ఎలక్ట్రిక్ వాహనదారులకు బిగ్ రిలీఫ్.. త్వరలోనే హెచ్‌పిసిఎల్ పెట్రోల్ పంపులలో ఈవి ఫాస్ట్ ఛార్జర్లు..
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి సాధారణ ప్రజలలో ఒక సందేహం ఉంది. ఏంటంటే ఎలక్ట్రిక్ వాహనాల కోసం తగినంత సంఖ్యలో ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడం.
కానీ ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనదారుల సమస్య తొలగిపోనుంది. హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్) ప్రభుత్వ రంగ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సిఈఎస్‌ఎల్) తో చేతులు కలిపి భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేయనుంది. ఈ ఈవి ఛార్జింగ్ స్టేషన్లను ఇన్‌స్టాల్ చేయడానికి హెచ్‌పిసిఎల్ రిటైల్ అవుట్‌లెట్‌లను ఉపయోగించాలనే లక్ష్యంతో రాబోయే 10 సంవత్సరాలకు ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఈవి ఛార్జింగ్ స్టేషన్లు ముంబై, ఢిల్లీ ఎన్‌సిఆర్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, పూణేతో సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ ఈవి ఛార్జింగ్ పాయింట్లలో ఫాస్ట్ ఛార్జర్‌ల నుండి సాధారణ ఛార్జర్‌ల వరకు అన్ని రకాల ఛార్జింగ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇటీవల హెచ్‌పిసిఎల్ రిటైల్ అవుట్‌లెట్‌లలో దేశవ్యాప్తంగా పబ్లిక్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ పాయింట్ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి మరొక ఏజెన్సీతో జతకట్టింది.
"కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (CESL) - ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (EESL) పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ - హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) తో దేశంలోని అనేక నగరాల్లోని ఎంపిక చేసిన రిటైల్ అవుట్‌లెట్లలో చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి భాగస్వామ్యం కలిగి ఉంది. ఈ ఒప్పందం భారతదేశా ఇ-మొబిలిటీ మిషన్‌ను సాధించడానికి సహాయపడుతుంది.
హెచ్‌పిసిఎల్ దేశవ్యాప్తంగా 20,000 రిటైల్ అవుట్‌లెట్‌లతో భారతదేశంలోని ప్రముఖ చమురు కంపెనీలలో ఒకటి.