ఈ 3 బిజినెస్‌ల్లో మీరు ఏది స్టార్ట్ చేసినా సక్సెస్ గ్యారెంటీ
సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారా? ఇండియాలో ఈ మూడు బిజినెస్ లకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. వీటిల్లో ఏది మీరు స్టార్ట్ చేసినా కచ్చితంగా ప్రాఫిట్స్ పొందుతారు. అయితే మీరు చేయాల్సిందల్లా తెలివిగా మెయింటెయిన్ చేయడమే. ఆ మూడు బిజినెస్ ఐడియాల గురించి మరింత డీటైల్డ్ గా తెలుసుకుందాం రండి.
చాలా మందికి ఓన్ బిజినెస్ మొదలుపెట్టాలనే కోరిక ఉంటుంది. చిన్నదైనా స్టార్ట్ చేసి సొంత కాళ్ల మీద నిలబడాలని తపన పడుతుంటారు. ఈ రోజుల్లో చాలా మంది యువత లక్షల్లో జీతాలొచ్చే ఉద్యోగాలు చేస్తున్నా ఆనందంగా జీవించడం లేదు. జాబ్ ప్రెషర్ తట్టుకోలేక ఉద్యోగం మానేసి చిన్నదైనా సొంత వ్యాపారం స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తుంటారు. తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాట పడుతుంటారు. అలాంటి వారికి ఈ మూడు బిజినెస్ ఐడియాలు కచ్చితంగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇండియాలో ఈ మూడు బిజినెస్ లకు ఎప్పటికీ డిమాండ్ తగ్గదు.
తక్కువ పెట్టుబడితో వ్యాపారం మొదలుపెట్టాలనుకునే వారికి మూడు మంచి అవకాశాలు ఉన్నాయి. మొదటిది జిరాక్స్ షాప్. జిరాక్స్ షాప్ కి ఎప్పటికీ మంచి డిమాండ్ ఉంటుంది. అయితే షాప్ ఎక్కడ పెడతాం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం.
వీటిని ఎక్కువగా స్కూల్స్, కాలేజీలు, గవర్నమెంట్ ఆఫీసులకు దగ్గర్లో పెట్టుకుంటే మంచి ఆదాయం వస్తుంది. స్టూడెంట్స్ కి ప్రాజెక్ట్ వర్క్స్ ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే వారికి వారి డాక్యుమెంట్స్ జిరాక్సులు అవసరమవుతాయి. ఇలా నిత్యం పని ఉండే బిజినెస్ జిరాక్స్ షాప్. ఈ షాపులో జిరాక్స్ తో పాటు నోట్స్ బుక్స్, పెన్నులు లాంటివి పెట్టుకుంటే మరింత బిజినెస్ జరుగుతుంది.
ఎప్పటికీ డిమాండ్ ఉన్న మరో బిజినెస్ ఎగ్స్(గుడ్లు) దుకాణం. ఎగ్స్ కి ఎంత డిమాండ్ ఉందంటే మార్కెట్లో నకిలీ గుడ్లు తయారు చేసి కూడా అమ్ముతున్నారంటే మీరే అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు రద్దీ గా ఉండే సెంటర్ లో షాప్ పెట్టి గుడ్లు అమ్మితే ప్రతి రోజూ లాభాలు పొందొచ్చు. కరోనా తర్వాత ప్రజలు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. చాలా మంది తమ రోజువారీ మెనూలో పోషకాలు ఎక్కువగా ఉండే ఫుడ్ తినాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తక్కువ ధరలో లభించే అన్ని పోషకాలు ఉన్న ఆహారం గుడ్లు. జనం ఎక్కువగా తిరిగే చోటు చూసుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే మంచి లాభాలు పొందవచ్చు.
ఎప్పటికీ ఎవర్ గ్రీన్ బిజినెస్ ఏంటంటే టీ షాప్. మార్కెట్ లో ఎన్ని టీ దుకాణాలు ఉన్నా కొత్తవి వస్తుండటానికి ఇదే కారణం. మీరు గాని మంచి టేస్ట్, నాణ్యతగా టీ అమ్మితే మీ టీ దుకాణం మారుమూల ఉన్నా కస్టమర్లు వెతుక్కుంటూ వస్తారు. సాధారణంగా కార్పొరేట్ ఆఫీసులు, మార్కెట్లు, బస్టాండ్, రైల్వే స్టేషన్, సినిమా థియేటర్ వంటి రద్దీగా ఉంటే చోట్ల టీషాప్ పెడితే రోజుకు రూ.లక్షల్లో ఆదాయం సంపాదించొచ్చు.
ముఖ్యంగా నగరాల్లో టీ దుకాణాలకు చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. అక్కడ ఇప్పటికే ఎన్నో టీ షాప్స్ ఉన్నా కొత్తగా పెట్టే వాటిని కూడా కస్టమర్లు ఆదరిస్తారు. ఎందుకంటే కొత్త టేస్ట్ కోసం అందరూ ఎదురుచూస్తుంటారు. పల్లెల్లో కూడా మీరు మంచి టేస్ట్, క్వాలిటీతో టీ సర్వ్ చేయగలిగితే మీ బిజినెస్ కచ్చితంగా సక్సెస్ అవుతుంది.