జీతాలు పొందే వారికి, పెన్షనర్లకు ఆర్‌బి‌ఐ గుడ్ న్యూస్.. ఎన్‌ఏ‌సి‌హెచ్ లభ్యతపై కీలక ప్రకటన

First Published Jun 4, 2021, 4:44 PM IST

న్యూ ఢీల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) జీతాలు, పెన్షనర్ల కోసం భారీ ప్రకటన చేసింది. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (ఎన్‌ఏ‌సి‌హెచ్) సర్వీస్ రోజుకు 24 గంటల పాటు,  వారంలోని ఏడు రోజులు పనిచేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) శుక్రవారం ప్రకటించింది.