల్స్, బోలెడు డేటాతో కూడిన ప్లాన్‌ను BSNL అందుబాటులోకి తీసుకొచ్చింది.
బెస్ట్ ప్లాన్
BSNL రూ.897 ప్రీపెయిడ్ ప్లాన్.. 180 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్, రోజూ 100 smsలు లభిస్తాయి. మొత్తం 90 జీబీ డేటా వస్తుంది. డేటాను త్వరగా ఉపయోగించినా 40 Kbps వేగంతో ఇంటర్నెట్‌ను అంతరాయం లేకుండా ఉపయోగించుకోవచ్చు. దీర్ఘకాల ప్లాన్‌ను రీఛార్జ్ చేయాలనుకునే వారికి ఈ ప్లాన్ చాలా బాగుంటుంది.
ఈ ప్లాన్ తక్కువ ధరకే దీర్ఘకాల వ్యాలిడిటీని అందించడమే కాకుండా, సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పోలిస్తే ఈ ప్లాన్ వినియోగదారులకు ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది.
5 రూపాయల లోపే
ఈ ప్లాన్‌ను రోజువారీగా చూస్తే, రోజుకు 5 రూపాయల లోపు అంటే రూ.4.98 ఖర్చు చేస్తే సరిపోతుంది. ఇదే విధంగా BSNL రూ.1,499 ధరతో వార్షిక ప్లాన్‌ను కూడా అందిస్తోంది. ఈ ప్లాన్‌లో మొత్తం 24జీబీ డేటా లభిస్తుంది. ఏడాది పొడవునా అంటే 365 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. దీనితో పాటు రోజుకు 100 SMSలు, అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి.
ఎన్ని ఆఫర్లో
ఇదే తరహాలో BSNL రూ.1,999 ధరతో వార్షిక ప్లాన్‌ను అందిస్తోంది. 365 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లో మొత్తం 600 జీబీ డేటా అందించబడుతుంది. అంతేకాకుండా అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. ఇవే కాకుండా హార్డీ గేమ్స్, ఛాలెంజర్ అరీనా గేమ్స్, గేమన్ & ఆస్ట్రోడెల్, గేమియం, లిజన్ పాడ్‌కాస్ట్, జింగ్ మ్యూజిక్ & BSNL ట్యూన్స్ వంటి సబ్‌స్క్రిప్షన్‌లు కూడా లభిస్తాయి.