వాణిజ్య వాహనాల వ్యాపారంలో టాటా మోటార్స్ భారీ పెట్టుబడి.. జన్ మార్గ్ లిమిటెడ్‌కు 60 బస్సుల పంపిణీ..
అతిపెద్ద ట్రక్కు తయారీదారులలో ఒకటైన టాటా మోటార్స్ (tata motors) ఎలక్ట్రిక్ వెహికల్స్ (EV), కమర్షియల్ వెహికల్ బిజినెస్ (commercial vehicles) విస్తరించేందుకు యోచిస్తోంది. ఒక నివేదిక ప్రకారం టాటా మోటార్స్ రాబోయే నాలుగు నుండి ఐదు సంవత్సరాలలో 1 బిలియన్ డాలర్లు అంటే రూ. 7,500 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనుంది.
ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) విభాగంలో అగ్రగామిగా ఉన్న సంస్థ వాణిజ్య వాహనాల (CV) విభాగంలో కూడా ఫ్యూచర్ ఎలక్ట్రిక్ వాహనాలను అందించడానికి రూపొందించిన కొత్త ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ ప్లాట్‌ఫారమ్‌లో సిఎన్‌జి, ఎన్‌ఎల్‌జి అండ్ డీజిల్ పవర్‌ట్రెయిన్‌లను ఉండవచ్చని నివేదించింది.
టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీష్ వాఘ్ మాట్లాడుతూ.. వైడ్ రేంజ్ వాహనాలను అందించడానికి స్మాల్ బిజినెస్ వాహనాలు అలాగే గ్యాస్-ఆధారిత ఫ్యూయెల్ సెల్ ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించెందుకు తీసుకున్న చర్య.
రాయల్ ఎన్ఫీల్డ్ నుండి టాటాలో చేరిన సుబ్రాన్ష్ సింగ్ అండ్ ఫోర్డ్ ఇండియా మాజీ మేనేజింగ్ డైరెక్టర్ అనురాగ్ మెహ్రోత్రా వంటి సీనియర్ మార్కెటింగ్ నిపుణులతో సహా కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ వ్యూహాలను పునరుద్ధరిస్తోంది. టాటా మోటార్స్ ప్రకారం కొన్ని స్టీల్ అండ్ సిమెంట్ కంపెనీలు మైనింగ్ కోసం ఎలక్ట్రిక్ ట్రక్కులను డిమాండ్ చేస్తున్నాయి అలాగే కంపెనీ ఇందుకు పరిష్కారం కోసం కసరత్తు చేస్తోంది.
ఎలక్ట్రిక్ సివి వ్యాపారం కోసం టాటా మోటార్స్‌కు స్వతంత్ర అనుబంధ సంస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచన లేనప్పటికీ, ప్రస్తుతం టాటా మోటార్స్ బలమైన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను అభివృద్ధి చేయడం ఇంకా హెల్తి రేటింగ్‌ను నిర్ధారించడానికి కస్టమర్ బేస్‌ను నిర్మించడంపై దృష్టి సారిస్తోంది.
టాటా మోటార్స్ ప్రత్యర్థి అశోక్ లేలాండ్ స్విచ్ మొబిలిటీ కింద ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారంలో కొత్త పెట్టుబడుల కోసం వెతుకుతున్నట్లు నివేదించింది. ఇదిలా ఉండగా టాటా మోటార్స్ అహ్మదాబాద్ జన్మార్గ్ లిమిటెడ్ (AJL)కి 60 అత్యుత్తమ ఎలక్ట్రిక్ బస్సులను పంపిణీ చేసింది. స్థిరమైన మొబిలిటీని ప్రోత్సహించేందుకు ఈ ప్రాజెక్ట్ కట్టుబడి ఉందని టాటా మోటార్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
టాటా అల్ట్రా అర్బన్ 9/9 AC బస్సులను గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఇంకా అహ్మదాబాద్ మేయర్ శ్రీ కిరీట్ కుమార్ పార్మెర్ నేడు అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్‌ఫ్రంట్ ఈవెంట్ సెంటర్‌లో జెండా ఊపి ప్రారంభించారు. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం, ఏజేఎల్ అండ్ టాటా మోటార్స్‌కు చెందిన ప్రముఖులు కూడా హాజరయ్యారు. FAME II చొరవ కింద ఏజేఎల్ తో గ్రాస్ కోస్ట్ కాంట్రాక్ట్ (GCC) ద్వారా 24-సీటర్ జీరో-ఎమిషన్ బస్సులు సరఫరా చేసింది. ఈ బస్సు అహ్మదాబాద్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (BRTS)లో కూడా నడుస్తుంది. టాటా మోటార్స్ బస్సులు సజావుగా నడపడానికి అవసరమైన ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ సపోర్ట్ సిస్టమ్‌లను కూడా అందిస్తుంది.
టాటా అల్ట్రా అర్బన్ 9/9AC ఎలక్ట్రిక్ బస్సులు ఫుల్-ఎలక్ట్రిక్ డ్రైవ్‌ట్రైన్‌లు, ఇవి గరిష్టంగా 328 hp శక్తిని, 3000 Nm గరిష్ట టార్క్‌ను అందిస్తాయి. క్లచ్ అండ్ గేర్ షిఫ్టింగ్ లేకుండా అలసట లేని డ్రైవింగ్ అనుభవాన్ని అందించడానికి రూపొందించబడిన అల్ట్రా అర్బన్ 9/9 ఇ-బస్సులు రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్, న్యూ జనరేషన్ టెలిమాటిక్స్ అలాగే హై సెక్యూరిటీ ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (ITS) ఫీచర్లతో అమర్చబడి వస్తుంది.