ఇండియాలోకి జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ 2021 మోడల్ లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు తెలుసుకోండి..
ఇటాలియన్ ఆటోమోబైల్ తయారీ సంస్థ ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ యజమాన్యంలోని జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ 2021 మోడల్ ను భారత్‌లో లాంచ్ చేశారు. కొత్త జీప్ కంపాస్ ధర రూ.16.99 లక్షల నుండి ప్రారంభమై రూ.28.29 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్, ఢీల్లీ ) ఉంటుంది. 2017లో జీప్ కంపాస్ ప్రారంభించినప్పటి నుండి కంపెనీకి ఇండియన్ మార్కెట్ ప్రధానమైనది.
ప్రపంచవ్యాప్తంగా జీప్ కంపాస్ కి భారతదేశం రెండవ మార్కెట్. జీప్ కంపాస్ 2021 మోడల్ లో ముఖ్యంగా ఇంటిరియర్ క్యాబిన్, ఫీచర్లను అప్ డేట్ చేసింది. డాష్‌బోర్డ్ డిజైన్ కూడా పూర్తిగా కొత్తది అలాగే ఇప్పుడు పెద్ద 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్‌తో పాటు కొత్త యు-కనెక్ట్ 5 సిస్టమ్‌తో పాటు ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలను అందించారు. వెంటిలేటెడ్ అప్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, కొత్త 360-డిగ్రీ పార్కింగ్ కెమెరా వంటి లేటెస్ట్ ఫీచర్లు జోడించారు.
2021 మోడల్ జీప్ కంపాస్ వేరియంట్స్ ధరలు (ఎక్స్-షోరూమ్)
స్పోర్ట్ ట్రిమ్స్
కంపాస్ స్పోర్ట్ 1.4 పెట్రోల్ ఎంటీ ధర రూ.16.99 లక్షలు
కంపాస్ స్పోర్ట్ 2.0 డీజిల్ ఎంటీ ధర రూ.18.69 లక్షలు
కంపాస్ స్పోర్ట్ 1.4 పెట్రోల్ డిడిసిటి ధర రూ. 19.49 లక్షలు
లాంగిట్యూడ్ ట్రిమ్స్
కంపాస్ లాంగిట్యూడ్ (ఓ) 2.0 డీజిల్ ఎంటీ ధర రూ. 20.49 లక్షలు
కంపాస్ లాంగిట్యూడ్ (ఓ) 1.4 పెట్రోల్ డిడిసిటి ధర రూ.21.29 లక్షలు
లిమిటెడ్ (ఓ) ట్రిమ్స్
కంపాస్ లిమిటెడ్ (ఓ) 2.0 డీజిల్ ఎంటీ ధర రూ. 22.49 లక్షలు
కంపాస్ లిమిటెడ్ (ఓ) 1.4 పెట్రోల్ డిడిసిటి ధర రూ. 23.29 లక్షలు
కంపాస్ లిమిటెడ్ (ఓ) 2.0 డీజిల్ 4 ఎక్స్ 4 ఎటి ధర రూ. 26.29 లక్షలు
మోడల్ 'ఎస్' ట్రిమ్స్
కంపాస్ మోడల్ 'ఎస్' 2.0 డీజిల్ ఎంటీ ధర రూ. 24.49 లక్షలు
కంపాస్ మోడల్ 'ఎస్' 1.4 పెట్రోల్ డిడిసిటి ధర రూ. 25.29 లక్షలు
కంపాస్ మోడల్ 'ఎస్' 2.0 డీజిల్ 4x4 ధర రూ. 28.29 లక్షలు
80వ వార్షికోత్సవ లిమిటెడ్ ఎడిషన్ ట్రిమ్స్
కంపాస్ లిమిటెడ్ 80 వ అన్నీవ్ 2.0 డీజిల్ ఎంటీ ధర రూ. 22.96 లక్షలు
కంపాస్ లిమిటెడ్ 80 వ అన్నీవ్ 1.4 పెట్రోల్ డిడిసిటి ధర రూ. 23.76 లక్షలు
కంపాస్ లిమిటెడ్ 80 వ అనివ్ 2.0 డీజిల్ 4x4 ధర రూ. 26.76 లక్షలు
2021 జీప్ కంపాస్ గ్రీన్ బాడీ కలర్ ఆప్షన్ లో కొత్త డార్క్ షేడ్ తో విజువల్ అప్‌డేట్స్‌తో వస్తుంది. ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లతో కొత్త ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, రిడిజైన్ చేసిన బంపర్, ట్వీక్డ్ ఫాక్స్ స్కిడ్ ప్లేట్, పెద్ద ఎయిర్ డ్యామ్, కొత్త ఫాగ్ లాంప్స్, కొత్త అల్లాయ్ వీల్స్, కొత్త ఎల్ఈడి టైల్లైట్స్ ఇంకా మరెన్నో అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి.
భద్రత పరంగా కొత్త జీప్ కంపాస్‌కు ఏడు ఎయిర్‌బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఎబిఎస్), ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఇబిడి), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఇఎస్‌పి), బ్రేక్ అసిస్ట్ (బిఎ), టెర్రైన్ మోడ్లు, హిల్ అసిస్ట్ (హెచ్‌ఏ), హిల్ డీసెంట్ కంట్రోల్ (హెచ్‌డిసి). 2021 జీప్ కంపాస్ ఇంతకు ముందు మోడల్ లాంటి ఇంజిన్ను పొందుతుంది. 1.4-లీటర్ మల్టీ-ఎయిర్ పెట్రోల్ ఇంజన్, 2.0-లీటర్ మల్టీ-జెట్ డీజిల్ యూనిట్ ఉన్నాయి. గేర్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ లో6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, ఆప్షనల్ 9-స్పీడ్ టార్క్ కన్వర్టర్, 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ ఉంటాయి. సెలెక్ట్ చేసుకున్నా వేరియంట్లపై జీప్ 4x4 టెక్‌ను అందిస్తుంది.
2021 జిప్ కంపాస్ ఎస్‌యూవీ నాలుగు ట్రిమ్‌లలో అందిస్తుంది. స్పోర్ట్, లాంగిట్యూడ్, లిమిటెడ్, కొత్త టాప్-ట్రిమ్, ఎస్. టాప్ ట్రిమ్ కొత్త వేరియంట్‌గా ఉంటుంది, ఇది ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్‌గా అందించబడుతుంది. జీప్ 80వ వార్షికోత్సవం సందర్భంగా 2021 కంపాస్ లిమిటెడ్ 80వ వార్షికోత్సవ ఎడిషన్‌ను కూడా ప్రవేశపెట్టారు, దీని ధర రూ.22.96 లక్షలు దీనికి 2.0-లీటర్ డీజిల్ ఇంజన్, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అందిస్తున్నారు. టాటా హారియర్, ఎంజి హెక్టర్, స్కోడా కరోక్, హ్యుందాయ్ టక్సన్‌లకు పోటీగా జీప్ కంపాస్ నిలుస్తుంది.