10 సూత్రాలు పాటిస్తే కొత్త వ్యాపారంలో విజయం మీదే..
ఎంత దూర ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. రిలయన్స్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ కంపెనీలు కూడా తమ వ్యాపారాన్ని చిన్నగానే మొదలుపెట్టాయి. సవాళ్లను ఎదుర్కొంటూ, ఆలోచనలు అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్లడంలో అనుకున్న లక్ష్యాలు సాధించి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి సేవలందిస్తున్నాయి. వ్యాపార రంగంలో ప్రపంచ విజేతలైన దిగ్గజ వ్యాపారులు పాటించిన 10 విజయ సూత్రాలు మీరూ పాటిస్తే మీ కొత్త వ్యాపారం కచ్చితంగా సక్సెస్ అవుతుంది. అవేంటో తెలుసుకుందామా..
చిన్నగా ప్రారంభించండి.. పెద్దగా ఆలోచించండి..
కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న వారు తాము అనుకున్న వ్యాపారాన్ని చిన్నగానే ప్రారంభించాలి. పెట్టుబడి ఉంది కదా అని మొత్తం అంతా పెట్టి ప్రారంభించకూడదు. ప్రారంభంలో వచ్చే కష్టనష్టాలను లెక్కించుకుంటూ కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలి.
నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి..
ప్రపంచం ఏ రోజుకారోజే అప్‌డేట్ అయిపోతోంది. మరి కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వారు మరింత అప్‌డేట్‌గా ఉండాలి. కొత్త ట్రెండ్స్‌ను గమనిస్తూ వ్యాపార ఆలోచనలు మెరుగుపరచుకోవాలి. నిపుణులు సూచనలు తీసుకుంటూ ఉండాలి. మార్కెట్‌లో పోటీని తట్టుకొని నిలబడాలంటే కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి.
బడ్జెట్, ఖర్చులపై కచ్చితమైన అంచనా అవసరం
కొత్త వ్యాపారం కాబట్టి ప్రాబ్లమ్స్ సహజంగానే వస్తాయి. వీటిని ఎదుర్కొనేందుకు ఆర్థిక పరంగా ముందుగానే రెడీగా ఉండాలి. దీనికోసం మీ బడ్జెట్, ఖర్చులు, నగదు లావాదేవీలపై కచ్చితమైన అంచనా ఉండాలి.
పరిష్కారంపై దృష్టి పెట్టండి..
వ్యాపారంలో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దాని పరిష్కారంపై మాత్రమే దృష్టి పెట్టండి. అసలు సమస్య ఎందుకొచ్చింది. నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అంటూ నిరాశ చెందకండి. మీ కష్టమర్లు ఎదుర్కొంటున్న సమస్యలనూ గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా ఆలోచనలు చేయండి. అసహనానికి గురికావద్దు.
పట్టుదల, సహనం కోల్పోకూడదు..
పట్టుదలగా వ్యాపారం ప్రారంభించడం ఎంత సులభమో, ఓపిగ్గా దాన్ని సక్సెస్ చేయడం అంతే అవసరం. ఏ పనైనా ప్రారంభించగానే విజయం సొంతం అయిపోదు. పట్టుదల, సహనంతో సవాళ్లను అధిగమిస్తుంటే సక్సెస్ దానంతట అదే వస్తుంది.
విలువలకు కట్టుబడి ఉండాలి
ఏ వ్యాపారమైనా నిలబడాలంటే విలువలు పాటించడం అవసరం. ఇది కస్టమర్లకు నమ్మకాన్ని కలిగిస్తుంది. పదే పదే మన వద్దకు వచ్చేలా చేస్తుంది. దీంతో మీకు ప్రత్యేక బ్రాండ్ ఏర్పడుతుంది.
కస్టమర్ల సూచనలకు ప్రాధాన్యమివ్వాలి..
నూతనంగా బిజినెస్ మొదలు పెడుతున్నప్పుడు కస్టమర్లను ఆకర్షించడం చాలా అవసరం. ఈ క్రమంలో వారు ఇచ్చే సూచనలను తప్పక స్వీకరించాలి. వాటిని పరిశీలించి అమలు చేయదగినవైతే పాటించాలి.
ఓటమి నుంచి కొత్త పాఠం నేర్చుకోవాలి..
అనుకున్నది అనుకున్నట్టు జరిగితే జీవితంలో కిక్కేముంటుంది. వ్యాపారంలో ఓటమి ఎదురైతే ఓపిగ్గా స్వీకరించాలి. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకొని రిపీట్ కాకుండా ముందడుగు వేయాలి. భవిష్యత్తులో చేసే ప్రయత్నాలకు సహకరిస్తాయి.
రిస్క్ తీసుకోవాలి.. కాని..
బిజినెస్ నిర్వహణలో ఒక్కోసారి రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో తెలివితేటలుగా వ్యవహరించి నిర్ణయం తీసుకోవాలి. ఫైనాన్స్, ప్రాబ్రమ్స్, ఛాలెంజస్ అన్నింటినీ దాటేలా వ్యవహరించాలి.
మీకు మద్దతిచ్చే వారిని దూరం పెట్టకండి..
మీ తెలివితేటలు, నైపుణ్యాన్ని గుర్తించి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న దూరం పెట్టకండి. వారి సూచనలు తీసుకోండి. మీ వ్యాపారంలో వచ్చే సవాళ్లను తగ్గించడంలో వారు మీకు కచ్చితంగా సహాయపడతారు.