మీరు ఎయిర్ టెల్ సిమ్ వాడుతుంటే.. రూ.17000 లాభం.. ఎలా పొందాలో తెలుసా?
తమ వినియోగదారులకు ఎయిర్ టెల్ అద్భుతమైన ఆఫర్ ఇచ్చింది. ఒకటి రెండు కాదు ఏకంగా 17,000 రూపాయల విలువగల AI సేవలను ఉచితంగా అందిస్తోంది. ఎయిర్ టెల్ వినియోగదారులు ఈ ఫ్రీ సేవలను ఎలా పొందాలంటే..

ఎయిర్ టెల్ యూజర్స్ కి బంపరాఫర్
Perplexity Pro : ప్రముఖ భారతీయ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ తమ వినియోగదారులకు బంపరాఫర్ ఇస్తోంది. ఎయిర్‌టెల్ నెట్ వర్క్ ఉపయోగించే కస్టమర్లకు వేల విలువచేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సేవలను ఉచితంగా అందుతున్నాయి. ప్రీపెయిడ్, పోస్ట్ పేయిడ్ వినియోగదారులకు AI వెబ్ సెర్చ్ ఇంజిన్ ‘పెర్‌ప్లెక్సిటీ’ ప్రో వర్షన్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తోంది ఎయిర్ టెల్. ఒక సంవత్సరం పాటు ఎయిర్ టెల్ కస్టమర్స్ ఈ AI అడ్వాన్సుడ్ సేవలను ఉచితంగా పొందవచ్చు.
ఎయిర్‌టెల్ తాజా నిర్ణయంతో పెర్‌ప్లెక్సిటీ వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది... AI సేవలు అందించే ప్లాట్‌ఫామ్‌లో ఇది టాప్ యాప్‌గా మారింది. చివరకు ప్రముఖ ఏఐ సెర్చ్ ఇంజన్ చాట్ జిపిటిని కూడా పెర్‌ప్లెక్సిటీ మించిపోయింది.
ఎయిర్ టెల్ వినియోగదారులకు ఎంత లాభం?
సాధారణంగా అయితే పెర్‌ప్లెక్సిటీ ప్రో వెర్షన్ ఉపయోగించుకోవాలంటే డబ్బులు చెల్లించాలి. 17,000 రూపాయలతో ఏడాది సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది. కానీ ఎయిర్ టెల్ వినియోగదారులు ఈ పెర్‌ప్లెక్సిటీని సాధారణ వెర్షన్ నే కాదు ఈ ప్రో వెర్షన్ ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం పెర్‌ప్లెక్సిటీతో ఎయిర్ టెల్ ఒప్పందం చేసుకుంది.
పెర్‌ప్లెక్సిటీ ఇతర సాంప్రదాయ AI చాట్‌బాట్స్ చాట్‌జీపీటీ, జెమినీ మాదిరిగా కాకుండా AI ఆధారిత వెబ్ సెర్చ్ ఇంజన్ లా పనిచేస్తుంది. ఇది ఇంటర్నెట్‌ను స్కాన్ చేసి వినియోగదారులు అడిగే సమాచారాన్ని చాలా సరళమైన రూపంలో అందిస్తుంది. అందుకే ఇతర ఏఐ చాట్ బాట్స్ తో పోలిస్తే పెర్‌ప్లెక్సిటీ ప్రత్యేకంగా నిలుస్తోంది.
ఎయిర్ టెల్ కస్టమర్స్ perplexit pro సేవలు ఇలా పొందండి
perplexit pro సబ్ స్క్రిప్షన్ ఫ్రీగా పొందాలంటే మీరు ఎయిర్ టెల్ సిమ్ వాడుతుండాలి. ఇప్పటికే మీరు ఎయిల్ టెల్ వినియోగదారులు అయితే మీ ఫోన్ లో ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ ను డౌన్లోడ్ చేయండి.
ఈ ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ ను ఓపెన్ చేసి రివార్డ్స్ పై క్లిక్ చేయండి
ఇక్కడ perplexity pro కనిపిస్తుంది. అక్కడ Claim Now పై క్లిక్ చేయండి
దీంతో మీకు ఫ్రీగానే perplexit pro సేవలు అందుబాటులోకి వస్తాయి.
perplexity pro వెర్షన్‌లో ప్రధాన ఫీచర్లు
1. ప్రో సెర్చ్:
పెర్‌ప్లెక్సిటీ ఉచిత వెర్షన్‌తో పోల్చితే ప్రో యూజర్లకు ఎక్కువ సెర్చ్ అవకాశాలుంటాయి. పైగా GPT-4.1, Claude 4.0 Sonnet, Gemini 2.5 Pro వంటి అధునాతన మోడల్స్‌కు యాక్సెస్ ఉంటుంది. ఇవి నచ్చకపోతే పెర్‌ప్లెక్సిటీ అభివృద్ధి చేసిన సోనార్ మోడల్‌కి స్విచ్ అయ్యే అవకాశం ఉంది.
2. రీజనింగ్ మోడల్స్:
సంక్లిష్ట ప్రశ్నలకు సమాధానం కావాలనుకునే వారికీ o3 (OpenAI), Claude 4.0, Grok 4 (xAI), DeepSeek R1 వంటి మోడల్స్ అందుబాటులో ఉంటాయి. టాపిక్‌పై లోతైన రీసెర్చ్ కోసం పెర్‌ప్లెక్సిటీ వివిధ మోడల్స్ కలయికను ఉపయోగిస్తుంది.
perplexity pro వెర్షన్‌లో ప్రధాన ఫీచర్లు
3. ల్యాబ్స్ :
ఈ Labs ఫీచర్ ద్వారా యూజర్లు స్వల్ప సమయంలో స్ప్రెడ్‌షీట్లు, డ్యాష్‌బోర్డ్లు, వెబ్ యాప్స్ తయారు చేయొచ్చు. ఇది కోడ్ ఎగ్జిక్యూషన్, ఇమేజ్ క్రియేషన్ వంటి టూల్స్‌తో 10 నిమిషాల పాటు స్వయంగా పని చేస్తుంది. డేటా స్ట్రక్చరింగ్, చార్ట్స్ తయారీ, డాక్యుమెంట్లు సృష్టించడంలో ఇది సహాయపడుతుంది.
4. ఫైల్ అనాలిసిస్:
పిడిఎఫ్, సీఎస్వి, ఆడియో, వీడియో, ఇమేజ్ ఫైళ్లను అప్‌లోడ్ చేసి విశ్లేషించవచ్చు. ఈ ఫీచర్ GPT-4 Omni, Claude 4.0 Sonnet మోడల్స్ ఆధారంగా పనిచేస్తుంది.
5. ఇమేజ్ జనరేషన్:
టెక్స్ట్ ప్రాంప్ట్‌లతో చిత్రాలు రూపొందించుకోవచ్చు. GPT Image 1 మోడల్ డిఫాల్ట్‌గా అమలులో ఉంది. డిజైర్‌డ్ అవుట్‌పుట్ రాకపోతే మోడల్‌ను మార్చుకోవచ్చు. ప్రస్తుతానికి Gemini 2.0 Flash, FLUX.1, DALL-E 3 వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక నెలకు GPT Image 1తో 150 చిత్రాల పరిమితి ఉంది.