టాటా మోటార్స్ రికార్డుల జోరు.. 67% పెరిగిన లాభాలు..
దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ లిమిటెడ్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో 67.2 శాతం పెరిగింది. కరోనా వైరస్ కేసుల తగ్గుదల, ప్రభుత్వ ఆంక్షలను తొలగించడంతో ఆటోమొబైల్ మార్కెట్ పండుగ కాలంలో డిమాండ్ పుంజుకుంది, ఇది టాటా మోటార్స్ సంస్థకు భారీ ప్రయోజనం చేకూర్చింది. టాటా మోటార్స్ డిసెంబర్ త్రైమాసికంలో సేల్స్ ద్వారా రూ .2906 కోట్ల లాభాలను ఆర్జించింది.
టాటా మోటార్స్ సొంతం చేసుకున్నా జాగ్వార్ వంటి లగ్జరీ కార్ బ్రాండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో 2906 కోట్ల రూపాయల నికర లాభాన్ని నమోదు చేసింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ .1738 కోట్లు. అంతకుముందు సెప్టెంబర్ 2020 త్రైమాసికంలో, కోవిడ్ -19 మహమ్మారి కారణంగా కంపెనీ 314 కోట్ల రూపాయల నష్టాన్ని నివేదించింది.
మీడియా నివేదికల ప్రకారం, టాటా మోటార్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గుంటెర్ బుస్చెక్ మాట్లాడుతూ, "పండుగ సీజన్ లో మంచి డిమాండ్ అలాగే ప్రైవేట్ వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ప్యాసెంజర్ వాహనాల వ్యాపారం గత 33 త్రైమాసికాలలో అత్యధిక అమ్మకాలను నమోదు చేసింది." అని తెలిపారు.
లగ్జరీ కార్ యూనిట్ అయిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జెఎల్ఆర్) అత్యధికంగా లాభాలను సంపాదించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో దీని అమ్మకాలు 13.1 శాతం పెరిగాయి, అయితే ఇది కరోనా శకం కంటే 9 శాతం తక్కువ.
ముడి పదార్థాల వ్యయాల ప్రభావాన్ని తగ్గించడానికి టాటా మోటార్స్ గత వారం తన వాహనాల ధరలను పెంచుతున్నట్లు తెలిపింది. కార్యకలాపాల ద్వారా వచ్చే మొత్తం ఆదాయం 5.5 శాతం పెరిగి రూ .75,654 కోట్లకు చేరుకుంది.