MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Business
  • 125cc ఇంజిన్ తో 60 కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే

125cc ఇంజిన్ తో 60 కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే

మీరు ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్ కోసం చూస్తున్నారా? అయితే ఇక్కడ రూ.లక్ష కంటే తక్కువ ధరలో లీటరుకు 60 కి.మీ. పైగా మైలేజ్ ఇచ్చే బైక్స్ ఉన్నాయి.  ఇవన్నీ125cc ఇంజిన్ కెపాసిటీ కలిగిన బైక్సే. వాటి ధరలు, ఫీచర్లను ఇక్కడ తెలుసుకోండి. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Dec 14 2024, 02:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఏడు, ఎనిమిదేళ్ల క్రితం అయితే బైక్ ధరలు కాస్త తక్కువ ఉండేవి కాని.. ప్రస్తుతం ఏ బైక్ అయినా రూ.లక్షకు పైగా ధర పలుకుతోంది. అయితే వాటి ఫీచర్స్ కూడా అదే రేంజ్ లో అప్ డేట్ అయి వస్తున్నాయి. పవర్, పెర్ఫార్మెన్స్, మైలేజ్‌ ఇలా అన్నింటిలోనూ బెస్ట్ ఇవ్వడానికి టూ వీలర్ కంపెనీలు పోటీపడుతున్నాయి. రోజువారీ ప్రయాణాలకు, లాంగ్ రైడ్‌లకు అనుకూలంగా ఉండే అనేేక కంపెనీల బైకులు మార్కెట్ లో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. వాటిల్లో రూ.లక్ష లోపు ధర ఉండి, 60 కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్ వివరాలు ఇక్కడ ఉన్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

TVS రైడర్ 125

TVS రైడర్ 125 రూ. 85,000 నుండి రూ. 1.04 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో మార్కెట్ లో అందుబాటులో ఉంది. ఈ బైక్ ఆరు వేరియంట్లలో లభిస్తుంది. ఈ బైక్‌లో 11.2 bhp పవర్, 11.75 Nm టార్క్‌తో 125cc ఇంజిన్ ఉంది. ఇది లీటరకు 67 km మైలేజ్‌ ఇస్తుంది. ఇది బెస్ట్ ఇంజన్ సెగ్మెంట్ లో ఒక బైక్ గా గుర్తింపు పొందింది. 

35

హోండా SP 125

హోండా SP 125 మంచి ధర, పెర్ఫార్మెన్స్ కలిగిన బైక్. 10.72 bhp పవర్, 10.9 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తూ బెస్ట్ ఇంజిన్ కెపాసిటీతో ఈ బైక్ నడుస్తుంది. రూ. 87,468 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర కలిగిన ఈ బైక్ వేర్వేరు డీలర్ల దగ్గర ఇంకా తక్కువ ధరకు లభిస్తుంది. స్టైలిష్ బైక్ కోసం చూసేవారికి ఇది సరైనది. 65 kmpl మైలేజ్ ఇస్తుంది. రోజువారీ ప్రయాణాలకు ఈ బైక్ చాలా అనుకూలంగా ఉంటుంది.

45

హీరో ఎక్స్‌ట్రీమ్ 125R

హీరో మోటోకార్ప్ ఎక్స్‌ట్రీమ్ 125R స్టైలిష్ లుక్ కలిగిన బెస్ట్ బైక్స్ లో ఒకటి. దీని ప్రారంభ ధర రూ. 95,000. 125cc ఇంజిన్, 11.4 bhp పవర్, 10.5 Nm టార్క్‌ కెపాసిటీతో పనిచేస్తుంది. ఈ బైక్ మైలేజ్ వచ్చేసి లీటరుకు 66 km పరుగెడుతుంది. ఇది యువ రైడర్లలో బాగా నచ్చిన బైక్ గా ఫేమస్ అయ్యింది. 

55

బజాజ్ పల్సర్ N125

బజాజ్ పల్సర్ N125 స్పోర్టి డిజైన్, మంచి పెర్ఫార్మెన్స్‌తో యువతను ఆకర్షిస్తున్న బైక్ ఇది. మార్కెట్ లో దీని ధర రూ. 92,704 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతోంది. ఈ బైక్‌లోని 125cc ఇంజిన్ 11.8 bhp పవర్, 11 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరుకు 60 km మైలేజ్‌ ఇస్తుంది. కాలేజీ యువతకు బాగా నచ్చిన బైకుల్లో ఇది ఒకటి. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Today: బంగారం ధర మళ్లీ రికార్డు కొట్టబోతోందా? స్థిరంగానే ఉన్నా.. అసలు టెన్షన్ ఇప్పుడే
Recommended image2
Indian Railway: రాత్రుళ్లు ఎవ‌రైనా రైల్వే ట్రాక్‌ను క‌ట్ చేస్తే ఎలా తెలుస్తుంది.?
Recommended image3
Onion Price : తెలుగోళ్లూ రెడీగా ఉండండి.. బస్తాల కొద్దీ ఉల్లిపాయలు కొనే టైమొచ్చింది, మిస్ అయ్యారో అంతే సంగతి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved