లేటెస్ట్ డిజైన్, కొత్త ఫీచర్లతో మారుతి సుజుకి కొత్త వెర్షన్ కార్ వస్తోంది..లాంచ్ వివరాలు తెలుసుకోండి
జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ సుజుకి (SUZUKI) పాపులర్ హ్యాచ్‌బ్యాక్ వ్యాగన్ఆర్ కొత్త జనరేషన్ మోడల్‌ను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. నివేదిక ప్రకారం నెక్స్ట్ జనరేషన్ వ్యాగన్ఆర్ మోడల్ ప్రపంచవ్యాప్త ఎంట్రీ ఈ ఏడాది చివర్లో అంటే డిసెంబర్ నెలలో జరుగనుంది.
ఈ మోడల్ సుజుకి వ్యాగన్ఆర్ ఏడవ జనరేషన్. భారతీయ మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న మారుతి వ్యాగన్ఆర్ 2019లో లాంచ్ చేయబడింది అయితే ఇది థర్డ్ జనరేషన్ మోడల్.
ప్రత్యేక డిజైన్
సుజుకి వ్యాగన్ఆర్ 2022 గురించి మాట్లాడితే కొత్త జనరేషన్ మోడల్ బాక్సీకి బదులుగా మరింత కార్నర్ డిజైన్‌ను పొందుతుంది. కొత్త వ్యాగన్ఆర్‌లో చేసిన లేటెస్ట్ మార్పులు కారు ముందు భాగంలో కనిపిస్తాయి. వీటిలో రీడిజైన్ గ్రిల్, అడ్జస్ట్ హెడ్‌ల్యాంప్‌లు, కొత్త ఎయిర్ డ్యామ్, బోనెట్ ప్రధానంగా ఉంటాయి. కొత్త క్వారీష్ అర్కులు, ఫ్లాట్ డోర్ ప్యానెల్‌లు, కొత్త అల్లాయ్ వీల్స్ ని సైడ్ ప్రొఫైల్ జోడించారు. కొత్తగా డిజైన్ చేసిన టెయిల్‌ల్యాంప్‌లు కాకుండా వెనుక భాగం ప్రస్తుత మోడల్ లాగానే కనిపిస్తుంది.
గొప్ప ఫీచర్స్
కొత్త వ్యాగన్ఆర్ క్యాబిన్ గురించి మాట్లాడితే చాలా పెద్ద మార్పులు ఇందులో చూడవచ్చు. సేఫ్టీ ఫీచర్స్ పరంగా 360-డిగ్రీ కెమెరా, లేన్ డిపార్చర్ వార్నింగ్ సిస్టమ్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, హెడ్-అప్ డిస్‌ప్లే, హై బీమ్ అసిస్ట్, స్టాగ్గర్ వార్నింగ్ ఫంక్షన్ వంటి ఫీచర్లను పొందుతుంది. కార్ల తయారీ సంస్థ ప్రస్తుత మోడల్ లైనప్‌కు మరికొన్ని సేఫ్టీ ఫీచర్స్ జోడించవచ్చు.
ఇంజిన్ అండ్ పవర్
కొత్త 2022 సుజుకి వ్యాగన్ఆర్‌లో R06D, 3-సిలిండర్, ఇన్-లైన్ ఇంజన్ లభిస్తుంది. ఈ ఇంజిన్ రాపిడ్ కంబాషన్ సిస్టం, కూలెడ్ ఈజిఆర్ (ఎగ్సాస్ట్ గ్యాస్ రీసర్క్యులేషన్) కలిగి ఉంటుంది. ఒకవేళ రిపోర్ట్స్ నిజమైతే లైట్ హైబ్రిడ్ సిస్టమ్ కూడా అప్‌డేట్ పొందవచ్చు. కారు గేర్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ లో 5-స్పీడ్ మాన్యువల్ అండ్ సివిటి ఆటోమేటిక్ ఉంటాయి.
కలర్ ఆప్షన్
కొత్త జనరేషన్ మోడల్‌తో పాటు జపనీస్ కార్ మేకర్ మోడల్ లైనప్‌లో కొత్త కలర్ ఆప్షన్‌లను కూడా చేర్చవచ్చు. ప్రస్తుతం వ్యాగన్ఆర్ 6 కలర్ ఆప్షన్‌లతో వస్తుంది. వీటిలో మూన్‌లైట్ వైలెట్ పెర్ల్ మెటాలిక్, అర్బన్ బ్రౌన్ పెర్ల్ మెటాలిక్, బ్లష్ బ్లాక్ పెర్ల్, యాక్టివ్ ఎల్లో, బ్లిస్ బ్లూ మెటాలిక్ మరియు ఫీనిక్స్ రెడ్ పెర్ల్ వంటి కలర్స్ ఉన్నాయి.