MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • ఐఫోన్ 17 ఎయిర్ నిజంగా అంత సన్నగా ఉంటుందా?

ఐఫోన్ 17 ఎయిర్ నిజంగా అంత సన్నగా ఉంటుందా?

ఆపిల్ ఐఫోన్ అంటే ఒక ఫిక్స్ డ్ సైజ్ ఉంటుంది. సిరీస్ మారుతుంటాయి తప్ప పొడవు, వెడల్పు, మందం మాక్సిమం ఒకేలా ఉంటాయి కదా. కాని తర్వలో రానున్న ఆపిల్ ఐఫోన్ 17 ఎయిర్ ఈ రూల్ ని బ్రేక్ చేయబోతోందని సమాచారం. పేరుకు తగ్గట్టుగానే ఈ ఫోన్ తేలికగా, తక్కువ మందంతో తయారవుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో మార్కెట్ లోకి రానున్న ఈ ఫోన్ గురించి మరిన్ని డీటైల్స్ తెలుసుకుందాం రండి.  

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Jan 14 2025, 06:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఆపిల్ ఐఫోన్ 17 ఎయిర్‌ పేరుతో అతి పలుచటి ఫోన్ తయారు చేస్తోందని, ఇది ప్లస్ మోడల్‌ను రీ ప్లేస్ చేయనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఫోన్ మందం కేవలం 5.5 మి.మీ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే నిజమైతే ఇప్పటివరకు వచ్చిన ఐఫోన్‌లలో ఇదే అతి పలుచటి ఫోన్ అవుతుంది. ఇందులో eSIM మాత్రమే ఉంటుంది. ప్రత్యేకమైన కెమెరా సెటప్ కూడా ఉంటుందని సమాచారం. ఈ పలుచని కొత్త మోడల్ 2025 జూన్ నెల తర్వాత విడుదల కానుందని తెలుస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఐఫోన్ 17 ఎయిర్ ను ఐఫోన్ స్లిమ్ అని కూడా పిలుస్తారు. టిఎఫ్ సెక్యూరిటీస్ ఇంటర్నేషనల్ విశ్లేషకుడు మింగ్-చి కువో ఇచ్చిన సమాచారం ప్రకారం ఇది చాలా పలుచగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుత ప్లస్ మోడల్‌ను ఐఫోన్ 17 సిరీస్‌లో ఇది భర్తీ చేస్తుందని, ఆపిల్ ఇప్పటివరకు తయారు చేసిన వాటిలో ఇదే అతి పలుచటి ఐఫోన్ కావచ్చని భావిస్తున్నారు.

 

35

దీని మందం 5.5 మి.మీ. చిన్న డిజైన్ eSIMను మాత్రమే ఇందులో ఉపయోగించడానికి వీలుంటుంది. సాంప్రదాయ SIM కార్డ్ పోర్ట్ ఉండదు. అయితే SIM కార్డ్ లేకపోవడం వల్ల షిప్పింగ్ కష్టం అవుతుందని కొందరు నిపుణులు భావిస్తున్నారు. 

ఐఫోన్ 17 ఎయిర్ నిజంగా 5.5 మి.మీ మందమే ఉంటే 2014లో వచ్చిన 6.9 మి.మీ ఐఫోన్ 6 కంటే ఇది చాలా చిన్నది అవుతుంది. ఐఫోన్ 17 ఎయిర్ 6.25 మి.మీ మందంగా ఉంటుందని మునుపటి వార్తలు చెబుతున్నాయి. ప్రస్తుత ఐఫోన్ 16 మందం 7.8 మి.మీ. శామ్‌సంగ్ గెలాక్సీ S25 స్లిమ్ 6 మి.మీ మందంగా ఉంటుందని భావిస్తున్నారు.

 

45

అదనంగా కొత్త ఐఫోన్ 17 ఎయిర్ ధర $1,299 నుంచి $1,500 మధ్య ఉంటుందని అంచనా. అయితే ప్రస్తుతం  మార్కెట్లో ప్రో వేరియంట్లు తక్కువ ధరకు లభిస్తున్నందున దీన్ని అమ్మడం కష్టం అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. అందుకే ఈ ఏడాది సగం నెలలు పూర్తయిన తర్వాత మార్కెట్ లోకి విడుదల చేయాలని కంపెనీ అనుకుంటోందట. ఇందులో 8GB RAM, ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు అనుకూలమైన A18 లేదా A19 CPU ఉంటుందని సమాచారం.

 

 

55

ఈ కొత్త పలుచటి స్మార్ట్‌ఫోన్‌లో మొదటి ఆపిల్ 5G, Wi-Fi ప్రాసెసర్‌లు ఉండవచ్చు. ఐఫోన్ 17 ఎయిర్‌లో 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల OLED ప్రోమోషన్ డిస్‌ప్లే ఉంటుందని భావిస్తున్నారు. పలుచటి డిజైన్ వల్ల వచ్చే ఏకైక మార్పు ఏమిటంటే ఆపిల్ ఒకే 48MP వెనుక కెమెరా, ముందు 24MP సెల్ఫీ కెమెరాను అందించే అవకాశం ఉంటుంది. 

ఇది కూడా చదవండి ల్యాప్‌టాప్ కొనాలంటే ఇదే మంచి టైం: అమెజాన్‌ బంపర్ ఆఫర్

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Crash: బంగారం కొనే వారికి గుడ్ న్యూస్.. ఒక్కరోజే రూ.2,070 తగ్గిన పసిడి!
Recommended image2
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image3
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved