ముఖేష్ అంబానీ నుంచి రాధికా మర్చంట్ వరకు.. ఈ రిచ్ ఫ్యామిలీలో ఎవరు ఏం చదువుకున్నారో తెలుసా?
ఇండియాలో అత్యంత ధనవంతుల కుటుంబంగా ముఖేష్ అంబానీ ఫ్యామిలీ పేరు గాంచింది. లగ్జరీ లైఫ్ స్టైల్ కి అంబానీ కుటుంబ సభ్యుల్లో ఎవరు ఏం చదువుకున్నారో తెలుసా?
అంబానీ కుటుంబం
ఇండియాలో అత్యంత సంపన్న కుటుంబంగా ముఖేష్ అంబానీ ఫ్యామిలీ పేరు గాంచింది. లగ్జరీ లైఫ్ స్టైల్ ను గడిపేవారిలో అంబానీ ఫ్యామిలీ ముందుంటారు. అసలు అంబానీ కుటుంబ సభ్యుల్లో ఎవరెవరు ఏం చదువుకున్నారో తెలుసా? ముఖేష్ అంబానీ నుంచి రాధికా మర్చంట్ వరకు అంబానీ కుటుంబ సభ్యులు ఏం చదివారో ఓ లుక్కేద్దాం పదండి.
ముఖేష్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ తన ఎడుకేషన్ జర్నీని ముంబైలో ప్రారంభించారు. ఈయన హిల్ గ్రాంజ్ హై స్కూల్‌లో స్కూల్ విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో చదువుకున్నాడు.
ముఖేష్ అంబానీ ముంబై విశ్వవిద్యాలయం నుంచి కెమికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ఆ తర్వాత స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి MBA పట్టా అందుకున్నాడు. రిలయన్స్‌ను ప్రపంచ శక్తి కేంద్రంగా మార్చడంలో ఈయన నాయకత్వానికి ఆయన విద్యా నేపథ్యం దోహదపడింది.
నీతా అంబానీ
ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ ఇండియాలో విద్య, దాతృత్వానికి ఎంతో కృషి చేశారు. నీతా అంబానీ ముంబైలోని నర్సీ మోంజీ కామర్స్ అండ్ ఎకనామిక్స్ కాలేజీ నుంచి కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని అందుకున్నారు. నీతా అంబానీ శిక్షణ పొందిన భరతనాట్యం నర్తకి అలాగే కళలు, సంస్కృతిని ప్రోత్సహించడంలో ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసింది.
ఆకాష్ అంబానీ
ముఖేష్, నీతా అంబానీల పెద్ద కొడుకు ఆకాష్ అంబానీ ఇండియా, యునైటెడ్ స్టేట్స్‌లలో తన విద్యను అభ్యసించారు. ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో స్కూల్ విద్యను పూర్తి చేశారు. తర్వాత ఇతను యునైటెడ్ స్టేట్స్‌లోని బ్రౌన్ విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు.
ఇషా అంబానీ
ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ఏకైక కూతురు ఇషా అంబానీ తన సోదరుడిలాగే ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదివింది. ఆ తర్వాత యేల్ విశ్వవిద్యాలయంలో సైకాలజీ, సౌత్ ఏషియన్ స్టడీస్ చదివింది. ఆమె స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి MBA పట్టా పొందింది. కుటుంబ వ్యాపారంలోనే కాకుండా.. ఈమె స్వంతంగా వెంచర్ ను స్థాపించుకుంది.
ఆనంత్ అంబానీ
ముఖేష్, నీతా అంబానీల చిన్న కొడుకు ఆనంత్ ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో తన పాఠశాల విద్యను కంప్లీట్ చేశాడు. అనంత్ అంబానీ కూడా తన అన్న ఆకాష్ బాటలోనే బ్రౌన్ విశ్వవిద్యాలయంలో చదివాడు.
ష్లోకా మెహతా
ముఖేష్, నీతా అంబానీల పెద్దకోడలు శ్లోకా మెహతా 2019లో ఆకాష్ అంబానీని పెళ్లి చేసుకుంది. ఈమె న్యూజెర్సీలోని ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం నుంచి ఆంత్రోపాలజీలో బ్యాచిలర్ డిగ్రీని పొందింది. అలాగే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ నుంచి లా డిగ్రీని అందుకుంది.
ఆనంద్ పిరమాల్,
ముఖేష్, నీతా అంబానీల అల్లుడు, ఇషా అంబానీ భర్త ఆనంద్ పిరమాల్ బాగా చదువుకున్నాడు. ఈయన కూడా శ్లోకా మెహతా మాదిరిగానే ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం నుంచి ఆంత్రోపాలజీలో బ్యాచిలర్ డిగ్రీని అందుకున్నాడు. అలాగే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ నుంచి లా డిగ్రీని పొందారు.
రాధికా మర్చంట్
అనంత్ అంబానీ భార్య, అంబానీ ఫ్యామిలీలో చిన్న కోడలు రాధికా మర్చంట్ ముంబైలోని కేథడ్రల్ & జాన్ కానన్ స్కూల్, École మోండియేల్ వరల్డ్ స్కూల్‌లో చదువుకుంది. ఈమె న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుంచి రాజకీయ శాస్త్రం, ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పట్టా పొందింది. అంతేకాదు రాధికకు భరతనాట్యం కూడా వచ్చు. ఈమె బహుముఖ ప్రతిభను కలిగి ఉంది.