MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • జస్ట్ ఇది పాటిస్తే చాలు, మీకు జీవితంలో అప్పు చేయాల్సిన అవసరం రాదు

జస్ట్ ఇది పాటిస్తే చాలు, మీకు జీవితంలో అప్పు చేయాల్సిన అవసరం రాదు

ప్లానింగ్ లేని సంపాదన అప్పులపాలు చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీరు గాని 50-40-10 రూల్ పాటిస్తే మీరు తక్కువ సంపాదిస్తున్నా అప్పులు లేకుండా భవిష్యత్తు అవసరాల కోసం సేవింగ్స్ కూడా చేయగలరు. మరి 50-40-10 రూల్ ఏంటి? దాని వల్ల ఉపయోగం ఏంటో తెలుసుకుందాం రండి.   

1 Min read
Author : Naga Surya Phani Kumar
| Updated : Jan 24 2025, 12:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ప్రతి ఒక్కరూ సంపాదిస్తారు. కాని కొందరికి తక్కువ సంపాదన ఉంటే, మరికొందరు ఎక్కువగా సంపాదిస్తారు. అయినా ఈ రెండు కేటగిరీల్లో ఉన్న వారు అప్పుల్లో మునిగి తేలుతుంటారు. దీనికి కారణం సరైన ప్లానింగ్ లేకపోవడం. అవసరాలు ఏంటో? అనవసర ఖర్చులు ఏంటో తెలియక ప్రతి చిన్నదానికి డబ్బులు ఖర్చు పెట్టడంతో అప్పులు చేయాల్సి వస్తుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మరి ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే తక్కువ సంపాదిస్తున్నా దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో తెలుసుకోవాలి. 50-40-10 రూల్ మీకు చక్కటి ప్రణాళికతో అవసరాలు తీర్చుకొనే ఆలోచనను ఇస్తుంది. 50-40-10 రూల్ గురించి వివరంగా ఇక్కడ తెలుసుకుందాం. 
 

35

50-40-10 రూల్ అంటే మీరు సంపాదిస్తున్న ఆదాయంలో 50 శాతం అవసరాలకు ఖర్చు చేయాలి. 40 శాతం పెట్టుబడులకు వెచ్చించాలి. 10 శాతం ఎంటర్‌టైన్మెంట్ కి ఖర్చు పెట్టాలి.

50 శాతం అవసరాల కోసం ఖర్చు చేయడం అంటే ఆహారానికి, ఇంటి రెంట్, ప్రయాణాలు, వైద్యం ఖర్చులు, అత్యవసరంగా తీర్చాల్సిన అప్పులకు ఈ 50 శాతంలోనే డబ్బులు వెచ్చించాలి. 
 

45

40 శాతం పెట్టుబడులకు ఖర్చు చేయడం అంటే మీరు సంపాదించే ఆదాయంలో కొంత స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. ఏదైనా ప్రాపర్టీ కొనడానికి వెచ్చించాలి. సేవింగ్స్ స్కీమ్స్ లో పెట్టుబడి పెట్టాలి. ఇలాంటి వాటికన్నింటికీ మీరు సంపాదించే మొత్తంలో 40 శాతం వెచ్చించాలి.
 

55

మీ సంపాదనలో 10 శాతం మీ కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగించాలి. అంటే సినిమాలు, ట్రిప్స్, పార్టీలు, డ్రెస్ లు కొనుక్కోవడం లాంటి లగ్జరీ అవసరాలన్నీ 10 శాతంలోనే ఖర్చు చేయాలి. కాని చాలా మంది ఇక్కడే పెద్ద తప్పు చేస్తారు. అనవసరమైన ఖర్చుల కోసం ఎక్కువగా ఖర్చు పెడతారు. అందువల్లనే అప్పుల పాలవుతారు. 

50-40-10 రూల్ ఫాలో అయితే మీరు ఎక్కువ సంపాదిస్తున్నా, తక్కువ సంపాదిస్తున్నా కచ్చితంగా ఆనందంగా, అప్పుల బాధ లేకుండా జీవితాన్ని సాగించవచ్చు. 
 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
పర్సనల్ పైనాన్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
D Mart : డీ మార్ట్ లో ఈ సీక్రెట్ ట్రై చేస్తే రూ.వేలల్లో డబ్బు ఆదా చేయొచ్చు
Recommended image2
Business Idea : ఈ స్కీమ్ కి అప్లై చేస్తే చాలు... బిజినెస్ చేసేందుకు ఫ్రీగా రూ.10 లక్షలు
Recommended image3
Success Story: రూ.3లక్షలతో మొదలై రూ.100 కోట్ల టర్నోవర్ వరకు.. టీ అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్న ముగ్గురు ఫ్రెండ్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved