- Home
- Automobile
- Bikes
- రైడర్స్ కలల బైక్: హైవేలు కంపించే థంప్.. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఎందుకు స్పెషల్? అసలు కథ ఇదే !
రైడర్స్ కలల బైక్: హైవేలు కంపించే థంప్.. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఎందుకు స్పెషల్? అసలు కథ ఇదే !
Royal Enfield history: రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ చేసే సౌండ్ ఒక శబ్దం కాదు, అది యువత హృదయ స్పందన ! అవును ఈ బైక్ లవర్స్ చాలా మంది ఉన్నారు. 1901లో ప్రారంభమైన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్, యుద్ధ భూముల నుండి భారత హైవేల వరకు ఓ లెజెండరీ బైక్‌గా మారింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్: ఒక శతాబ్దపు సౌండ్‌స్టోరీ
బైకులు చాలా చూశాం, కానీ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైకు మాత్రం చాలా స్పెషల్. దాని కథనే వేరబ్బా.. అది కేవలం ఓ మోటార్‌సైకిల్ కాదు.. అది ఒక శబ్దం, ఒక థంప్, ఒక లైఫ్ స్టైల్ ! ఈ లెజెండరీ బైక్ 1901కు ముందు ఇంగ్లాండులో సైకిళ్లు తయారుచేసే చిన్న కంపెనీ నుండి జన్మించింది. కొంతకాలం తర్వాత అదే సంస్థ మోటార్‌సైకిళ్ల తయారీలోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి దాని ప్రయాణం ప్రపంచం మొత్తంగా సాగుతోంది.
1931లో బుల్లెట్ బైకు పుట్టింది.. యుద్ధభూముల్లో దడపుట్టించింది !
బైకులు ఉంటాయి... కానీ, రాయల్ ఎన్‌ఫీల్డ్ వేరు.. అది ఒక సౌండ్, ఒక థంప్, ఒక లైఫ్‌స్టైల్. ఇంగ్లాండులో 1901 కు పూర్వం కేవలం సైకిళ్లు తయారుచేసిన ఓ కంపెనీ నెమ్మదిగా మోటార్ సైకిళ్లు తయారు చేయడం ప్రారంభించింది. 1931లో బుల్లెట్ బండిని తయారు చేసింది. యుద్ద సమయాల్లో శత్రు భూబాగాల్లో సైతం హెలీకాప్టర్స్, పారాచుట్ ద్వారా విడిచి అక్కడ తిరిగేందుకని దీన్ని మరింత ధృఢంగా తయారు చేశారు.
భారత గడ్డపై బుల్లెట్ బండి ఎప్పుడు పరుగులు పెట్టింది?
తక్కువ కాలంలోనే మస్తు క్రేజ్ ను సంపాదించుకున్న రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ 1951లో మొదటి సారి భారత భూభాగంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత 'మద్రాస్ మోటర్స్' అనే కంపెనీ "ఎన్ఫీల్డ్ ఇండియా లిమిటెడ్" పేరుతో ఇక్కడే మానిఫాక్చరింగ్ కి లైసెన్స్ సంపాదించింది.
1971 యుద్ద సమయంలో భారత సైన్యానికి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ చేసిన సేవలు అమూల్యంగా మారాయి. ఆ తర్వాత భారతీయ కంపెనీ "ఐషర్ మోటర్స్" ఈ కంపెనీని సొంతం చేసుకుంది. ఇంగ్లాండు నుంచి వచ్చిన ఈ బండి ఇప్పుడు ఇండియా నుంచి ఇంగ్లాండుకే ఎగుమతి అవడం విశేషం.
Royal Enfield Bullet సిగ్నేచర్ థంప్.. బుల్లెట్ ప్రత్యేకత అదే మరి !
బుల్లెట్ బండి ఇప్పుడు భారత యువత గుండె చప్పుడులా మారింది. 1971 యుద్ధంలో దేశ సరిహద్దులను గస్తీ చేయడం నుంచి, నేడు హైవేలను దాటడం వరకు, బుల్లెట్ కేవలం మోటార్‌సైకిల్ కాదు.. ఇప్పుడు కాలేజ్ యువత కలల బైక్‌గా మారింది. ఎందుకీ ప్రత్యేకత అనుకుంటున్నారా?
• మైళ్ళ దూరం నుంచే వినిపించే ఆ సిగ్నేచర్ “థంప్”
• ఎప్పటికీ స్టైలిష్‌గా ఉండే క్లాసిక్ డిజైన్
• నగరం, హైవే, పర్వత మార్గాల్లోనూ రగ్డ్ పవర్ తో నడుస్తుంది
• గోవా Rider Mania నుండి లడాఖ్ రోడ్ ట్రిప్స్ వరకు కల్ట్ కమ్యూనిటీ
• జావా, యెజ్డీ, హార్లే, ట్రయంప్ వంటి బ్రాండ్లు బుల్లెట్ క్రేజ్ ను కాజేసేందుకు ప్రయత్నించినా, అందని ద్రాక్షగానే మిగిలిందని చెప్పవచ్చు
అందుకే బుల్లెట్ ఎల్లప్పుడూ మోస్ట్ రియల్ ! క్రేజీ.. కొత్త అనుభూతి మరి !
క్లాసిక్ నుండి హిమాలయన్ వరకు.. బుల్లెట్ బండి లెజెండరీ ప్రయాణం
ఆర్మీ గస్తీ నుండి కాలేజ్ యువత కలల వరకు, వింటేజ్ క్లాసిక్‌ల నుండి మోడర్న్ మోడల్స్ (Himalayan, Hunter) వరకు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ యాత్ర భారతదేశం మోటార్‌సైక్లింగ్ ప్రేమ కథే.
“When you ride a Bullet, you don’t just go places… you announce your arrival.”
If you own one, you know the feeling. If you don’t, you’ve surely dreamed of it.
ఆ థంప్ కేవలం శబ్దం కాదు. అది యువత హృదయ స్పందన.
ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పుడు వింటేజ్ క్లాసిక్స్ నుండి ఆధునిక మోడల్స్ వరకు విస్తరించింది. Classic 350, Hunter, Himalayan వంటి బైకులు ఆధునిక రైడర్లలో విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. ఆర్మీ గస్తీ నుంచి రైడర్ కమ్యూనిటీ వరకు, బుల్లెట్ బండి ఇప్పుడు ఒక యుగానికి చిహ్నంగా నిలిచింది. అవును మరి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ లైఫ్ కేవలం రైడింగ్ కాదు.. అది ఒక లెగసీ !
గమనిక: ఈ కథనంలోని సమాచారం సీనియర్ జర్నలిస్ట్ ప్రదీప్ కుమార్ ఫేస్‌బుక్ వాల్ (Pradeep Facebook Page) నుండి సేకరించినది.