అంబానీ, అదానీల దుంపతెంచిన HMPV ... వేల కోట్లు మింగేసిన వైరస్
HMPV వైరస్ సామాన్యులనే కాదు సంపన్నులనూ వదిలిపెట్టడంలేదు. సామాన్యుల హెల్త్ ను దెబ్బతీస్తున్న ఈ వైరస్ సంపన్నుల వెల్త్ ను దెబ్బతీస్తోంది. ఈ వైరస్ ఇండియాలో బైటపడి మూడునాలుగు రోజులే అవుతోంది... అప్పుడే అంబానీ,అదాానీలు ఎన్నివేల కోట్లు నష్టపోయారో తెలుసా?
HMPV
HMPV వైరస్
చైనా నుండి వ్యాపించిన కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేసింది. లక్షలాది మంది ప్రాణాలను బలిగొంది. కరోనా తర్వాత ప్రపంచంలో కొత్త కొత్త వైరస్‌లు వస్తున్నాయి. ఈ కోవలో ఇప్పుడు చైనాలో వేగంగా వ్యాపిస్తున్న HMPV వైరస్ (హ్యూమన్ మెటా న్యూమో వైరస్) భారతదేశంలోకి ప్రవేశించింది.
తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఈ వ్యాధి ప్రభావం ఉంది. HMPV వైరస్‌తో ప్రజలు భయాందోళనకు గురవుతున్న తరుణంలో, ఈ వైరస్ ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీలను కూడా ప్రభావితం చేసింది.
HMPV వైరస్
అంబానీ-అదానీ ఆస్తుల విలువ ఎంత తగ్గింది :
HMPV వైరస్ కారణంగా చైనాతో సహా కొన్ని దేశాల్లో వ్యాపారాలు స్తంభించడంతో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ ఇద్దరికీ ₹52,000 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని సమాచారం. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ డేటా ప్రకారం, ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ సంపద 2.59 బిలియన్ డాలర్లకు పైగా తగ్గింది.
Mukesh Ambani
అంబానీ సంపద ఎంత?
ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ కంపెనీల షేర్లు క్షీణించడంతో ఇద్దరూ సంపద తగ్గింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ డేటా ప్రకారం ముఖేష్ అంబానీ నికర సంపదలో 2.59 బిలియన్ డాలర్లు (₹22,000 కోట్లకు పైగా) తగ్గింది. దీని ఫలితంగా ఆయన మొత్తం సంపద ఇప్పుడు 90.5 బిలియన్ డాలర్లకు పడిపోయింది
2025 ప్రారంభంలో అంబానీ నికర సంపద ఇప్పటికే 119 మిలియన్ డాలర్లు తగ్గింది. ప్రస్తుతం, ముఖేష్ అంబానీ ప్రపంచంలో 17వ ధనవంతుడు.
Goutham Adani
అదానీ సంపద ఎంత?
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 2% కంటే ఎక్కువగా పడిపోవడమే అంబానీ సంపద తగ్గడానికి కారణమైంది. ఈ క్రమంలో ఆసియాలో రెండవ ధనవంతుడు, ప్రపంచంలో 19వ ధనవంతుడైన గౌతమ్ అదానీ సంపదలో భారీ క్షీణత నమోదైంది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ డేటా ప్రకారం ఆయన నికర సంపద 3.53 బిలియన్ డాలర్లు (₹30,000 కోట్లకు పైగా) తగ్గింది. దీంతో ఆయన మొత్తం సంపద $74.5 బిలియన్ డాలర్లకు పడిపోయింది.
2025 ప్రారంభంలో అదానీ సంపద 4.21 బిలియన్ డాలర్లు తగ్గింది. HMPV వైరస్ కారణంగా అదానీ కంపెనీ షేర్లు కూడా క్షీణించాయి.