జులై నెలలో 15 రోజుల పాటు బ్యాంకులు క్లోజ్.. ఈ తేదీలను గుర్తు పెట్టుకోండి..
న్యూ ఢీల్లీ: కొద్దిరోజుల క్రితం లాక్ డౌన్ కారణంగా బ్యాంకుల పనివేళలలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. తరువాత లాక్ డౌన్ సడలింపుతో యధావిధిగా బ్యాంకుల పనివెలలు కొనసాగుతునున్నాయి. మరికొద్దిరీజులలో జూన్ నెల ముగిసి జులై నెల రాబోతుంది.
మీరు ఏదైనా బ్యాంకుకు సంబంధించిన పని చేయాలనుకుంటే ముందుగా బ్యాంకు పని రోజులు, సెలవులు తెలుసుకోవాల్సి ఉంటుంది. జూలై నెలలో మీ బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించే ముందు బ్యాంకులు ఎప్పుడు మూసివేసి ఉంటాయో, ముఖ్యమైన రోజుల జాబితాను మీరు గుర్తుంచుకోవాలి.
ఆన్‌లైన్ బ్యాంకింగ్ కార్యకలాపాలు కొనసాగుతూనే ఉన్నప్పటికీ, జూలైలో బ్యాంకింగ్ కార్యకలాపాలు మూసివేయబడే కొన్ని రోజులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) హాలిడే క్యాలెండర్ జాబితా ప్రకారం జులై నెలలో మొత్తం 15 రోజులు బ్యాంకులు మూసివేయబడతాయి, మిగిలిన రోజులలో శని, ఆదివారాల సెలవులు ఉంటాయి. అయితే వివిధ రాష్ట్రాల్లో బ్యాంకింగ్ సెలవులు మారవచ్చు.
ఏదేమైనా బ్యాంకు సెలవులు వివిధ రాష్ట్రాల్లో మారుతూ ఉంటాయి. బ్యాంకింగ్ సెలవులు నిర్దిష్ట రాష్ట్రాల్లో జరుపుకునే పండుగలు లేదా ఆ రాష్ట్రాల్లో నిర్దిష్ట సందర్భాల నోటిఫికేషన్‌పై కూడా ఆధారపడి ఉంటాయి.
జూలై 2021 నెలలో వచ్చే బ్యాంక్ సెలవుల జాబితా..
హాలిడేస్ డిస్క్రిప్షన్
కాంగ్ (రథ జత్ర ) / రథ యాత్ర: జూలై 12
భాను జయంతి: జూలై 13
దృక్ప శేచి : జూలై 14
హరేల : జూలై 16
యు టిరోట్ సింగ్ డే / కర్చీ పూజ: జూలై 17
గురు రింపోచి తుంగ్ కార్ శేచి: జూలై 19
బక్రీద్ : జూలై 20
బక్రి ఈద్ (ఇద్-ఉల్-జుహా) (ఈద్-యుఐ-అధా): జూలై 21
కెర్ పూజ: జూలై 31
పై బ్యాంక్ సెలవులు కాకుండా నెలలో రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలు ఈ క్రింది తేదీలలో వస్తున్నాయి:
4 జూలై - ఆదివారం
జూలై 10 - నెలలో రెండవ శనివారం
11 జూలై - ఆదివారం
18 జూలై - ఆదివారం
24 జూలై - నెలలో నాలుగవ శనివారం
జూలై 25 - ఆదివారం
స్టేట్ డిక్లీరేడ్ హాలిడేస్ ప్రకారం పైన పేర్కొన్న సెలవులు వివిధ ప్రాంతాలలో వర్తిస్తాయి, అయితే గెజిటెడ్ సెలవులకు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి. మీరు ఈ సెలవులను దృష్టిలో పెట్టుకొని మీరు బ్యాంక్ లావాదేవీ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోండీ.