MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • రూ.350, రూ.5 కరెన్సీ నోట్లు రానున్నాయా? RBI ఏమంటోంది

రూ.350, రూ.5 కరెన్సీ నోట్లు రానున్నాయా? RBI ఏమంటోంది

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కొత్తగా రూ.350, రూ.5 కరెన్సీ నోట్లు ను విడుదల చేస్తుందని సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది. వార్తే కాకుండా ఆ ఫోటోలు కూడా షేర్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలో నిజమెంత? RBI ఏం చెబుతోందో ఇప్పుడు తెలుసుకుందాం.     

2 Min read
Author : Naga Surya Phani Kumar
| Updated : Jan 25 2025, 03:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

నల్ల ధనాన్ని అరికట్టడానికి పెద్ద నోట్ల రద్దే మార్గమని RBI భావించింది. అందుకే 2016 పాత రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను రద్దు చేశారు. ఇది అప్పట్లో పెద్ద సంచలనం. ఆ తర్వాత ఆర్‌బీఐ కొత్త రూ.500, రూ.2000 కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టింది. పెద్ద నోట్ల వల్ల నల్ల ధనం పెరుగుతుందని భావించిన ఆర్బీఐ రూ.1000 కరెన్సీ నోటు కంటే పెద్దదైన రూ.2000 నోటును తీసుకు రావడం వెనుక ఆంతర్యం జనానికి అర్థం కాలేదు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అయితే ఆ తర్వాత కూడా కొత్త రూ.200 నోట్లను ఆర్బీఐ విడుదల చేసింది. ఇలా నోట్లు మార్పు వల్ల నల్లధనం అరికట్టడం సంగతి ఎలా ఉన్నా దొంగ నోట్ల ముద్రణ, చలామణి తగ్గుతాయని ఆర్బీఐ చెబుతోంది.

2023లో మరోసారి RBI నోట్ల రద్దు దిశగా అడుగులు వేసింది. చలామణిలో ఉన్న అతిపెద్ద కరెన్సీ నోటు అయిన రూ. 2,000 నోటును వెనక్కు తీసుకోవడం ప్రారంభించింది. 2016లో చేసినట్లుగా ఒక్కసారిగా రద్దు చేయకుండా రూ.2000 నోటును వెనక్కు తీసుకోవడం ప్రారంభించింది. చలామణిలో ఉంచుతూనే బ్యాంకులకు వచ్చిన వాటిని అక్కడే ఆపేసేలా ఆదేశాల్చింది. ఇలా 2024 చివరికి దాదాపుగా 2000 నోట్లు ఆర్బీఐ దగ్గరకు వచ్చేశాయి. 

35

రూ.2000 నోటు ఉపసంహరణతో ప్రస్తుతం రూ. 500 నోటు దేశంలోనే అతిపెద్ద డినామినేషన్ కరెన్సీ నోటుగా మారింది. అయితే టీవీలు, న్యూస్ పేపర్ల కంటే విస్తృతంగా సోషల్ మీడియా అందుబాటులో ఉండటంతో ఎక్కడ ఏం జరిగినా వెంటనే ఆ విషయాలు నిమిషాల్లో దేశ వ్యాప్తంగా వైరల్ అయిపోతున్నాయి.  అలా ఇటీవల రూ. 350, రూ. 5 కరెన్సీ నోట్ల ఫోటోలని చెబుతూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఈ రూ. 350, రూ. 5 కరెన్సీ నోట్లను ఆర్‌బీఐ జారీ చేసినట్లు వార్త ప్రచారం అవుతోంది. 
 

45

అయితే ఇవి కొత్త చిత్రాలు కావని, మూడేళ్ల క్రితం ఇలాగే ఈ ఫోటోలు వైరల్ అయ్యాయని తెలిసింది. ఇప్పుడు కూడా కొందరు కావాలని ఈ ఫోటోలను మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. ఇవన్నీ నకిలీ ఫోటోలు. దేశంలో కొత్త డినామినేషన్ నోట్లను విడుదల చేయలేదని ఆర్‌బీఐ తెలిపింది. ప్రస్తుతం ఉన్న డినామినేషన్లు రూ.5, రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500. ఇవి కాకుండా రూ.2, రూ.5 నోట్లు కూడా ఉన్నాయి. అయితే వాటి ముద్రణను ఆర్బీఐ నిలిపివేసింది. అయినప్పటికీ మార్కెట్‌లో ఉన్నవి చట్టబద్ధంగా ఉపయోగించాలని ఆర్బీఐ తెలిపింది. 
 

55

RBI ఏం చెబుతోంది... 
"ఏదైనా కొత్త కరెన్సీ లేదా కాయిన్ ను విడుదల చేసే హక్కు ఒక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మాత్రమే ఉంటుంది. ఇలాంటివి ఏవైనా విడుదల చేసినప్పుడు కచ్చితంగా ప్రకటిస్తాం. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రకటన కాకుండా ఎవరు ఇలాంటివి చెప్పినా నమ్మవద్దు. ప్రస్తుతం రూ. 2, రూ. 5, రూ. 10, రూ. 20, రూ. 50, రూ. 100, రూ. 200, రూ. 500 మరియు నోట్లు, నాణేలు మాత్రమే చలామణిలో ఉన్నాయి." 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Idea : ఒకేసారి రూ.20 వేలు పెట్టుబడి పెడితే చాలు.. ఈజీగా నెలకు రూ.50,000 సంపాదించే సూపర్ బిజినెస్
Recommended image2
Gold Price Today: పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. కుప్పకూలిన బంగారం ధరలు
Recommended image3
Bank Holidays : జూలైలో ఏకంగా 12 రోజుల బ్యాంక్ సెలవులు.. ఏరోజు, ఎందుకో తెలుసా? ఫుల్ లిస్ట్ ఇదిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved