మారుతి సుజుకి నుండి త్వరలో సరికొత్త సిఎన్‌జి వేరియంట్ కార్.. ఇంటర్నెట్ లో లికైన ఫీచర్స్ ఇవే..
రోజురోజుకి పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు భారతీయ కార్ మార్కెట్లో వాహనదారులు ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మొగ్గు చూపుతున్నారు. డీజిల్ లేదా పెట్రోల్‌తో నడిచే కారును కొనాలా లేదా చౌకైన సిఎన్‌జితో నడిచే కారును కొనాలా అని వాహనదారులు సతమతమవుతున్నారు.
అయితే తాజా నివేదికల ప్రకారం సిఎన్‌జి కార్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో వాహన తయారీదారులు వారి బ్రాండ్ కార్లను సిఎన్‌జి వేరియంట్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కూడా కంపెనీకి చెందిన ప్రముఖ ఎస్‌యూవీని సిఎన్‌జి వేరియంట్‌లో తీసుకురాబోతోంది.
రాబోయే రోజుల్లో మారుతి సుజుకి సిఎన్‌జి ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను విస్తరించాలని యోచిస్తోంది. ఇండో-జపనీస్ కార్ల తయారీ సంస్థ మూడు ప్రముఖ మోడల్స్ స్విఫ్ట్, స్విఫ్ట్ డిజైర్, విటారా బ్రెజ్జా సిఎన్‌జి వేరియంట్‌లపై పనిచేస్తోంది. త్వరలో రాబోయే మారుతి విటారా బ్రెజ్జా సిఎన్‌జి స్పెసిఫికేషన్‌లు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. లీకైన సమాచారం ప్రకారం ఈ మోడల్ 1.4-లీటర్ K15B పెట్రోల్ ఇంజన్‌తో ఫ్యాక్టరీ-అమర్చిన సిఎన్‌జి కిట్‌తో వస్తుంది. కారు పవర్, టార్క్ అవుట్‌పుట్‌లో స్వల్ప తగ్గుదల ఉండవచ్చు.
మారుతి వితారా బ్రెజ్జా సిఎన్‌జి వేరియంట్ 91bhp గరిష్ట శక్తి, 122Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎస్‌యూవి పెట్రోల్ మోడల్ 103 bhp శక్తిని, 138 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సిఎన్‌జి కిట్‌ను 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అందించవచ్చు. మారుతి సుజుకి నుండి వచ్చిన ఇతర సిఎన్‌జి కార్ల లాగానే డ్యూయల్ ఇంటెర్దెపెండెంట్ ఈసియూ, ఇంటెలిజెంట్ ఇంజెక్షన్ సిస్టం పొందుతుంది. అంతేకాకుండా సిఎన్‌జి కిట్‌తో కారు బరువులో తేడా ఉండొచ్చు. ఇంకా సస్పెన్షన్ సెటప్ అండ్ బ్రేకింగ్ సిస్టమ్‌లో కూడా మార్పులు చేయవచ్చు.
మారుతి సుజుకి "ఎస్-సిఎన్‌జి కార్లు అత్యుత్తమ పనితీరు, భద్రత, ఇంజిన్ మన్నిక, ఫీచర్లు, అత్యుత్తమ మైలేజీని అందించడానికి రూపొందించబడ్డాయి" అని తెలిపింది. అయితే సంస్థ మారుతి విటారా బ్రెజ్జా సిఎన్‌జి వేరియంట్ లాంచ్ వివరాలను వెల్లడించలేదు. కానీ కొత్త జనరేషన్ మారుతి సెలెరియోను విడుదల చేయడానికి కంపెనీ సిద్ధమవుతోంది, ఈ కారు వ్యాగన్ఆర్ లాంటి 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. 83bhp శక్తిని ఇస్తుంది ఇంకా కారులో విస్తృతమైన డిజైన్, ఫీచర్ అప్‌గ్రేడ్‌లు కనిపిస్తాయి.
కొత్త సెలెరియో తర్వాత కంపెనీ సెకండ్ జనరేషన్ మారుతి వితారా బ్రెజ్జాను తీసుకురానుంది, దీనిని 2022 ప్రారంభంలో లాంచ్ చేయవచ్చని భావిస్తున్నారు. కాంపాక్ట్ ఎస్‌యూవి ప్రస్తుత పెట్రోల్ పవర్‌ట్రెయిన్‌తో కొత్త BS-VI ప్రమాణంతో జతచేశారు.
నివేదికలను చూస్తే కంపెనీ దీనిని 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో కూడా లాంచ్ చేయవచ్చు. అయితే డీజిల్ ఇంజిన్ కొత్త XL6 MPV, సియాజ్ సెడాన్, ఎర్టిగా MPVలలో కూడా అందించారు. ఈ కారు ఇప్పటికే ఉన్న 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కు బదులుగా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను పొందవచ్చు.