బైక్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ టిప్స్ పాటిస్తే చాలా డబ్బు ఆదా అవుతుంది
బైక్స్ ఉన్న ప్రతి ఒక్కరు వాటికి ఇన్సూరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది గవర్నమెంట్ రూల్ మాత్రమే కాదు. బైకర్స్ కి కూడా ఇది చాలా ఉపయోగకరం. కానీ చాలామంది ప్రీమియంలు ఎక్కువగా ఉన్నాయని బైక్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మానేస్తారు. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే మీ డబ్బు చాలా ఆదా అవుతుంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం రండి.
మనిషికి కావాల్సిన అత్యవసర వస్తువుల్లో ఇప్పుడు బైక్ కూడా చేరిపోయింది. స్కూల్ పిల్లలు కూడా ఉపయోగించే కొన్ని రకాల స్కూటర్లు మార్కెట్ లోకి వచ్చేశాయి. వీటికి లైసెన్స్ అవసరం లేకపోవడంతో స్టూడెంట్స్ కూడా వాటిని కొని ఉపయోగిస్తున్నారు.
టూ వీలర్ కొనుక్కోవడానికి ఎన్నో సందర్భాలు ఉంటాయి. ఉద్యోగం వచ్చాక జీతం డబ్బులతో కొనుక్కోవచ్చు. తల్లిదండ్రులు బహుమతిగా ఇవ్వొచ్చు. కష్టపడి ప్రతి రూపాయిని దాచుకొని కూడా చాలా మంది తమకు ఇష్టమైన బైక్స్ కొనుక్కుంటారు. అలాంటి బైక్ కి ప్రమాదం జరిగినా, దొంగలు దొంగిలించినా యజమానుల బాధ వర్ణనాతీతంగా ఉంటుంది.
ఇలాంటి సందర్భాలలో ఇన్సూరెన్స్ మీకు చాలా ఉపయోగపడుతుంది. నిపుణులు సూచించే సలహా ఏంటంటే.. బైక్ ఇన్సూరెన్స్ లు తీసుకొనేటప్పుడు ముందుగా ఆన్‌లైన్‌లో వివిధ కంపెనీలు ఇస్తున్న ఇన్సూరెన్స్ పాలసీలను చెక్ చేయాలి. కొత్తగా తీసుకుంటున్నా, ఉన్నదాన్ని రెన్యువల్ చేయాలన్నా పూర్తి వివరాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. వివిధ కంపెనీల బైక్ ఇన్సూరెన్స్‌లను చూడటం ద్వారా మంచి పాలసీ, తక్కువ ప్రీమియంలో దొరుకుతుంది.
ఇంటర్నెట్‌లో పాలసీలు వెదికేటప్పుడు దాని సమీక్షలను జాగ్రత్తగా చదవండి. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ గురించి స్పష్టమైన అవగాహన పెరుగుతుంది. ఈ నేపథ్యంలో బైక్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడం అవసరం. బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు కొంచెం ఎక్కువ ఖరీదుగా అనిపిస్తే మీరు ఈ చిట్కాలు పాటిస్తే ఇన్సూరెన్స్‌లో డబ్బు ఆదా చేయొచ్చు.
అధిక డిడక్టిబుల్
బైక్ ఇన్సూరెన్స్ కవరేజ్ అమలులోకి రాకముందు మీరు చెల్లించే మొత్తాన్ని డిడక్టిబుల్ అంటారు. ఉదాహరణకు రూ.500 డిడక్టిబుల్ ఎంచుకున్నారనుకుందాం. రూ.2 వేల నష్టపరిహారం వచ్చినప్పుడు రూ.500 మీరు చెల్లిస్తారు. మిగిలిన రూ.1500 ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది.
డ్రైవింగ్ రికార్డ్స్
మీ డ్రైవింగ్ రికార్డ్ బాగుంటే తక్కువ ధరకే ఇన్సూరెన్స్ పొందొచ్చు. ప్రమాదాలు చేయని రైడర్స్‌ను ఇన్సూరెన్స్ కంపెనీలు ఇష్టపడతాయి. తక్కువ ధరకే ఇన్సూరెన్స్ ఇవ్వడానికి ముందుకొస్తాయి. అందుకే మంచి డ్రైవింగ్ రికార్డ్ ముఖ్యం.
నో క్లెయిమ్ బోనస్ (NCB)
NCB అనేది ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీదారులకు ఇచ్చే ప్రోత్సాహక బహుమతి. పాలసీ తీసుకున్న సంవత్సరంలో క్లెయిమ్ చేయకపోతే ఇది వర్తిస్తుంది. ఈ రేటు ప్రతి సంవత్సరం పెరుగుతుంది. పాలసీ ప్రీమియంలో ఆదా చేసుకోవచ్చు. అంటే క్లెయిమ్ చేయకుండా ఉన్నా ఇది పెరుగుతూనే ఉంటుంది.
యాంటీ థెఫ్ట్ పరికరాలు
బైక్‌లో యాంటీ థెఫ్ట్ పరికరాలు ఏర్పాటు చేసుకుంటే ఇన్సూరెన్స్ ఖర్చు చాలా తగ్గుతుంది. దీనివల్ల బైక్ దొంగతనాలు తగ్గుతాయి. అందుకే ఇన్సూరెన్స్ కంపెనీలు తక్కువ ధరకే పాలసీలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. GPS ట్రాకర్లు, డిస్క్ లాక్‌లు, అలారం సిస్టమ్స్, గొలుసులు, తాళాలు, ఇమ్మొబిలైజర్లు వీటిలో ఉన్నాయి.
ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు వివిధ యాడ్ ఆన్ కవర్లను ఎంచుకోవాలి. జీరో డిప్రీసియేషన్ ద్వారా బైక్ పార్ట్స్ విలువను తిరిగి పొందొచ్చు. వాటర్ ఇంగ్రెస్, ఆయిల్ లీకేజ్ వల్ల వచ్చే ఇంజిన్ డ్యామేజ్‌ను ఇంటర్నల్ ప్రొటెక్షన్ కవర్ చేస్తుంది. ప్రమాదాలు జరిగితే పర్సనల్ యాక్సిడెంట్ కవర్ రక్షణ కల్పిస్తుంది.
సకాలంలో రెన్యువల్
బైక్ పాలసీలను సకాలంలో రెన్యువల్ చేయాలి. ముందుగానే తీసుకుంటే సరైన రక్షణ లభిస్తుంది. అదనపు ఖర్చులు తగ్గుతాయి.