లేటెస్ట్ Ather 450 ఏం స్టైల్ గా ఉందో: ఫీచర్స్ కూడా అదుర్స్
అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో ఏథర్ 450 కూడా ఒకటి. ఇప్పుడు ఈ స్కూటర్ కి లేటెస్ట్ మోడల్ వచ్చేసింది. ఏథర్ 450-2025 మోడల్ ఇటీవలే ఇండియాలో లాంచ్ అయ్యింది. ఆ స్కూటర్ ఫీచర్స్ తెలుసుకుందాం రండి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఇండియా ఎలక్ట్రిక్ యుగంలోకి అడుగు పెట్టేసింది. ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడవుతున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు వాటి రెగ్యులర్ వాహనాల తయారీతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల తయారీని కూడా ప్రారంభించాయి. హీరో, హోండా, టీవీఎస్, బజాజ్ వంటి దిగ్గజ కంపెనీలు కూడా వాటి పెట్రోల్ వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలు కూడా తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి.
ఇతర కంపెనీలే ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేస్తుంటే ప్రత్యేకతంగా ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసే కంపెనీలు లేటెస్ట్ అప్ డేట్స్ తో కొత్త మోడల్స్ ని విడుదల చేస్తున్నాయి. Ather 450 తన 2025 మోడల్ ను ఇటీవల ప్రారంభించింది. అధునాతన ఫీచర్లు, మెరుగైన పనితీరు, అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉన్న ఈ స్కూటర్ కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ భావిస్తోంది.
Ather 450 అధునాతన మోడల్ లో డిజిటల్ స్పీడోమీటర్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డిజిటల్ ట్రిప్ మీటర్, ఓడో మీటర్, బ్లూటూత్ కనెక్టివిటీ, USB ఛార్జింగ్ పోర్ట్, సేఫ్టీ బ్రేకింగ్ సిస్టమ్, ట్యూబ్‌లెస్ టైర్లు, అల్లాయ్ వీల్స్ ఇలా లేటెస్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
Ather 450 స్కూటర్ ఏరోడైనమిక్ డిజైన్ ను కలిగి ఉంది. కొత్త కలర్ స్కీమ్, గ్రాఫిక్స్ తో తయారైంది. అందువల్ల దాని కొత్త లుక్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. LED లైట్లు లేటెస్ట్ మోడల్ గా తయారయ్యాయి. చాలా పవర్ ఫుల్ గా ఉండటం వల్ల ఎక్కువ కాంతినిస్తాయి. ఈ స్కూటర్ బిల్డ్ క్వాలిటీ చాల పర్ఫెక్ట్ గా ఉంది. లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండటం వల్ల వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటాయి.
Ather 450 లేటెస్ట్ స్కూటర్ 3.7 kWh బ్యాటరీతో పనిచేస్తుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 130 కి.మీ రేంజ్ వరకు పరుగులు పెడుతుంది. శక్తివంతమైన మోటార్ ఇందులో ఫిక్స్ చేశారు. ఫాస్ట్ గా ఛార్జింగ్ ఎక్కే కెపాసిటీ ఉండటం వల్ల రోజువారీ ప్రయాణానికి అనువైన స్కూటర్ అవుతుంది. ఇందులో 3 రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. మీ రైడింగ్ ప్రాధాన్యత ఆధారంగా మోడ్ మార్చుకోవచ్చు.
మీరు నగరంలో ప్రయాణిస్తున్నా లేదా లాంగ్ రైడ్‌లకు వెళ్తున్నా, ఏథర్ 450 మీకు అబ్ధుతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.1.47 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది విభిన్న వేరియంట్‌లలో కూడా అందుబాటులో ఉంది.