MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • Mahindra XUV700 Facelift: కొత్త లుక్, హైబ్రిడ్ వెర్షన్‌తో మహీంద్రా XUV 700 ఫేస్‌లిఫ్ట్: అందరినీ ఆకర్షించే ఫీచర్లు ఇవే..

Mahindra XUV700 Facelift: కొత్త లుక్, హైబ్రిడ్ వెర్షన్‌తో మహీంద్రా XUV 700 ఫేస్‌లిఫ్ట్: అందరినీ ఆకర్షించే ఫీచర్లు ఇవే..

మహీంద్రా తన ప్రముఖ XUV700ని కొత్త ఫీచర్లతో అప్ డేట్ చేసింది. ఈ మోడల్‌కు 2026లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను తీసుకురానుంది. ఇందులో చాలా ఫీచర్లు ఉండే అవకాశం ఉందని ఆటోమొబైల్ రంగ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వాటి గురించిన లేటెస్ట్ సమాచారం తెలుసుకుందామా?   

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Jun 17 2025, 10:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మహీంద్రా XUV700 ఫేస్‌లిఫ్ట్ 2026
Image Credit : Google

మహీంద్రా XUV700 ఫేస్‌లిఫ్ట్ 2026

మహీంద్రా సంస్థ తన పాపులర్ SUV XUV700 మోడల్‌కు 2026లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను తీసుకురానుంది. ఈ కొత్త వెర్షన్‌లో విప్లవాత్మకమైన మార్పులు జరిగే అవకాశం ఉందని ఆటోమొబైల్ రంగ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ కలిగిన వేరియంట్‌ ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. 

మహీంద్రా XUV700 2021లో లాంచ్ అయినప్పటి నుంచి విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. ఈ కాంటెక్స్ట్‌లో 2026 ఫేస్‌లిఫ్ట్ మోడల్ మరింత ఆధునిక టెక్నాలజీ, సోఫిస్టికేటెడ్ డిజైన్, మెరుగైన ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, భద్రతా ఫీచర్లతో రాబోతుందని అంచనా.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
XUV700 2026 ఫీచర్స్
Image Credit : our own

XUV700 2026 ఫీచర్స్

కొత్త డిజైన్‌లో రివైజ్ చేసిన ఫ్రంట్ గ్రిల్, అప్డేటెడ్ హెడ్‌ల్యాంప్స్, కొత్త అలాయ్ వీల్స్‌ కనిపించే అవకాశం ఉంది. అంతేకాకుండా కార్‌లో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ (ADAS), 360 డిగ్రీ కెమెరా, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త ఇంటీరియర్ ఫినిషింగ్ వంటివి కూడా ఉండవచ్చని సమాచారం.

35
మహీంద్రా XUV700 కొత్త మోడల్
Image Credit : Google

మహీంద్రా XUV700 కొత్త మోడల్

ఇక పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్‌లతో పాటు, ఒక హైబ్రిడ్ వేరియంట్‌ కూడా లైనప్‌లో చేరే అవకాశం ఉంది. ఇది ఫ్యూయల్ ఎఫిషియెన్సీ, పర్ఫార్మెన్స్ పరంగా మెరుగైన అనుభవాన్ని అందించనుంది.

XUV.e9 మోడల్ ఫీచర్లు ఉండొచ్చని సమాచారం. కొత్త డాష్‌బోర్డ్, ఇన్‌ఫోటైన్‌మెంట్, వెంటిలేషన్ సీట్లు ఉంటాయి. హర్మన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ కూడా ఉండొచ్చు.

45
XUV700 ఫేస్‌లిఫ్ట్ స్పై షాట్స్
Image Credit : Google

XUV700 ఫేస్‌లిఫ్ట్ స్పై షాట్స్

2026లో మార్కెట్లోకి విడుదలయ్యే ఈ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్‌ పైన ఇంకా అధికారికంగా కంపెనీ ప్రకటించలేదు. టెస్టింగ్ దశలో ఉన్న కారును మహీంద్రా ఇటీవల రహస్యంగా రోడ్డుపై పరీక్షించినట్లు స్పై ఇమేజ్‌లు సూచిస్తున్నాయి.

ఈ SUV భారత మార్కెట్‌లో టయోటా హైరిడర్, హోండా ఎలివేట్ హైబ్రిడ్, హ్యూండాయ్ టసాన్ వంటి కార్లతో పోటీ పడే అవకాశం ఉంది.

ఇప్పటి ఇంజిన్లే కొత్త ఫేస్ లిఫ్ట్ కారులో ఉండే అవకాశం ఉంది. 2.0 లీటర్ పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్లు ఉంటాయి. ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వెర్షన్ కూడా రావొచ్చు.

55
XUV700 హైబ్రిడ్ విడుదల
Image Credit : our own

XUV700 హైబ్రిడ్ విడుదల

మహీంద్రా నుంచి ఈ కొత్త వేరియంట్‌పై పూర్తి సమాచారం కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 2026లో అధికారిక లాంచ్ తేదీకి ముందే, కంపెనీ మరిన్ని డిటైల్స్ విడుదల చేసే అవకాశం ఉంది.

2025 చివరిలో లేదా 2026 ప్రారంభంలో విడుదల కావొచ్చని పలు వెబ్ సైట్లలో రాశారు. ఈ కార్ లాంచ్ అయినా కొత్త ఫీచర్లు, హైబ్రిడ్ వెర్షన్ తో కొనుగోలుదారులను ఆకర్షిస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రూ. 400.. దివాలా తీసినట్లేనా? అసలు ఏం జరుగుతోంది?
Recommended image2
సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏమేం చెక్ చేయాలి?
Recommended image3
Gold Price Fall: ఊగిసలాడుతున్న పసిడి.. మళ్లీ భారీ పతనం..అయోమయంలో కొనుగోలుదారులు
Related Stories
Recommended image1
Top Fuel Efficient Petrol Cars: ప్రస్తుత మార్కెట్ లో బెస్ట్ మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కార్లు ఇవే!
Recommended image2
Mahindra: కొత్త టెక్నాలజీ, ఆకర్షణీయమైన లుక్‌తో మహీంద్రా XUV3XO హైబ్రిడ్: మార్కెట్‌లోకి వచ్చేది అప్పుడే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved