భారతదేశంలోకి రానున్న టెస్లా కార్లు ఇవే.. వాటి ధర, వివరాలు తెలుసుకోండి,,
దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ టాటా మోటార్స్ ఆల్-ఎలక్ట్రిక్ కారు టాటా నెక్సాన్ ఇ.వి ను ప్రారంభించి ఒక సంవత్సరం కావొస్తుంది. ఈ కారు అమ్మకాలను చూస్తే కంపెనీ గత సంవత్సరం నుండి అత్యధిక యూనిట్ల అమ్మకాలతో విజయవంతమైంది.
అయితే భారతీయ రోడ్లపై ఛార్జింగ్ స్టేషన్ మౌలిక సదుపాయాలు ఇంకా పూర్తిగా అభివృద్ధి కలేదు. కానీ భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల ఎంపికలు పెరుగుతున్నాయి. ఎలక్ట్రిక్ కార్ల విషయానికి వస్తే, యు.ఎస్ ఆటోమొబైల్ కంపెనీ టెస్లా గురించి మీకు తెలిసిందే. భారతదేశంలో టెస్లా కార్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ పూర్తిగా మారుతుంది. అయితే టెస్లా నుండి ఏ కార్లు భారతదేశానికి వస్తున్నాయో తెలుసుకోండి.
ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఎలక్ట్రిక్ కార్లతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు, టెస్లా వ్యవస్థాపకుడు అండ్ సిఈఓ ఎలోన్ మస్క్ తాజాగా భారతదేశంలో ఒక ప్లాంట్ (తయారీ కేంద్రం) ప్రారంభించనూన్నట్లు ధృవీకరించారు.
దీంతో ద్వారలోనే కంపెనీ భారతదేశంలో ఉత్తమ కార్లను ఉత్పత్తి ప్రారంభించనుంది. అయితే, దీనికి కొంత సమయం పడుతుంది. భారతదేశంలో టెస్లా కారు కొనడం అంటే ఇప్పటికీ స్టేటస్ సింబల్ మారింది. భారతదేశంలో టెస్లా కార్ల ధర ఎంత ఉంటుందో అనే అంచనాలు పెరుగుతున్నాయి.
భారతదేశంలో అందుబాటులో ఉన్న అన్ని టెస్లా మోడల్స్, వాటి ధర ఎంతంటే :
1. టెస్లా మోడల్ 3
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ భారత మార్కెట్లో టెస్లా కార్ల రాకను ధృవీకరించారు. మోడల్ 3 టెస్లా చౌకైన, అత్యధికంగా అమ్ముడైన కారు. భారతీయ వినియోగదారులకు ఈ కారును దిగుమతి చేసి విక్రయిస్తారు. టెస్లా ఇంకా ఉత్పత్తి కర్మాగారాన్ని ఏర్పాటు చేయనందున, కంపెనీ మోడల్ 3 కారు యొక్క కంప్లీట్లీ బిల్ట్ యూనిట్లను (సిబియు) దిగుమతి చేస్తుంది, దీని ధర కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. అయితే, ఈ కారు ఇప్పటికీ భారతదేశంలో రూ .55 లక్షల నుంచి రూ .60 లక్షల వరకు ఉండొచ్చు. టెస్లా మోడల్ 3 కారును పూర్తిగా ఛార్జ్ చేయడానికి చాలా తక్కువ నిమిషాల సమయం పడుతుందని సమాచారం. పూర్తి ఛార్జింగ్ అయిన తర్వాత, ఈ కారు 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. కారు టాప్ స్పీడ్ గంటకు 162 కి.మీ.
2. టెస్లా మోడల్ ఎస్
ఒక నివేదిక ప్రకారం, కంపెనీ బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్ మోడల్ 3 తరువాత, టెస్లా మోడల్ ఎస్ ను భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ కారు కొంచెం ఎక్కువ ప్రీమియంగా ఉంటుంది. 75 డి, 100డి, పి100డి అనే మూడు వేర్వేరు వేరియంట్లలో ఈ కారు అందించబడుతుంది. టెస్లా మోడల్ ఎస్ కారు ధర రూ .1.5 కోట్ల వరకు ఉంటుంది. భారతదేశంలో లగ్జరీ సెడాన్ కార్ల విభాగంలో ఇంత ఖరీదైన మొదటి కారు ఇదే అవుతుంది. భారత మార్కెట్లో, టెస్లా మోడల్ ఎస్ బిఎమ్‌డబ్ల్యూ , ఆడి వంటి కార్లతో పోటీ పడనుంది.
3. టెస్లా మోడల్ ఎక్స్
టెస్లా మోడల్ ఎక్స్ భారతదేశానికి రావడం గురించి ఇంకా అనుమానం ఉంది. టెస్లా మోడల్ ఎక్స్ 7 సీట్ల క్రాస్ ఓవర్ ఎస్‌యూవీ, అలాగే కంపెనీ దీనిని అప్‌గ్రేడ్ చేసింది, చాలా ఆకర్షణీయంగా కూడా ఉంటుంది. ఒక నివేదిక ప్రకారం, టెస్లా మోడల్ ఎక్స్ ఫేస్‌లిఫ్ట్ ధర 89,990 డాలర్ల నుండి 119,990 డాలర్ల మధ్య ఉంటుంది.