Jio vs Airtel vs Vi: తక్కువ ధరలో బెస్ట్ అన్‌లిమిటెడ్ 5G ప్లాన్స్ ఇవే..
Jio vs Airtel vs Vi: జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (Vi) మధ్య అన్‌లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్‌ల పోటీ తీవ్రమైంది. జియో, ఎయిర్‌టెల్ ఒకే రేంజ్‌లో గణనీయమైన డేటా, OTT బెనిఫిట్స్ అందిస్తుండగా, Vi ప్రత్యేకంగా వారాంతపు రోల్‌ఓవర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

5G సేవలలో గట్టిపోటీ
భారత టెలికాం రంగంలో 5G సేవల విషయంలో గట్టిపోటీ నెలకొంది. వినియోగదారుల దృష్టిని ఆకర్షించేందుకు రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా (Vi) ఒకదానికొకటి పోటీగా నిలుస్తున్నాయి. ఈ కంపెనీలు తక్కువ ధరలో అపరిమిత డేటా, ఆకర్షణీయమైన అదనపు ప్రయోజనాలతో 5G ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి.
జియో, ఎయిర్‌టెల్ లకు పోటీగా వీఐ
మెరుగైన 5G కనెక్టివిటీ, సమగ్ర డిజిటల్ సేవలతో జియో, ఎయిర్‌టెల్‌లు జూలై 2025 నాటికి టెలికాం రంగంలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. వీటికి పోటీ గా వీఐ( Vi) వినియోగదారులను ఆకర్షించేందుకు అపరిమిత నైట్ డేటా, వారాంతపు డేటా రోల్‌ఓవర్ వంటి ప్రత్యేక ఫీచర్లతో వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది.
అన్ లిమిటెడ్ 5G ప్లాన్‌లలో టాప్ ఆఫర్లు:
జియో, ఎయిర్‌టెల్ లు రూ. 3,599 లకే వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తున్నాయి. ఇవి 365 రోజుల చెల్లుబాటుతో, రోజుకు 2 నుంచి 2.5GB వరకు డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు అందిస్తున్నాయి. వీటితో పాటు జియో అదనంగా JioTV, JioCinema, JioCloud లాంటి డిజిటల్ సర్వీసులు ఉచితంగా లభిస్తాయి.
ఇక ఎయిర్‌టెల్ Wynk Music, Hellotunes, Apollo 24/7 వంటి సేవలను అందిస్తున్నాయి. మరోవైపు వీఐ (Vi) రూ. 3,699 లతో వార్షిక ప్లాన్ అందిస్తోంది. ఇందులో రోజుకు 2GB డేటాతో పాటు, అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ , అన్ లిమిటెడ్ నైట్ డేటా, వారాంతపు డేటా రోల్‌ఓవర్ వంటి ప్రత్యేక ఫీచర్లు అందిస్తుంది.
మిడ్-రేంజ్ 5G ప్లాన్స్
రూ. 859లతో జియో 84 రోజుల చెల్లుబాటు గల మిడ్-రేంజ్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు రోజుకు 2GB డేటా, అపరిమిత కాల్స్, SMSలు లభిస్తాయి.
ఎయిర్‌టెల్ రూ. 979 ప్లాన్‌లో కూడా రోజుకు 2GB డేటా లభిస్తుంది. అంతేకాకుండా, RewardsMini, Xstream Play వంటి డిజిటల్ యాడ్-ఆన్‌లు అందించబడుతున్నాయి. అయితే, ఇది జియో ప్లాన్ కన్నా కొంచెం ఖరీదైనదే.
మరోవైపు, Vi రూ. 859 ప్లాన్‌లో రోజుకు 1.5GB డేటా కలిగి ఉండగా, అదనంగా రాత్రిపూట అపరిమిత డేటా వినియోగం, వారాంతపు డేటా రోల్‌ఓవర్ వంటి ప్రత్యేక ఫీచర్లు లభిస్తున్నాయి.
తక్కువ ధరలో 5G ప్లాన్‌లు: ఎయిర్‌టెల్, Vi,జియోల మధ్య పోరు
తక్కువ ధరలో డేటా ప్లాన్‌లను కోరే వినియోగదారుల కోసం, టెలికాం సంస్థలు వేర్వేరు ఆఫర్స్ అందిస్తున్నాయి.
ఎయిర్‌టెల్ రూ 299 ప్లాన్: Wynk Music, Hellotunes వంటి డిజిటల్ ప్రయోజనాలతో పాటు 5 జీ అన్ లిమిటెడ్ డేటాను అందిస్తుంది.
Vi రూ. 349 ప్లాన్: రోజుకు 1.5GB డేటా లభిస్తుంది, అయితే ఎటువంటి అదనపు యాప్‌లు అందుబాటులో ఉండవు.
జియో రూ 249 ప్లాన్: 28 రోజుల చెల్లుబాటు గల ఈ ప్లాన్ ద్వారా నెలవారీగా రోజుకు 1GB డేటా లభిస్తుంది.
ఈ విషయాలను గుర్తు పెట్టుకోండి
సరైన 5G ప్లాన్ ఎంపిక వ్యక్తిగత అవసరాలపై ఆధారపడి ఉంటుంది. వారాంతాల్లో లేదా రాత్రిపూట ఎక్కువగా డేటాను ఉపయోగించే వినియోగదారులకు Vi అందించే ప్లాన్‌లు బెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే వీఐ అపరిమిత నైట్ డేటా, వారాంతపు డేటా రోల్‌ఓవర్ వంటి సెష్పల్ బెన్ఫిట్స్ అందిస్తుంది. ఇక బెస్ట్ నెట్‌వర్క్, 5G కనెక్టివిటీ, వినోదానికి సంబంధించిన డిజిటల్ బండిల్స్‌ను కోరే వినియోగదారులకు Jio,Airtel ప్లాన్‌లు సరైన ఎంపికగా నిలుస్తాయి. మీకు తగిన 5G ప్లాన్‌ను ఎంచుకునే ముందు, మీ ప్రాంతంలో నెట్‌వర్క్ కవరేజ్, అవసరమైన డేటా పరిమితి, బండిల్ ఆఫర్లు వంటి అంశాలను గమనించి నిర్ణయం తీసుకోవడం అత్యంత అవసరం.