సరికొత్త టాటా సఫారి 2021 లాంచ్.. ఈ కారులో మొట్టమొదటిసారిగా కనిపించే ఫీచర్లు ఇవే..
దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ సరికొత్త 2021 సఫారి ఎస్‌యూవీని భారతదేశంలో అధికారికంగా ప్రవేశపెట్టింది. ఇండియాలోని పూణే ప్లాంట్‌లో ఈ ఎస్‌యూవీల ఉత్పత్తిని ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం, పూణే ప్లాంట్‌లో ఫ్లాగ్ ఆఫ్ ఈవెంట్ తర్వాత టాటా మోటార్స్ సఫారి మొదటి కారును విడుదల చేసింది. వచ్చే నెల మొదటి వారంలో కంపెనీ కొత్త 2021 సఫారీల సేల్స్ ప్రారంభిస్తుంది.
కొత్త డిజైన్
కొత్త సఫారి టాటా మోటార్స్ సంస్థ ఇంపాక్ట్ 2.0 డిజైన్ లాంగ్వేజ్ పై ఆధారపడి ఉంటుంది. గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో టాటా గ్రావిటాస్ ఎస్‌యూవీని ప్రీ-ప్రొడక్షన్ రూపంలో ప్రదర్శించారు. కొత్త లుక్ లో ఈ కారు మునుపటి కంటే అద్భుతంగా ఉంటుంది.
ఇంజన్
2021 టాటా సఫారి ఎస్‌యూవీ ల్యాండ్ రోవర్ డి 8 నుండి ప్రేరణ పొందిన ఒమేగార్క్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తుంది. కొత్త సఫారికి 2.0 లీటర్ 4 సిలిండర్ డీజిల్ ఇంజన్ తో లభిస్తుంది. ఈ ఇంజన్ 168 బిహెచ్‌పి పవర్, 350 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ అలాగే 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో అందించబడుతుంది. ఈ ఎస్‌యూవీలో ఎకో, సిటీ, స్పోర్ట్స్ అనే మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి.
టాటా మోటార్స్ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ
టాటా హారియర్ ఎస్‌యూవీ తర్వాత ఒమేగార్క్ ప్లాట్‌ఫామ్‌లో ఇది రెండవ ఉత్పత్తి. టాటా మోటార్స్ న్యూ రేంజ్ లో ప్రధాన ఉత్పత్తి. కొత్త సఫారి కొలతలు గురించి చెప్పాలంటే దాని పొడవు, వెడల్పు, ఎత్తు పాత టాటా సఫారి కంటే ఎక్కువగా ఉంటుంది. 2021 టాటా సఫారిలో 18-అంగుళాల మెషిన్డ్ అల్లాయ్ వీల్స్ అందించారు. భారతదేశంలో ఆల్ రౌండ్ పనితీరును అందించడానికి కొత్త ఎస్‌యూవీని పరీక్షించారు. మైనస్ 10°C నుండి 50°C వరకు ఉష్ణోగ్రతలలో ఈ కారు టెస్ట్ జరిగింది. ఇది కఠినమైన రహదారులలో కూడా డ్రైవర్‌కు సౌకర్యవంతమైన ప్రయాణానికి హామీ ఇస్తుంది.
2021 టాటా సఫారి ఎస్‌యూవి ఎక్స్‌టిరియర్ చాలా ఆకర్షణీయమైన టైల్ గెట్ తో సాన్ రూఫ్, హెచ్‌ఐడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, క్రోమ్ స్టడెడ్ ట్రై ఆరో ఫ్రంట్ గ్రిల్, ట్విన్ లైట్ ఎల్‌ఇడి టెయిల్ లాంప్స్ ఉన్నాయి. మొత్తంమీద, ఈ ఎస్‌యూవీకి అల్ట్రా ప్రీమియం ఫినిషింగ్ ఇచ్చారు. విల్స్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.
ఇంటెరియర్ అండ్ ఫీచర్స్
కొత్త సఫారి లోపలి భాగం బూడిద రంగులో డాష్‌బోర్డ్ తయారు చేయబడింది. విలాసవంతమైన ఓస్టెర్ వైట్ ఇంటీరియర్ థీమ్, ఓస్టెర్ వైట్ లెదర్ సిట్స్ దాని ప్రీమియం రూపాన్ని మరింత ఆకర్షిస్తుంది. కొత్త టాటా సఫారి 6 నుండి 7 మందికి సౌకర్యవంతంగా ఉంటుంది. కారు క్యాబిన్‌లో 8.8 అంగుళాల ఫ్లోటింగ్ ఐలాండ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్రీమియం 320 వాట్ జెబిఎల్ ఆడియో సిస్టమ్, 3 లైటింగ్ మొడ్స్. ఈ ఎస్‌యూవీలో వెనుక మూడవ వరుస సీట్ల కోసం డేడికేటెడ్ యుఎస్‌బి పోర్ట్‌లు, కప్ హోల్డర్లు, ఎసి యూనిట్లు కూడా అందించారు. ప్రత్యేక విషయం ఏమిటంటే 3వ వరుసలో కనిపించే లెగ్ రూమ్, పనోరమిక్ సన్‌రూఫ్ ఈ విభాగంలో అత్యధికం.
కార్ కనెక్ట్ ఫీచర్స్
టాటా సంస్థ కార్ కనెక్ట్ ఫీచర్స్ ప్యాక్ లో 'ఐఆర్ఎ' ని దీనిలో ఇచ్చారు. రిమోట్ కమాండ్లు, వాహన భద్రతా ఫీచర్లు, లొకేషన్ బేస్డ్ సర్వీసెస్, ఎయిర్ అప్‌డేట్స్, లైవ్ వెహికల్ డయాగ్నసిస్, గేమిఫికేషన్ వంటి కనెక్ట్ చేసిన టెక్నాలజీలను ఐఆర్‌ఎ టెక్నాలజీ కింద ఉపయోగించవచ్చు.
భద్రత ఫీచర్స్
కొత్త 2021 టాటా సఫారి భద్రత ఫీచర్స్ లో ఆటో, ఐఆర్‌విఎం ఆటో హోల్డ్ తో ఫాగ్ ల్యాంప్స్, 6 ఎయిర్ బ్యాగులు, డిస్క్ బ్రేక్లు, టైర్ ప్రేజర్ ఇండికేటర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డీసెంట్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్స్ దీనిలో ఉన్నాయి. కొత్త సఫారిలో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి కొత్త ఫీచర్స్ అందిస్తుంది, ఇది టాటా కారులో అందించడం మొదటిసారి.
కలర్ ఆప్షన్స్ ఇంకా ధర
కొత్త 2021 టాటా సఫారి ఎస్‌యూవీని రాయల్ బ్లూ, వైట్, గ్రే అనే మూడు కలర్ ఆప్షన్లలో అందిస్తున్నారు. ఈ ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్ ధర రూ .15 లక్షలకు మించి ఉండవచ్చు. మరిన్ని కలర్ ఆప్షన్స్ త్వరలో అందుబాటులో రానున్నాయి. ఇది భారతీయ మార్కెట్లో ఎంజి హెక్టర్ ప్లస్, రాబోయే హ్యుందాయ్ క్రెటా 7-సీట్ల ఎస్‌యూవీకి పోటీగా నిలుస్తుంది.