బజాజ్ పల్సర్ బైక్స్ ఫెస్టివల్ ఆఫర్.. కేవలం రూ.8580 బైక్ మీ సొంతం..
మీరు ఈ ధంతెరాస్ సందర్భంగా కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా, అయితే ఈ వార్త మీకు ఎంతో ఉపయోగపడుతుంది. బజాజ్ ఆటో పల్సర్ బైక్స్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్‌ను తీసుకోచ్చింది. బజాజ్ పల్సర్ 125 నియాన్, పల్సర్ 125 స్ప్లిట్ సీట్ మోడల్స్ పై ఈ ఆఫర్ ప్రవేశపెట్టింది. ఈ పండుగ సీజన్ లో బజాజ్ పల్సర్ బైక్ మీకు బెస్ట్ బడ్జెట్ బైక్ అవుతుంది. ఈ ఆఫర్ లో భాగంగా వాటి ధరలు, స్పెసిఫికేషన్ల గురించి మీకోసం.
ఈ పండుగ సీజన్‌లో మీరు పల్సర్ 125 నియాన్, పల్సర్ 125 స్ప్లిట్ సీట్ మోడల్ కొనుగోలు చేస్తే, మీకు 3వేల రూపాయల వరకు ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే ఈ బైకును రూ.8580 డౌన్ పెంట్ చెల్లించి ఇంటికి తీసుకెల్లోచ్చు. అంతే కాకుండా అన్ని పల్సర్ మోడళ్ల ఫైనాన్స్‌పై రూ .12000 వరకు ఆదా చేయవచ్చు.
పల్సర్ 125 స్ప్లిట్ సీట్ (డ్రమ్ బ్రేక్ ) ధర - 70,274 అసలు ధర 73, 274
పల్సర్ 125 సింగిల్ సీట్ (డ్రమ్ బ్రేక్) ధర - 69,622 అసలు ధర 72, 112
పల్సర్ 125 డిస్క్ వేరియంట్స్ ధర - 74,922 అసలు ధర 76,922
బజాజ్ పల్సర్ 125 నియాన్, పల్సర్ 125 స్ప్లిట్ సీట్ రెండు మోడల్స్ 124.4 సిసి ఇంజన్, 4-స్ట్రోక్, 2-వాల్వ్, ట్విన్ స్పార్క్ బిఎస్ 6 డిటిఎస్-ఐ, ఇంజన్ 8500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 12 పిఎస్ శక్తిని, 6500 ఆర్‌పిఎమ్ వద్ద 11 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్ అందించారు.
బ్రేకింగ్ ఫీచర్స్ గురించి చెప్పాలంటే, బజాజ్ పల్సర్ 125 నియాన్, పల్సర్ 125 స్ప్లిట్ సీట్ రెండింటికి ముందు భాగంలో 240 ఎంఎం డిస్క్ బ్రేక్ లేదా 170 ఎంఎం డ్రమ్ బ్రేక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. వెనుక భాగంలో 130 ఎంఎం డ్రమ్ బ్రేక్ స్టాండర్డ్ గా అందిస్తున్నారు. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్, వెనుక భాగంలో ట్విన్ గ్యాస్ షాక్ సస్పెన్షన్ ఉంది. సీట్ల పొడవు 2055 ఎంఎం, వెడల్పు 755 ఎంఎం, సీట్ ఎత్తు 1060 ఎంఎం, వీల్‌బేస్ 1320 ఎంఎం, గ్రౌండ్ క్లియరెన్స్ 165 ఎంఎం.