టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ టూ-వీలర్: 2020లో వాటి సేల్స్ ఎంత పెరిగాయో తెలుసుకోండి..
భారతదేశంలో ద్విచక్ర వాహనాల సేల్స్ విషయంలో హీరో మోటోకార్ప్ ఎప్పుడూ ఆధిపత్యం చెలాయిస్తుంది. మీరు నూతన సంవత్సర సందర్భంగా కొత్త ద్విచక్ర వాహనాన్ని కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు ఏ ద్విచక్ర వాహనానికి ఎంత ప్రాధాన్యత ఉందో తెలుసుకొంది అలాగే వాటికి డిమాండ్ కూడా భారీగాన్నే ఉంది. భారతదేశంలోని అత్యధికంగా అమ్ముడుపోయే మొదటి 5 ద్విచక్ర వాహనాలు ఏవో చూడండి..
హీరో స్ప్లెండర్
దేశంలో అత్యధికంగా అమ్ముడైన ద్విచక్ర వాహనం హీరో స్ప్లెండర్. గత ఏడాది డిసెంబర్‌లో ఈ బైక్ మొత్తం 1,94,930 యూనిట్లను విక్రయించింది. అలాగే 2019 డిసెంబర్‌లో 1,93,726 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఈ అమ్మకాలు 2019 తో పోలిస్తే 2020 డిసెంబర్ వరకు 1 శాతం పెరిగాయి.
హీరో హెచ్ఎఫ్ డీలక్స్
హీరో స్ప్లెండర్ తర్వాత హీరో హెచ్ఎఫ్ డీలక్స్ నిలిచింది. 2020 డిసెంబర్‌లో ఈ బైక్ 1,41,168 యూనిట్లు అమ్మకాలు చేసింది. అదే 2019 డిసెంబర్‌లో 38,951 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2019 తో పోలిస్తే 2020 డిసెంబర్‌లో దీని అమ్మకాలు 2 శాతం పెరిగాయి.
హోండా యాక్టివా
బైక్‌లతో పాటు స్కూటర్ విభాగంలో హోండా యాక్టివా అగ్రగామిగా ఉంది. యాక్టివా 2020 డిసెంబర్‌లో 1,34,077 యూనిట్లను విక్రయించింది. 2019 డిసెంబర్‌లో 51,31,899 యూనిట్లను విక్రయించింది. 2019 డిసెంబర్‌తో పోలిస్తే 2020 డిసెంబర్‌లో దీని అమ్మకాలు కూడా 2 శాతం పెరిగాయి.
బజాజ్ పల్సర్
ఈ జాబితాలో బజాజ్ పల్సర్ 4వ స్థానంలో ఉంది. బజాజ్ పల్సర్ 2020 డిసెంబర్‌లో 75,421 యూనిట్లను విక్రయించింది. అలాగే 2019 డిసెంబర్‌లో 50,931 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2020 డిసెంబరులో ఈ బైక్ అమ్మకాలు 48 శాతం పెరిగాయి.
టీవీఎస్ ఎక్స్‌ఎల్ మోపెడ్
టీవీఎస్ ఎక్స్‌ఎల్ మోపెడ్ ఈ జాబితాలో 5వ స్థానంలో ఉంది. గత ఏడాది డిసెంబర్‌లో 59,923 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2019 డిసెంబర్‌లో 45,669 యూనిట్లను విక్రయించింది. 2020 డిసెంబర్‌లో దీని అమ్మకాలు 31 శాతం పెరిగాయి.