MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • 62.5 kmpl మైలేజ్, అదిరిపోయే ఫీచర్స్ తో... మార్కెట్లోకి 125cc హైబ్రిడ్ స్కూటర్ వచ్చేసింది

62.5 kmpl మైలేజ్, అదిరిపోయే ఫీచర్స్ తో... మార్కెట్లోకి 125cc హైబ్రిడ్ స్కూటర్ వచ్చేసింది

యమహా మోటార్స్ తమ ప్రీమియం 'గ్రాండ్ ఫిలానో 125cc హైబ్రిడ్' స్కూటర్‌ను ఇంటర్నేషనల్ మార్కెట్‌లో లాంచ్ చేసింది. కొత్త కలర్స్, లగ్జరీ ఫీచర్లతో ఈ స్కూటర్ అదరగొడుతోంది.

2 Min read
Author : Arun Kumar P
Published : Oct 15 2026, 05:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
లీటర్‌కు 62.5 కి.మీ మైలేజ్ బైక్ లాంచ్
Image Credit : X

లీటర్‌కు 62.5 కి.మీ మైలేజ్ బైక్ లాంచ్

యమహా మోటార్ కంపెనీ తమ వరల్డ్ క్లాస్ ప్రీమియం 125cc హైబ్రిడ్ స్కూటర్ 'యమహా గ్రాండ్ ఫిలానో హైబ్రిడ్' ను ఇంటర్నేషనల్ మార్కెట్‌లో అఫీషియల్‌గా లాంచ్ చేసింది. కొత్త కలర్స్, అదిరిపోయే లగ్జరీ ఫీచర్లతో దీన్ని తీసుకొచ్చింది. వియత్నాం, థాయ్‌లాండ్ మార్కెట్లలో హోండా ఎస్హెచ్ మోడ్ (Honda SH Mode) స్కూటర్‌కు ఇది గట్టి పోటీ ఇస్తోంది. వియత్నాంలో దీని ప్రారంభ ధర సుమారు 50 మిలియన్ విఎన్‌డి (VND)గా ఉంది.

ఇండియాలో జరిగే ఆటో ఎక్స్‌పోలలో దీన్ని 'యమహా గ్రాండే' (Yamaha Grande) పేరుతో ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు ఈ స్కూటర్ వేరియంట్లు, ధర, ఇంజిన్ ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మోడల్స్, ధరల వివరాలు
Image Credit : X

మోడల్స్, ధరల వివరాలు

యమహా గ్రాండ్ ఫిలానో హైబ్రిడ్ ఏబీఎస్ (ABS) వెర్షన్ : ఈ టాప్ ఎండ్ మోడల్ 'డీప్ నేవీ బ్లూ'తో పాటు మొత్తం ఐదు కలర్స్‌లో దొరుకుతుంది. థాయ్‌లాండ్‌లో దీని ధర 69,200 బాట్ (మన కరెన్సీలో సుమారు రూ.1.66 లక్షలు / 54 మిలియన్ VND).

యమహా గ్రాండ్ ఫిలానో హైబ్రిడ్ స్టాండర్డ్ మోడల్ : ఈ బేస్ వేరియంట్ 'లైట్ పాస్టెల్ బ్లూ', మచ్చా లాటే, అబ్సిడియన్ బ్లాక్ సహా ఐదు రంగుల్లో లభిస్తుంది. థాయ్‌లాండ్‌లో దీని ప్రారంభ ధర 64,700 బాట్ (మన కరెన్సీలో సుమారు రూ.1.55 లక్షలు / 50 మిలియన్ VND).

34
అద్భుతమైన మైలేజ్
Image Credit : X

అద్భుతమైన మైలేజ్

ఈ స్కూటర్‌లో యమహాకు చెందిన పాపులర్ 125cc బ్లూ కోర్ హైబ్రిడ్ ఇంజిన్‌ను అమర్చారు. మనం బండిని స్టార్ట్ చేసి యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు, ఇందులోని ఎలక్ట్రిక్ హైబ్రిడ్ సిస్టమ్ ఇంజిన్‌కు అదనపు పవర్ ఇస్తుంది. దీనివల్ల ట్రాఫిక్‌లో ఎలాంటి సౌండ్ లేకుండా బండి చాలా స్మూత్‌గా, వేగంగా దూసుకెళ్తుంది. ఇంజిన్ వేడిని వెంటనే తగ్గించి, బండి లైఫ్ పెంచేందుకు ఇందులో ప్రత్యేకమైన 'డయాసిల్' (DiASiL) టెక్నాలజీని వాడారు.

44
టెక్నికల్ ఫీచర్లు
Image Credit : X

టెక్నికల్ ఫీచర్లు

హైబ్రిడ్ టెక్నాలజీ వల్ల ఈ ఫిలానో స్కూటర్ లీటర్ పెట్రోల్‌కు ఏకంగా 62.5 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీంతో కస్టమర్లకు చాలా డబ్బు ఆదా అవుతుంది.

సిగ్నల్స్ దగ్గర బండి ఆపినప్పుడు పెట్రోల్ ఆదా చేసేందుకు 'స్టాప్ అండ్ స్టార్ట్' సిస్టమ్ ఇందులో ఉంది. అలాగే సింగిల్ ప్రెస్‌తో బండిని స్టార్ట్ చేసే 'వన్ పుష్ స్టార్ట్' ఫీచర్‌ను కూడా స్టాండర్డ్‌గా అందించారు. ఇలా అద్భుతమైన ఫీచర్లు కలిగిన యమహా ఫిలానో 125cc హైబ్రిడ్ విదేశాల్లో అందుబాటులో ఉంది… మనదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందో చూడాలి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
psychology of overthinking: రాత్రిపూట పాత జ్ఞాపకాలన్నీ ఎందుకు గుర్తుకొస్తాయి?
Recommended image2
Toyota Car Offers: టయోటా కార్లపై పండగ ధమాకా...రూ.13.38 లక్షల వరకు మెగా ఆఫర్!
Recommended image3
Festive Car Buying Tips: కొత్త కారు కొనేముందు ఈ 5 సీక్రెట్స్ తెలిస్తే.. లక్షల్లో ఆదా పక్కా
Related Stories
Recommended image1
EV battery replacement Cost : ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీ మార్చాలంటే ఎంత ఖర్చవుతుంది?
Recommended image2
EV Car : సింగిల్ ఛార్జ్‌తో 600 కి.మీ నాన్ స్టాప్ జర్నీ.. 2 టన్నుల బరువునైనా మోసే సూపర్ ఈవి కారు ఇదే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved