మహిళలు.. మీ కోసమే ఈ బెస్ట్ స్కూటర్లు
మీకు తెలుసా? పురుషుల కోసం బైకులు, మహిళల కోసం స్కూటర్లు తయారు చేస్తాయి కంపెనీలు. అయితే అవసరాలు, సౌకర్యం కోసం వాటిని వీరు, వీటిని వారు కూడా ఉపయోగించేస్తుంటారు. అయితే ప్రత్యేకంగా మహిళలే ఉపయోగించే 5 బెస్ట్ స్కూటర్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి. మీరు స్కూటర్ కొనే ఆలోచనలో ఉంటే వీటిని ఒకసారి పరిశీలించండి.
భారతదేశంలో మహిళల కోసం తయారు చేసిన ఉత్తమ స్కూటర్ల జాబితాలో TVS స్కూటీ పెప్ ప్లస్, హోండా ఆక్టివా 6G, హీరో ప్లెజర్ ప్లస్, సుజుకి యాక్సెస్ 125, యమహా ఫాసినో 125 Fi హైబ్రిడ్ ఉన్నాయి. ఈ స్కూటర్ల ఫెసిలిటీస్, ఫీచర్స్, ధర, డిజైన్ల గురించి తెలుసుకుందాం రండి. 2025లో ఇవి మహిళల అవసరాలను తీర్చే బడ్జెట్ లోనే లభిస్తుండటం విశేషం.
TVS స్కూటీ పెప్ ప్లస్
ధర: రూ.65,000 - రూ.70,000
మైలేజ్: 50–55 కి.మీ/లీ
TVS స్కూటీ పెప్ ప్లస్ కాంపాక్ట్ సైజులో ఉంటుంది. దీని తేలికైన డిజైన్ కారణంగా మహిళలలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇది రద్దీగా ఉండే నగర వీధుల్లో సులభంగా నడపడానికి వీలుంటుంది. దీని 87.8 సిసి ఇంజిన్ వల్ల దీనిపై ప్రయాణం స్మూత్ గా ఉంటుంది. టెలిస్కోపిక్ సస్పెన్షన్, మొబైల్ ఛార్జింగ్ పోర్టులు, స్టైలిష్ కలర్ ఆప్షన్లు వంటి అదనపు ఫీచర్లు ఉండటంతో యువ రైడర్లకు చాలా నచ్చుతుంది.
హోండా ఆక్టివా 6G
ధర: రూ.75,000 - రూ.85,000
మైలేజ్: 45-50 కి.మీ/లీ
హోండా ఆక్టివా 6G స్కూటర్ మార్కెట్లో అగ్రస్థానంలో ఉంది. 109.5 సిసి ఇంజిన్ కలిగి ఉండటంతో ఇది ఎంత దూరమైనా ఇబ్బంది లేకుండా ప్రయాణిస్తుంది. దీనికి ఫ్యూయల్ ట్యాంకు మూత బయట ఉండటంతో పెట్రోల్ పోయించడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంజిన్ స్టార్ట్ కూడా చాలా సైలెంట్ గా జరుగుతుంది. యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లు ఉండటంతో మహిళా రైడర్లు ఎక్కువగా ఇష్టపడతారు. ఇతర మోడళ్ల కంటే కొంచెం బరువుగా ఉన్నప్పటికీ దాని డిజైన్, సున్నితమైన హ్యాండ్లింగ్ అన్ని వయసుల వారికి అనుకూలంగా ఉంటుంది.
హీరో ప్లెజర్ ప్లస్
ధర: రూ.70,000 - రూ.78,000
మైలేజ్: 50–55 కి.మీ/లీ
ప్రత్యేకంగా మహిళల కోసం రూపొందించిన స్కూటర్ హీరో ప్లెజర్ ప్లస్. ఇది తేలికైన నిర్మాణంతో పాటు శక్తివంతమైన 110.9 సిసి ఇంజిన్‌ను కలిగి ఉంది. దీని స్టైలిష్ డిజైన్, USB ఛార్జింగ్ పోర్ట్, బూట్ లైట్ వంటి ఫీచర్లు చాలా ఆకట్టుకుంటాయి. ఇది ఆధునిక మహిళలకు అనుకూలమైన ఎంపిక. ట్రెండీ కలర్స్‌లో లభిస్తుంది.
సుజుకి యాక్సెస్ 125
ధర: రూ.85,000 - రూ.95,000
మైలేజ్: 47–52 కి.మీ/లీ
మీరు పవర్ ఫుల్ స్కూటర్ కోసం చూస్తుంటే సుజుకి యాక్సెస్ 125 పనితీరు మీకు బాగా నచ్చుతుంది. ఇది మహిళలు నడపడానికి కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. దీని 124 సిసి ఇంజిన్ మంచి పనితీరును అందిస్తుంది. LED హెడ్‌ల్యాంప్‌లు, డిజిటల్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సౌకర్యవంతమైన సీటు స్కూటర్ నడపడానికి అనుకూలంగా ఉంటాయి.
యమహా ఫాసినో 125 Fi హైబ్రిడ్
ధర: రూ.85,000 - రూ.95,000
మైలేజ్: 55-60 కి.మీ/లీ
యమహా ఫాసినో 125 Fi హైబ్రిడ్ ఆధునిక సాంకేతికతతో తయారైంది. అంతేకాకుండా దీని రెట్రో స్టైల్ చూడగానే ఆకట్టుకుంటుంది. దీని హైబ్రిడ్ ఇంజిన్ మంచి మైలేజ్ ఇస్తుంది. ఈ స్కూటర్ వర్కింగ్ చాలా సున్నితంగా ఉంటుంది. సైలెంట్ స్టార్ట్, LED లైటింగ్ వంటి ఫీచర్లు ఈ స్కూటర్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. దీని తేలికైన డిజైన్ యువ మహిళా రైడర్లలో బాగా నచ్చుతుంది.