వాహ్.. అదరగొట్టిన్న 90 ఏళ్ల బామ్మ ఈ వయస్సులో కూడా కారు నడుపుతు.. వీడియో వైరల్..
ఈ రోజుల్లో బైక్ డ్రైవింగ్ లేదా కార్ డ్రైవింగ్ ప్రతి ఒక్కరికీ సాధారణం. అయితే కొన్ని సంవత్సరాల క్రితం కార్ నేర్చుకోవడం లేదా నడపడటం అంటే అది కొందరికే సాధ్యపడేది. తాజాగా మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ 90 ఏళ్ల వృద్ధురాలు తన డ్రైవింగ్ స్కిల్స్ తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.
ఈ వృద్ధురాలు పాత మారుతి 800 హ్యాచ్‌బ్యాక్ కారును నడుపుతున్న వీడియో ఒకటి వైరల్ అయింది. అయితే ఈ వీడియో చాలా తక్కువ బాగా పాపులర్ అయ్యింది, అంతేకాదు రాష్ట్ర ముఖ్యమంత్రి దీనిని చూడటమే కాకుండా ప్రశంసించారు కూడా.
సోషల్ మీడియా ట్విట్టర్‌లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ వీడియోను షేర్ చేస్తూ , "మన అభిరుచులను, ఇష్టాలను నెరవేర్చుకోవడానికి వయస్సు పరిమితి లేదని ఈ బామ్మ మనందరికీ స్ఫూర్తినిచ్చింది!" అని ట్వీట్ చేశారు.
రేషమ్ బాయ్ తన్వర్ దేవాస్ జిల్లాలోని బిలావలి ప్రాంత నివాసి. తన కూతురు, కోడలుతో సహా తన కుటుంబ సభ్యులందరికీ డ్రైవింగ్ వచ్చు కాబట్టి నేను కారు నడపడం నేర్చుకున్నానని చెప్పాడు. నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. నా దగ్గర కార్లు, అలాగే ట్రాక్టర్లు కూడా ఉన్నాయి అని అన్నారు.
ఈ బామ్మ డ్రైవింగ్ స్కిల్స్ ని ప్రశంసిస్తూ ట్విట్టర్‌లో చాలా మంది వినియోగదారులు ఈ వీడియోను షేర్ చేశారు ఇంకా భారీగా లైక్స్ వచ్చాయి. అయితే అంత పెద్ద రహదారిపై కారు నడపడానికి ఆమెకి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అనే ప్రశ్నను కూడా చాలామంది లేవనెత్తారు.
మధ్యప్రదేశ్ రవాణా శాఖ ప్రకారం, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ 20 సంవత్సరాల వరకు లేదా 50 సంవత్సరాల వయస్సు వరకు జారీ చేయబడుతుంది. వాణిజ్య వాహనం కోసం జారీ చేసిన పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ మూడేళ్ల తర్వాత రెన్యూవల్ చేసుకోవాలి.
భారతదేశంలో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ గరిష్ట వయోపరిమితిని 75 సంవత్సరాల వరకు పెంచేందుకు మోటార్ వాహనాల చట్టంలో మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.