సన్నీ లియోన్ ఇంటి పక్కనే అమితాబ్ బచ్చన్ కొత్త ఇల్లు.. అంత ఖర్చు పెట్టి ఎందుకు కొన్నాడో తెలుసా ?
సినీ ప్రపంచంలోని ప్రముఖులు, హీరోలు, హిరోయిన్లు కొత్త ఇల్లు లేదా ఆస్తులను కొనుగోలు చేస్తున్నట్లు తరచుగా వార్తలు వస్తుంటాయి. అయితే కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ హాట్ క్వీన్ సన్నీ లియోన్ కొత్త ఇల్లు కొన్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు బిగ్ బి కూడా ఆమె ఇంటి పొరుగువారై పోయారు.
అవును.. నిజమే...ఎందుకంటే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముంబైలో కోట్లు ఖర్చు చేసి ఈ డ్యూప్లెక్స్ ఫ్లాట్ కొనుగోలు చేశారు. విశేషం ఏంటంటే ఈ ఇల్లు సన్నీ లియోన్ ఇంటి పక్కనే ఉంది. ఒక వెబ్ సైట్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం, బిగ్ బి ఇప్పుడు 5184 చదరపు అడుగుల ఈ డూప్లెక్స్ ఇంటి యజమాని అయ్యారు. అమితాబ్ బచ్చన్ ఈ డ్యూప్లెక్స్‌ను క్రిస్టల్ గ్రూప్ 'అట్లాంటిస్ ప్రాజెక్ట్'లో కొనుగోలు చేశారు.
బిగ్ బి డ్యూప్లెక్స్ ఇంటి ధర
క్రిస్టల్ గ్రూప్ ఒక టైర్ -2 లెవెల్ బిల్డర్. బిగ్ బి ఈ ఆస్తిని డిసెంబర్ 2020లో కొనుగోలు చేశారు, కాని ఏప్రిల్ 2021లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. బిగ్ బి కూడా ఈ ఇంటి పై రూ .62 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. కరోనా వైరస్ సంక్రమణ కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం స్టాంప్ డ్యూటీలో మినహాయింపు కల్పించటంతో దీనివల్ల అమితాబ్ బచ్చన్ కి ప్రయోజనం చేకుర్చింది.
రియల్ ఎస్టేట్ కి మద్దతుగా ఇళ్ళపై స్టాంప్ సుంకాన్ని 5 శాతం నుండి 2 శాతానికి తగ్గించాలని 2020 ఆగస్టు 26న మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మినహాయింపు 31 డిసెంబర్ 2020 వరకు ఇచ్చింది. దీనిని మళ్ళీ 1 జనవరి 2021 నుండి 2021 మార్చి 31 వరకు 3 శాతానికి పెంచారు. అయితే మార్చి 31 తర్వాత కూడా స్టాంప్ డ్యూటీని పెంచవద్దని ప్రభుత్వం నిర్ణయించింది.
బిగ్ బి కొత్త ఇంటి గురించి మాట్లాడితే అతనికి ఒకటి కాదు రెండు కాదు మోత 6 కార్ల పార్కింగ్ స్థలం లభించింది. ఈ 28 అంతస్తుల భవనంలో 27వ అంతస్తులో ఈ డ్యూప్లెక్స్ ఫ్లాట్ ఉంది. కరోనా వ్యాధి వ్యాప్తి సమయంలో లగ్జరీ అపార్టుమెంటుల అమ్మకాలు పెరిగాయని జాప్‌కీ.కామ్ సహ వ్యవస్థాపకుడు సందీప్ రెడ్డి అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, నిపుణులు ఫ్లాట్లు కొంటున్నారు.
ఇప్పుడు ఈ డ్యూప్లెక్స్ ఇంటి కొనుగోలుతో అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ఇంటి పొరుగువారు అయ్యారు. మార్చి 28న సన్నీ లియోన్ రూ .16 కోట్లకు ఇకడ ఫ్లాట్ కొన్నాడు. ఈ ఇంటిని సన్నీ తన అసలు పేరులో కొనుగోలు చేసింది, అంటే కరణ్ జీత్ కౌర్ వోహ్రా. సన్నీ లియోన్ ఈ ఆస్తి కోసం రూ .48 లక్షల స్టాంప్ డ్యూటీని కూడా చెల్లించింది. సన్నీ లియోన్ ఈ కొత్త ఇల్లు అంధేరి వెస్ట్‌లోని అట్లాంటిస్ అనే భవనం 12వ అంతస్తులో ఉంది. ఈ 5బిహెచ్‌కే అపార్ట్మెంట్ ప్రాంతం 3,967 చదరపు మీటర్లు. ఈ అపార్ట్మెంట్లో మూడు కార్ పార్కింగ్ స్లాట్లు ఉన్నాయి.
అమితాబ్ బచ్చన్ త్వరలో మళ్ళీ కెబిసిలో కనిపించబోతున్నారు. కెబిసి సీజన్ 13 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈసారి కరోనా కారణంగా కేబిసి షో లో కొన్ని మార్పులు కూడా ఉంటాయి. ఈసారి షో డిజిటల్ సెలెక్షన్ అండ్ స్క్రీనింగ్ విధానాన్ని అవలంబిస్తోంది. అంతేకాకుండా సినిమాల గురించి మాట్లాడితే అమితాబ్ బచ్చన్ 'ఝండ్', 'బ్రహ్మాస్త్రా' చిత్రాల్లో కనిపించబోతున్నారు.