టయోటా షాకింగ్ నిర్ణయం.. ఇండియాలో ఆ కార్ల ఉత్పత్తి నిలివేత..
టయోటా కిర్లోస్కర్ మోటార్ (toyota kirloskar motor) ఈ రోజు అంటే సెప్టెంబర్ 27 నుండి భారత మార్కెట్లో సెడాన్ కారు యారిస్ (yaris) ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే 2022లో కొత్త మోడళ్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు టయోటా తెలిపింది.
ప్రస్తుతం ఉన్న యారిస్ కస్టమర్‌లకు సర్వీస్, విడిభాగాలను అందిస్తామని సంస్థ హామీ ఇచ్చింది. అయితే ఈ కారు ఉత్పత్తి కొంతకాలం క్రితమే నిలిపివేసింది కానీ ఇప్పుడు అధికారికంగా ఈ మోడల్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
టయోటా యారిస్ (toyota yaris) 2018 సంవత్సరం ఏప్రిల్‌లో రూ .9 లక్షల నుండి రూ .14 లక్షల ధరతో లాంచ్ చేశారు. టయోటా యారిస్ హోండా సిటీకి పోటీగా తీసుకొచ్చారు. ప్రీమియం సెడాన్ విభాగంలో హోండా సిటీతో పాటు హ్యుందాయ్ వెర్నా, మారుతి సుజుకి సియాజ్, స్కోడా రాపిడ్, వోక్స్వ్యాగన్ వెంటోలతో టయోటా యారిస్ పోటీగా నిలిచింది. కానీ ఈ కారు ఈ విభాగంలో ముద్ర వేయడంలో విఫలమైంది అంతేకాకుండా లాంచ్ చేసిన మూడు సంవత్సరాల కన్నా ఎక్కువ కాలంలోనే నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించింది.
దేశవ్యాప్తంగా ఉన్న యారిస్ కార్ కస్టమర్లకు టొయోటా భారతదేశంలో విడిభాగాల లభ్యతను కనీసం వచ్చే 10 సంవత్సరాల వరకు ఉంటుందని చెప్పింది.
ఈ కారణాల వల్ల నిలిచిపోయింది
భారతీయ మార్కెట్లో మూడు సంవత్సరాల ప్రయాణంలో టయోటా యారిస్ వివిధ కారణాల వల్ల మిడ్ సైజ్ సెడాన్ కొనుగోలుదారులపై పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీనికి ప్రధాన కారణాలు యారిస్ లేటెస్ట్ మోడల్ కాదు, ఇప్పటికే కొన్ని ఇతర మార్కెట్లలో విక్రయించారు. అంతర్జాతీయ మార్కెట్లలో ఈ కారుని వియోస్ మోనికర్ పేరుతో విక్రయిసస్తోంది అలాగే దీని డిజైన్ ఇతర కార్లతో చాలా పోలి ఉంటుంది. దీని ఇంటీరియర్‌లో ఎక్కువ ఫీచర్లు అందుబాటులో లేవు. భారతదేశంలో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ తి మాత్రమే విక్రయిస్తున్నారు.
కొంతకాలం క్రితం ఉత్పత్తి నిలిపివేత
ఈ కారు ఇతర ప్రత్యర్థుల పోటీ కార్ల కంటే చాలా ఎక్కువ ధరను కలిగి ఉంది. ఈ విభాగంలో ఇతర మోడల్స్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయబడ్డాయి. ఈ కారణంగా యారిస్‌పై కస్టమర్ ఆసక్తి తగ్గడం ప్రారంభమైంది, ఇంకా అమ్మకాలను ప్రభావితం చేయడం ప్రారంభించింది అలాగే కారు సేల్స్ చార్ట్ తగ్గింది. ఈ దృష్ట్యా ఈ సెడాన్ ఉత్పత్తి కొంతకాలం క్రితం నిలిపివేసారు. టొయోటా ఈ మోడల్ లో మిగిలిన స్టాక్‌ను క్లియర్ చేయాలని చూస్తోంది.
త్వరలో టయోటా బెల్టా
యారిస్‌ను నిలిపివేయడం ద్వారా టయోటా బెల్టా లాంచ్ కి కంపెనీ సిద్ధమవుతోంది. ఈ కారు మారుతి సుజుకి సియాజ్ సెడాన్ కి రీబాడ్జ్డ్ వెర్షన్. టయోటా, సుజుకి గ్లోబల్ పార్టనర్‌షిప్‌లో భాగంగా భారతదేశంలో కొన్ని మోడళ్లను అందించాయి. మారుతి సుజుకి బాలెనో, విటారా బ్రెజ్జాలకు పోటీగా టొయోటా ఇండియా ఇప్పటికే గ్లాంజా అండ్ అర్బన్ క్రూయిజర్ పేర్లతో విక్రయిస్తోంది.
టయోటాతో భాగస్వామ్యంతో తదుపరి మోడల్ సియాజ్, దీనిని టయోటా 'బెల్టా' పేరుతో విక్రయించాలని భావిస్తున్నారు. ఇంజిన్ అండ్ ఫీచర్ల పరంగా టొయోటా బెల్టా చాలా విషయాలలో మారుతి సుజుకి సియాజ్ లాగానే ఉంటుందని భావిస్తున్నారు. టయోటా బెల్టా రాబోయే వారాల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.