స్టైలిష్ లుక్ ఉండే ఫ్యామిలీ బైక్ కావాలా? ఇవి ట్రై చేయండి
తక్కువ ఖర్చుతో రోజు వారీ పనులకు అవసరమైన చక్కటి బైక్ కావాలా? ఇక్కడున్న బైకులు ఎక్కువ మైలేజ్ ఇవ్వడంతో పాటు మార్కెట్లో తక్కువ ధరకు కూడా లభిస్తాయి. ఈ బైకుల ఫీచర్స్, ధర తదితర వివరాలు ఇక్కడ ఉన్నాయి.

హీరో స్ప్లెండర్, మైలేజ్ - 70 కి.మీ.
ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్యామిలీ బైక్ హీరో స్ప్లెండర్ . ఈ బైక్ 97cc ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ బైక్ వచ్చిన కొత్తలో 70 కి.మీ మైలేజ్ ఇస్తుందని జనాల్లో బాగా క్రేజ్ వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో అంత మైలేజ్ రాకపోయినా కమ్యూటర్ బైక్ విభాగంలో ఇది ఒక బెస్ట్ బైక్ గా నిలిచింది.
ఈ బైక్ సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. దాని సీటు ట్యాంక్ నుండి బైక్ టెయిల్ లైట్ వరకు పొడవుగా ఉంటుంది. అందువల్ల ముగ్గురు హాయిగా కూర్చొని ప్రయాణించొచ్చు. ఈ బైక్ 8000 rpm వద్ద 7.9 bhp పవర్, 6000 rpm వద్ద 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
హోండా షైన్ మైలేజ్ - 55 కి.మీ.
ఈ బైక్ ధర 81,251 రూపాయలు. ఇది CB షైన్ స్ప్లెండర్ కంటే కొంచెం శక్తివంతమైనది. ఎందుకంటే ఇది 123cc ఇంజిన్‌తో నడుస్తుంది. ఈ బైక్ లీటరు పెట్రోల్‌కు 55 kmpl మాత్రమే మైలేజ్ ఇస్తుంది. రోజువారీ ప్రయాణికులకు వీలుగా ఉండటంతో పాటు స్టైల్ కి, మైలేజ్ కి ప్రసిద్ధి చెందింది.
HF డీలక్స్ మైలేజ్ 65 కి.మీ.
HF డీలక్స్ కొత్త డిజైన్ తో మార్కెట్లోకి వచ్చేసింది. మంచి పనితీరు, మైలేజ్, స్టైల్ లుక్ కలగలిసి రావడంతో ఈ బైక్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. రోజువారీ ప్రయాణాలకు నమ్మకమైన బైక్ కోసం చూస్తున్న వారికి ఈ బైక్ సరైన ఎంపిక. 97.2cc ఇంజిన్‌తో నడిచే ఈ బైక్ 8000 rpm వద్ద 8.02 bhp పవర్, 6000 rpm వద్ద 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 65 కి.మీ. వరకు మైలేజ్ ఇస్తుంది.
TVS స్పోర్ట్ మైలేజ్ 80Kmpl
TVS కంపెనీ కమ్యూటర్ బైక్ మార్కెట్లో బాగా ప్రసిద్ధి చెందింది. ఈ బైక్ 109.7cc ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 4500 rpm వద్ద 8.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వాహనం పవర్ అవుట్‌పుట్ 7350 rpm వద్ద 8.18 bhpగా ఉంది. TVS మైలేజ్ లీటరుకు 80 కి.మీ ఇస్తుంది. కానీ నిజ జీవిత పరిస్థితుల్లో ఒక రైడర్ లీటరుకు 60 నుండి 72 కి.మీ వరకు ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.
TVS రైడర్ మైలేజ్ 56.7 kmpl
ఇటీవల కాలంలో అత్యంత అనుకూలమైన బైక్‌లలో రైడర్ ఒకటిగా నిలిచింది. ఈ బైక్ ఫ్యూచరిస్టిక్ డిజైన్‌ను కలిగి ఉంది. మంచి లుక్స్ ఉన్న కమ్యూటర్ బైక్ కావాలంటే ఇది మీకు సరిగ్గా సరిపోతుంది. రైడర్ 124.8cc ఇంజిన్‌తో నడుస్తుంది. ఇది 7500 rpm వద్ద 11.2 bhp పవర్, 6000 rpm వద్ద 11.2 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. లీటరుకు 56.7 కి.మీ. మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.