- Home
- Business
- Business Ideas: ఎవరికీ తెలియని బిజినెస్...నెలకు రూ. 10 లక్షలు తగ్గవు..ఫ్యూచర్‌లో మొత్తం ఈ బిజినెస్‌దే హవా
Business Ideas: ఎవరికీ తెలియని బిజినెస్...నెలకు రూ. 10 లక్షలు తగ్గవు..ఫ్యూచర్‌లో మొత్తం ఈ బిజినెస్‌దే హవా
వ్యాపారం చేయడమే మీ లక్ష్యం అయితే.. ఒక కొత్త వ్యాపారంతో మీ ముందుకు వచ్చేసాము ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు ప్రతి నెల ఒక లక్ష నుంచి 10 లక్షల రూపాయల వరకు సంపాదించే వీలుంది. అలాంటి ఓ చక్కటి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ బిజినెస్ చేయడం ద్వారా సీజన్లో సంబంధం లేకుండా నిరంతరం మీరు డబ్బు సంపాదించే అవకాశం ఉంది.

money
పర్యావరణం సమస్యకు ప్లాస్టిక్ గొడ్డలి పెట్టు అని శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో గగ్గోలు పెడుతున్నారు. దానికి పర్యావసరంగా పాలిథిన్ కవర్లను బ్యాన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాలిథీన్ కవర్లు షాపుల్లో కలిగి ఉంటే ఫైన్ సైతం వేసేందుకు మున్సిపాలిటీలు వెనకాడటం లేదు. దీంతో మార్కెట్లో పాలిథిన్ కవర్లు లభించక కస్టమర్లు ఇబ్బందులకు గురవుతున్నారు.
కాగితం లేదా వస్త్రంతో చేసిన సంచులను వాడదామంటే వాటి ధర మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ సంచుల వాడకం నెమ్మదిగా పెరుగుతుంది. తాజాగా బయోడిగ్రేడబుల్ పాలిథిన్ సంచులను మార్కెట్లో విరివిగా విక్రయించేందుకు పలు సంస్థలు సిద్ధం అవుతున్నాయి ప్రస్తుత మార్కెట్లో బయోడిగ్రేడబుల్ పాలిథిన్ సంచులు తయారు చేసే సంస్థలు తక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో మాత్రం వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉన్న ఈ బిజినెస్ రంగంలోకి మీరు ప్రవేశించడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది.
money
బయోడిగ్రేడబుల్ పాలిథిన్ సంచులను ప్రస్తుతం పలు సూపర్ మార్కెట్లలోనూ, మాల్స్ లోను విక్రయిస్తున్నారు. అయితే బయోడిగ్రేడబుల్ పాలిథిన్ సంచులను తయారు చేసే యూనిట్ ను స్థాపించడం అంత సులువైన విషయం కాదు కోట్లల్లో పెట్టుబడి అవసరం అవుతుంది. కానీ మీరు బయోడిగ్రేడబుల్ పాలిథిన్ సంచులను తయారీ యూనిట్ లో నుంచి కొనుగోలు చేసి రిటైల్ మార్కెట్లో విక్రయించడం ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది.
ముందుగా బయోడిగ్రేడబుల్ పాలిథిన్ సంచులను ఏఏ సంస్థలు తయారు చేస్తున్నాయో ఎక్కడ తయారు చేస్తున్నాయో మీరు వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన సమాచారం ఇంటర్నెట్లో పూర్తిస్థాయిలో లభిస్తుంది. మీరు నేరుగా తయారీదారుల వద్ద పాలిథిన్ సంచులను కొనుగోలు చేయవచ్చు అనంతరం మీ ప్రాంతంలో ఒక రిటైల్ షాపును ఓపెన్ చేసి పాలిథిన్ సంచులను హోల్సేల్గా అమ్మితే మంచి లాభం వచ్చే అవకాశం ఉంది.
ఎందుకంటే బయోడిగ్రేడబుల్ పాలిథిన్ సంచులకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. అంతేకాదు వీటిని వాడమని అటు ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది. ఈ సంచులను ప్రమాదకరమైనటువంటి ప్లాస్టిక్ తో కాకుండా సహజంగా లభించే వృక్ష సంబంధిత వస్తువులతోనే తయారు చేస్తున్నారు. ఇవి పర్యావరణానికి హానికరం కాదు. అందుకే బయోడేబుల్ పాలిటీ సంచులను తమ కస్టమర్ల కోసం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
అలాగే కష్టమైజ్డ్ సంచులను తయారు చేసేందుకు ఒక ప్రింటింగ్ మిషన్ కూడా మెయింటైన్ చేస్తే మంచిది. అంటే ఏదైనా సంస్థ బ్రాండ్ నేమ్ మీరు ఈ పాలిథిన్ సంచులపై ప్రింట్ చేసి విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం పొందే వీలుంది. అలాగే కిరాణా షాపులు కూరగాయల షాపులు ఇతర వ్యాపార సముదాయాలకు ఈ బయోడేబుల్ పాలిసిన్ సంచులపై అవగాహన కల్పించేలా కరపత్రాలను పంచండి. తద్వారా మీ వ్యాపారం పెరిగే అవకాశం ఉంది.