ఎంగేజ్మెంట్ తర్వాత 659 కోట్ల లగ్జరీ భవనం; మరో కొత్త ఇల్లు కొన్న అత్యంత ధనవంతుడు.. ఎక్కడో తెలుసా.. ?
ప్రపంచంలో మూడో అత్యంత సంపన్నుడైన జెఫ్ బెజోస్ మళ్లీ విలాసవంతమైన ఓ ఇంటిని సొంతం చేసుకున్నాడు. అయితే లారెన్ శాంచెజ్‌తో నిశ్చితార్థం జరిగిన తర్వాత బెజోస్ చేసిన రెండవ భారీ పెట్టుబడి.
జెఫ్ బెజోస్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు. ఇతను చాలా కాలం పాటు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగ ఉన్నాడు. ఇప్పుడు హురున్ లిస్ట్ ప్రకారం 114 బిలియన్ డాలర్లు అంటే పది లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ సంపదతో ప్రపంచంలోనే మూడో అత్యంత సంపన్నుడు. తాజాగా రూ.659 కోట్ల విలువైన విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేశారు.
ప్రస్తుతం అమెరికాలోని ఫ్లోరిడాలోని బిలియనీర్ బంకర్‌లో 79 మిలియన్ డాలర్ల విలువైన కొత్త భవనం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మొదటి వివాహం తర్వాత బెజోస్ తన భాగస్వామి మెకెంజీ స్కాట్‌కు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత జర్నలిస్ట్ అండ్ యాంకర్ లారెన్ శాంచెజ్‌తో ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. లారెన్ శాంచెజ్‌తో నిశ్చితార్థం జరిగిన తర్వాత బెజోస్‌కి ఈ పెట్టుబడి రెండవ ఆస్తి పెట్టుబడి.
ఈ అద్భుతమైన భవనం ఇండియన్ క్రీక్ ఐలాండ్ అనే ఏకాంత ద్వీపంలో ఉంది, ఈ ప్రదేశం కోటీశ్వరుల స్వర్గధామం. ఈ మూడు పడక గదుల ఇంట్లో లైబ్రరీ, వైన్ సెల్లార్ ఇంకా ముందు భాగంలో విలాసవంతమైన వాటర్ ఫౌంటెన్ ఉన్నాయి. ఈ ఇంటికి హై సెక్యూరిటీ డోర్లు ఉండడం కూడా గమనార్హం.
2023 హురాన్ రిచ్ లిస్ట్ ప్రకారం, జెఫ్ బెజోస్ మొత్తం విలువ $114 బిలియన్లు. అతను బెర్నార్డ్ ఆర్నాల్డ్, ఎలోన్ మస్క్ తర్వాత ప్రపంచంలోని మూడవ అత్యంత ధనవంతుడు.
బెజోస్ 2021లో అమెజాన్ సీఈఓ పదవి నుంచి వైదొలగారు. బెజోస్‌కు ఇప్పటికీ కంపెనీలో 10 శాతం వాటా ఉంది. అతనికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మీడియా సంస్థ వాషింగ్టన్ పోస్ట్, స్పేస్ టూరిజం కంపెనీ బ్లూ ఆరిజిన్ ఉన్నాయి. బ్లూ ఆరిజిన్ కమర్షియల్ స్పేస్ స్టేషన్‌ను ప్రారంభిస్తున్నట్లు బెజోస్ గతంలో ప్రకటించారు. 'ఆర్బిటల్ రీఫ్' అని పేరుతో ఈ స్టేషన్ ఈ దశాబ్దం చివరి నాటికి పని చేయవచ్చని అంచనా వేస్తున్నట్లు అధికారులు ఈ ప్రాజెక్టుపై ఇంతకుముందు వెల్లడించారు.