లాంచ్ చేసిన నెలకే టెస్లా కారు క్షణాల్లో బూడిద.. దీని ధర తెలిస్తే షాకవుతారు..
ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో సంచలనం సృష్టిస్తున్న అమెరికన్ ఆటోమోబైల్ దిగ్గజం టెస్లా కంపెనీకి చుక్కెదురైంది. ఎలాన్ మాస్క్ యజమాన్యంలోని టెస్లా సంస్థ గత నెలలో ఎస్ ప్లైడ్ అనే ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 200కి.మీ. కేవలం రెండు సెకండ్లలో 0-60కి.మీ స్పీడ్ అందుకోగలదు. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 600కి.మీ పైగా ప్రయాణించగలదు.
అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన ఒక పారిశ్రామిక వేత్త మార్క్ గెరాగోస్ ఇటీవల ఎస్ ప్లెయిడ్ కారుని 1,29,900 డాలర్లు వెచ్చించి కొనుగోలు చేశాడు అంటే ఇండియాలో దీని ధర 97 లక్షలకు పైగానే.
రెండు రోజుల క్రితం అంటే మంగళవారం రోజున ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు కారు బయటకు తీశాడు. 11-12 మీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. వెంటనే మార్క్ గెరాగోస్ కారు నుండి దిగేందుకు ప్రయత్నించగా ఎలక్ట్రానిక్ డోర్ సిస్టమ్ తెరుచుకోలేదు. చివరకు మార్క్ గెరాగోస్ ప్రయత్నాలు ఫలించి కారు డోర్ ఓపెన్ చేసి ప్రమాదం నుంచి బయట పడ్డారు. ఈ ప్రమాద వివరాలను మార్క్ తరఫున న్యాయవాది మీడియాకు వెల్లడించారు.
ఎలక్ట్రిక్ కార్ల టెక్నాలజిలో టెస్లా దూసుకుపోతున్న సమయంలో ఎస్‌ప్లెయిడ్ కారు ఘటన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఎవ్వరూ ఊహించిన విధంగా మంటల్లో చిక్కుకుని బూడిదైంది. అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగిన ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. టెస్లా కార్ల భద్రతపై ఇప్పుడు అనుమానాలు రేకెతిస్తున్నాయి.
ఎస్ ప్లెయిడ్ కారు మంట్లలో కాలిపోవడంపై టెస్లా ప్రతినిధులు అధికారికంగా స్పందించటానికి నిరాకరించారు. ఇటీవల ఎస్‌ప్లెయిడ్ పేరుతో వస్తున్న టెస్లా కార్ లంచింగ్ సందర్భంగా ఎలన్‌మస్క్ మాట్లాడుతూ ‘ఈ కారు వేగంలో ఫెరారీ, భద్రతలో వోల్వో కంటే ఎస్ ప్లెయిడ్ ఉత్తమంగా ఉంటుంది’అని ప్రకటించారు.లాంచ్ చేసి నెల రోజులు గడవక ముందే ఎస్ ప్లెయిడ్ కారు మంటల్లో కాలిపోవడంతో చర్చనీయాంశంగా మారింది.