MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • రూ.6 లక్షల కంటే తక్కువకు లభించే బెస్ట్ కార్లు ఇవే!

రూ.6 లక్షల కంటే తక్కువకు లభించే బెస్ట్ కార్లు ఇవే!

కరోనా తర్వాత కార్లకు డిమాండ్ పెరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్క కుటుంబానికి కారు కంపల్సరీ అయిపోయింది. ప్రజల అవసరాలు గుర్తించిన చాలా కంపెనీలు తక్కువ ధరతో కార్లను తయారు చేసి మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. మీ బడ్జెట్ రూ.6 లక్షలు అయితే ఆ ధరకు లభించే కార్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి.  హ్యుండై, టాటా, మారుతి తదితర కంపెనీలు తక్కువ ధరకు ఎక్కువ సౌకర్యాలు కల్పిస్తూ బెస్ట్ కార్లను అందిస్తున్నాయి. 

3 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Nov 03 2024, 01:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కార్లకు డిమాండ్ బాగా పెరిగింది. కుటుంబ అవసరాల కోసం కారు ఇప్పుడు అత్యవసర వస్తువు అయిపోయింది. ప్రయాణ సమయంలో సౌకర్యంతో పాటు, టైం కలిసి రావాలని కారు లేని వారు అద్దెకు కారు తీసుకొని ప్రయాణాలు చేస్తున్నారు. ముఖ్యంగా కరోనా నేర్పిన పాఠం ఎవరూ మర్చిపోలేరు. ఆ సమయంలో కారు ఎంత అవసరమో అందరికీ అర్థమైంది. అందుకే కరోనా తర్వాత కార్లు కొనేవాళ్ళు ఎక్కువయ్యారు. కార్ల కంపెనీలు కూడా తక్కువ ధర కార్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. వాటిల్లో కొన్ని బెస్ట్ బడ్జెట్ కార్ల గురించి తెలుసుకుందాం. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

హ్యుండై గ్రాండ్ ఐ10 నియోస్

హ్యుండై గ్రాండ్ ఐ10 నియోస్ తక్కువ ధరలో దొరికే మంచి కారు. దీని ప్రారంభ వేరియంట్ ధర రూ.5.84 లక్షలు (ఎక్స్‌షోరూమ్). ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో చాలా సెక్యూర్ గా, సేఫ్టీగా ఉంటుంది ఈ కారు. 1.2 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ తో ఈ కారు పనిచేస్తుంది. CNG ఆప్షన్ కూడా ఇందులో ఉంది. 

గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ ఎరా, మాగ్నా, స్పోర్ట్జ్ మరియు ఆస్టాతో సహా నాలుగు వేరియంట్స్ లో లభిస్తుంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ మారుతి సుజుకి స్విఫ్ట్, టాటా పంచ్, రెనాల్ట్ క్విడ్, సిట్రోయెన్ C3 లకు పోటీగా ఉంది.

36

టాటా పంచ్

టాటా పంచ్ కూడా తక్కువ ధరలో దొరుకుతుంది. దీని ఎక్స్-షోరూమ్ ప్రారంభ వేరియంట్ ధర రూ.5.99 లక్షలు. 1.2 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ఉంది. 5 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్స్‌లో వస్తుంది. CNG ఆప్షన్ కూడా ఉంది. 

పంచ్ నాలుగు వేర్వేరు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. అవి ప్యూర్, అడ్వెంచర్, అకంప్లిష్డ్ క్రియేటివ్ మోడల్స్. పంచ్ ఇప్పుడు 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ తో పాటు వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్‌తో వస్తోంది. ఇది ఆటోమేటిక్ హెడ్‌లైట్‌లు, వెనుక వెంట్‌లతో కూడిన ఆటో AC, సెమీ-డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ను కలిగి ఉంది.  టాటా 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కోసం 20.09 kmpl ఇస్తుంది. AMT ట్రాన్స్‌మిషన్ కోసం 18.8 kmpl మైలేజీని ఇస్తుందని కంపెనీ ప్రకటించింది.

 

 

 

46

హ్యుండై ఎక్స్‌టర్

ధర కాస్త ఎక్కువైనా మినీ SUVలా ఉండే హ్యుండై ఎక్స్‌టర్ మీకు, మీ కుటుంబ ప్రయాణానికి మంచి ఆప్షన్. దీని ఎక్స్షో రూమ్ ధర రూ.6.12 లక్షల నుండి మొదలవుతుంది. 5 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్స్‌లో వస్తుంది. CNG ఆప్షన్ కూడా ఉంది.

హ్యుందాయ్ ఎక్స్టర్ ఏడు వేర్వేరు వేరియంట్‌లలో వస్తుంది. అదనంగా హ్యుందాయ్ ఇటీవల ఎక్స్టర్‌లో స్ప్లిట్ సిలిండర్ CNG సెటప్‌ను పరిచయం చేసింది. ఇది S, SX, SX నైట్ వేరియంట్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది.

LED DRLలు, 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కనెక్ట్ చేయబడిన కార్ టెక్, సెమీ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, ఆటో AC వంటి కొన్ని హైలైట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సన్‌రూఫ్, డ్యుయల్ కెమెరాలతో కూడిన డాష్ క్యామ్ కూడా ఉన్నాయి.

 

56

టాటా టియాగో

టాటా టియాగో మంచి ఫీచర్స్‌తో పాటు సేఫ్టీ కూడా బాగుంటుంది. 1.2 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ఉంది. 5 స్పీడ్ మాన్యువల్, AMT వేరియంట్స్‌లో వస్తుంది. దీని ప్రారంభ వేరియంట్ ధర రూ.5.59 లక్షలు. 

టియాగోలో 5 వేరియంట్స్ ఉన్నాయి. XE, XM, XT (O), XT, XZ+ మోడల్స్ ఉన్నాయి. టాటా టియాగో న్యూ గ్రిల్, రీవర్క్డ్ ఫ్రంట్ బంపర్, న్యూ ఎయిర్ డ్యామ్, బ్లాక్ ఓఅర్ విఎంఎస్, 15-ఇంచ్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌ తదితర ఫీచర్స్ ఉన్నాయి. టాటా టియాగో లోపలి భాగంలో ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 7-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి సదుపాయాలు ఉన్నాయి.

66

మారుతి సుజుకి వ్యాగన్ఆర్

తక్కువ ధరలో దొరికే మరో మంచి కారు మారుతి సుజుకి వ్యాగన్ఆర్. ఇది 1.0 లీటర్, 1.2 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్స్‌లో వస్తుంది. దీని ప్రారంభ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.55 లక్షలు. CNG వేరియంట్ కూడా ఉంది. 

మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ 4 వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. అవి LXi, VXi, ZXi, ZXI+. దీనికి పోటీగా టాటా టియాగో, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఉన్నాయి.

 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Saving Tips: మీ జీతంలో ఎంత దాస్తున్నారు? సేవింగ్ చేసేవాళ్లలో మీరు ఏ కేటగిరీ?
Recommended image2
Gold Price Hike: అమెరికా ఎన్నికల తర్వాత మారిన మార్కెట్ లెక్కలు.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు
Recommended image3
Kavya Maran: రూ. 26000 కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలు.. SRH పాప వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved