MG Comet EV: నెలకు రూ.4999 కడితే చాలు! ఈ బుల్లి కారులో హాయిగా తిరగొచ్చు
MG Comet EV: దేశంలోనే తక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ కార్లలో MG కామెట్ EV ఒకటి. ఈ కారును వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేసేందుకు కంపెనీ EMI ప్లాన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా నెలకు రూ.4999 కడితే చాలు. రోజూ ఈ కారులో హాయిగా తిరగొచ్చు.

MG కామెట్ EV EMI స్కీమ్
ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుక్కోవడం మంచి నిర్ణయం. మీరు తక్కువ ధరలో ఒక మంచి ఎలక్ట్రిక్ కారు కొనాలని ఆలోచిస్తుంటే MG కామెట్ EV మీకు బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఎందుకంటే ఈ కారు దాని ప్రత్యేక ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్, తక్కువ ధర EMI ప్లాన్‌తో మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడవుతోంది.
తక్కువ ధరలో స్మార్ట్ ఎలక్ట్రిక్ కారు
MG కామెట్ EV భారతదేశంలో తక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి. ముఖ్యంగా నగరంలో రోజువారీ ప్రయాణం చేసేవారికి ఈ కారు ఒక మంచి ఎంపిక. దీని చిన్న సైజు, ఆధునిక ఫీచర్లు, మంచి బ్యాటరీ పనితీరు దీనిని మరింత ఆకర్షణీయంగా మార్చాయి.
MG కామెట్ EV బెస్ట్ ఫీచర్లు
ఒకసారి ఛార్జ్ చేస్తే 200-250 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఈ కారు సొంతం. ఇందులో 17.3 kWh లిథియం అయాన్ బ్యాటరీ ఉంది. సుమారు 7 గంటల్లో పూర్తిగా ఛార్జింగ్ అవుతుంది. అంతేకాకుండా ఈ కారు గరిష్ట వేగం గంటకు 80 కి.మీ. స్టైలిష్, కాంపాక్ట్, లేటెస్ట్ లుక్ వల్ల ఈ కారుకు ప్రత్యేక అభిమానులున్నారు. డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ఈబీడీ, రివర్స్ కెమెరా వంటి ఫీచర్లతో భద్రతలోనూ బెస్ట్ గా నిలుస్తోంది.
నెలకు రూ.4,999 EMI
ఈ కారును EMIలో కొనాలనుకుంటే మీరు కేవలం నెలకు రూ.4,999 కడితే చాలు. MG, ఎంపిక చేసిన బ్యాంక్ భాగస్వాములతో కలిసి ఫైనాన్స్ ఎంపికలను కూడా అందిస్తోంది. ఈ కారు అసలు ధర రూ.7.98 లక్షలు (ఎక్స్-షోరూమ్). డౌన్ పేమెంట్ కింద సుమారు రూ.1.5 లక్షలు కడితే రూ.6.48 లక్షలు లోన్ లభిస్తుంది. 9% నుండి 12% వడ్డీ రేటుతో లోన్ అమౌంట్ ని 5-7 సంవత్సరాల లోపు మీరు కట్టేయొచ్చు.
MG కామెట్ EV ఎందుకు బెస్ట్ ఛాయిస్ అంటే..
1. తక్కువ నిర్వహణ ఖర్చు
పెట్రోల్, డీజిల్ కార్ల కంటే ఎలక్ట్రిక్ కార్ల నిర్వహణ ఖర్చు చాలా తక్కువ. ఇంజిన్ ఆయిల్ లేదా ఫిల్టర్‌ను మార్చవలసిన అవసరం లేదు. ఇది దీర్ఘకాలికంగా చాలా డబ్బును ఆదా చేస్తుంది.
2. రోజువారీ ప్రయాణానికి ఉత్తమం
మీరు రోజూ ఆఫీస్ కి వెళితే లేదా నగరంలో స్థానిక ప్రయాణాలు చేస్తే ఈ కారు మీకు ఒక మంచి ఎంపిక అవుతుంది. దీని కాంపాక్ట్ సైజు ట్రాఫిక్ రద్దీలో కూడా నడపడానికి సౌకర్యంగా ఉంటుంది.
3. ప్రభుత్వ రాయితీలు, టాక్స్ ప్రోత్సాహకాలు
ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు, పన్ను మినహాయింపులు ఇస్తున్నాయి. ఫేమ్(FAME II) పథకం కింద ఈ కారు ధరలో మీరు డిస్కౌంట్ పొందవచ్చు.
MG కామెట్ EV మీకు సరైనదా?
మీ బడ్జెట్ రూ.8 లక్షల కంటే తక్కువగా ఉంటే, మీరు ఒక మంచి ఎలక్ట్రిక్ కారు కోసం చూస్తుంటే, MG కామెట్ EV మీకు కరెక్ట్ వెహికల్. దీని తక్కువ ధర, మంచి పరిధి, తక్కువ EMI మధ్యతరగతి, నగరవాసులకు ఒక మంచి ఎంపికగా నిలుస్తుంది.