10 రూపాయల కాయిన్ తీసుకోకపోతే కేసు పెట్టొచ్చు.. తెలుసా?
డిజిటల్ లావాదేవీలు పెరగడం, చిల్లర కొరత పెరగడంతో ₹10 నోట్లు కనుమరుగయ్యాయి. వ్యాపారులకు చిల్లర ఇవ్వడం కష్టంగా మారింది. ₹10 నాణేలు మాత్రమే చెలామణిలో ఉన్నాయి. ₹10 నోటు గురించి కొత్త అప్డేట్ వచ్చేసింది.
పెరిగిన డిజిటల్ లావాదేవీలు
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం నోట్ల రద్దు తర్వాత దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. జన్ ధన్ యోజనతో అందరికీ బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లాంటి యూపీఐ పేమెంట్స్ యాప్‌లతో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగి.. నగదు లావాదేవీలు తగ్గాయి. దీంతో ₹10 నోట్లు కనుమరుగయ్యాయి.
₹10 నోట్ల కొరత
ఇప్పుడు మార్కెట్లో ₹10 నోట్లు దొరకడం కష్టంగా మారింది. ₹100 ఇస్తే చిల్లర కోసం ఇబ్బంది పడాల్సి వస్తోంది. వ్యాపారులకు ఇది తలనొప్పిగా మారింది.
నాణేల చెలామణి
పెద్ద లావాదేవీలకు డిజిటల్ చెల్లింపులు చేస్తే పన్ను పడుతుందనే భయంతో నగదు ఇస్తున్నారు. చిన్నపాటి చెల్లింపులకు మాత్రం డిజిటల్ లావాదేవీలు జరుపుతున్నారు. ఇక, చిల్లరగా ₹1, ₹2, ₹5, ₹10 నాణేలు చెలామణీలో ఉన్నాయి. ₹10 నోట్లు మాత్రం పెద్దగా కనిపించడం లేదు.
₹20, ₹50, ₹100 నోట్లే వస్తున్నాయి
మార్కెట్లో చిల్లర వస్తువులు కొనడానికి ₹5, ₹10 నాణేలనే వాడుతున్నారు ప్రజలు. గతంలో చెల్లదన్న అపోహతో నిరాకరించిన 10 రూపాయల నాణేలు ఇప్పుడు వాడకంలోకి వచ్చాయి. ₹10 నోట్లు దొరకకపోవడంతో తప్పని పరిస్థితుల్లో కాయిన్స్ వాడుతున్నారు. ఇక, రిజర్వ్ బ్యాంక్ నుంచి ₹20, ₹50, ₹100 నోట్లు మాత్రమే వస్తున్నాయి.
₹10 నాణేలు తప్పనిసరి
బ్యాంక్ అధికారులు తెలిపిన ప్రకారం.. ₹10 నోట్లు రావడం లేదు. ₹10 నాణేలు మాత్రమే చెలామణిలో ఉన్నాయి. ₹10 నాణేలు తీసుకోకపోతే మీరు కేసు కూడు పెట్టవచ్చు.