Recharge plans: 365 రోజుల వ్యాలిడిటీ.. అన్‌లిమిటెడ్ 5జీ డేటా, నెలకు కేవలం..
ప్రస్తుతం చేతిలో స్మార్ట్‌ఫోన్ లేకపోతే రోజు గడవని పరిస్థితి ఉంది. దీంతో రీఛార్జ్ చేయక తప్పదు. ఈ కారణంగానే యూజర్లు ఎక్కువ రోజులు వ్యాలిడిటీతో పాటు మంచి బెనిఫిట్స్ ఉన్న ప్లాన్స్ కోసం వెతుకుతున్నారు. రియలన్స్ జియో అందిస్తున్న మూడు బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
- FB
- TW
- Linkdin
Follow Us
)
టెలికం కంపెనీల మధ్య పోటీ తీవ్రంగా పెరిగింది. ఇటీవల కంపెనీలన్నీ ఒకేసారి టారిఫ్‌లను పెంచడంతో చాలా మంది యూజర్లు బీఎస్‌ఎన్‌ఎల్ వైపు మొగ్గు చూపారు. దీంతో ప్రైవేట్ కంపెనీలు యూజర్లను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు పలు ప్లాన్స్‌ను పరిచయం చేశాయి. తక్కువ టారిఫ్ ధరతో, మంచి బెనిఫిట్స్‌తో ఈ ప్లాన్స్‌ను తీసుకొచ్చాయి. ఇందులో భాగంగానే ప్రము టెలికం సంస్థ జియో యూజర్లకు అదిరిపోయే మూడు ప్లాన్స్‌ను పరియం చేసింది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు.
రూ. 3599 ప్లాన్
ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే యూజర్లకు 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ 5జీ ఇంటర్నెట్‌తో పాటు రోజుకు 2.5 జీబీ డేటా పొందొచ్చు. అదే విధంగా అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు ఉచితంగా అందిస్తారు. ఇక వీటికి అదనంగా జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ వంటి సేవలను ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే రూ. 1500 విలువైన ఈజీమై ట్రిప్ ఓచర్, రూ. 1000 అజియో, రూ. 150 విలువైన స్విగ్గీ వోచర్‌ను పొందొచ్చు. నెల లెక్కన చూసుకుంటే రూ. 276 చెల్లించాల్సి ఉంటుంది.
రూ. 749 ప్లాన్
రూ. 749 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 72 రోజుల వ్యాలిడీతో అన్‌లిమిటడ్ 5జీ డేటా, రోజుకు 2 జీబీ 4జీ డేటా పొందొచ్చు. అదనంగా 20 జీబీ డేటాను మొత్తం వ్యాలిడిటీకి అందిస్తారు. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లు ఈ ప్లాన్‌తో పొందొచ్చు. ఇక అదనంగా జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ వంటి సేవలను ఈ ప్లాన్‌తో అందిస్తున్నారు.
రూ. 349 ప్లాన్
ఎక్కవ డేటా ఉపయోగించుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. రూ. 349తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ 5జీ డేటా పొందొచచు. అలాగే అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు ఉచిత 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు అందిస్తారు. వీటికి అదనంగా జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ వంటి యాప్స్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు.