ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విజేతకి ఆనంద్ మహీంద్ర అదిరిపోయే గిఫ్ట్.. ట్విటర్ ద్వారా ప్రకటన..
దేశీయ ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ఒలింపిక్స్ విజేత నీరజ్ చోప్రాకు మహీంద్ర ఎక్స్‌యూవి700 ఎస్‌యూవిని బహుమతిగా ఇవ్వానున్నట్లు నిర్ణయించింది. నీరజ్ చోప్రా ఎన్నో సంవత్సరాలకు పైగా ఒలింపిక్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్‌లలో భారతదేశానికి మొదటి పతకాన్ని, షూటర్ అభినవ్ బింద్రా తర్వాత రెండవ గోల్డ్ మెడల్ సాధించాడు.
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో నీరజ్ చోప్రాకి త్వరలో లాంచ్ చేయనున్న ఫ్లాగ్‌షిప్ ఎక్స్‌యూవి700 ఎస్‌యూవిని బహుమతిగా ఇవ్వనున్నట్లు ట్వీట్ చేశారు. ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించినందుకు ఆనంద్ మహీంద్రా అభినందనలు తెలుపుతూ, "అవును నిజమే. మా గోల్డెన్ అథ్లెట్‌కు ఎక్స్‌యూవి700 బహుమతి ఇవ్వడం గొప్ప విశేషం ఇంకా గౌరవం. మహీంద్రా కంపెనీ ఎక్స్‌యూవి700 ఎస్‌యూవిని లాంచ్ ముందుగానే దూకుడుగా ప్రచారం చేస్తోంది. ఈ సంవత్సరంలో అత్యంత ఎదురుచూస్తున్న లాంచ్‌లలో ఈ కారు ఒకటి. ఆన్‌లైన్‌లో లీకైన ఫోటోల ప్రకారం, ఎక్స్‌యూవి 700 ప్రొఫైల్ పెరిగింది. ఇటీవల హ్యుందాయ్ అల్కాజార్, టాటా సఫారీలను లాంచ్ చేసిన తర్వాత ఎక్స్‌యూవి700 భారతీయ మార్కెట్లలోకి రానున్న సరికొత్త మూడు-వరుస ఎస్‌యూవి.
మహీంద్రా నుండి ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 7 సీట్ల ఎస్‌యూవి ఎక్స్‌యూవి 700 కోసం కారు ప్రేమికులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. నివేదిక ప్రకారం మహీంద్రా ఈ సంవత్సరం ఆగస్టు 15న ఎక్స్‌యూవి 700ని ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించనుంది. దీని తరువాత ఈ ఎస్‌యూవి 2 అక్టోబర్ 2021న లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇంతకుముందు ఎక్స్‌యూవి700 ఎస్‌యూవిలో ఆటో బూస్టర్ హెడ్‌ల్యాంప్స్, స్మార్ట్ పాప్-అప్ హ్యాండిల్స్, డ్రైవర్ అటెన్షన్ మానిటర్ వైడ్-ఇన్-సెగ్మెంట్ రూఫ్ వంటి ఫీచర్లను మహీంద్రా వెల్లడించింది.
మహీంద్రా కొత్త ఎక్స్‌యూవి 700ఎస్‌యూవిని రెండు ఇంజన్ ఆప్షన్స్ తో అందిస్తున్నారు. ఇందులో 2.0-లీటర్ mStallion టర్బోచార్జ్డ్ పెట్రోల్, 2.2-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్ ఉన్నాయి. పెట్రోల్ ఇంజన్ 188 బిహెచ్‌పి పవర్, 380 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఇంజిన్ 185 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ఈ కారులోని ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ చూస్తే 6-స్పీడ్ మాన్యువల్ అండ్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ఉంటాయి. ఈ ఎస్‌యూవిని హైబ్రిడ్ సిస్టమ్‌తో కూడా అందించవచ్చు.
ప్రస్తుత ఎక్స్‌యూవి500 తో పోలిస్తే కొత్త ఎక్స్‌యూవి700 సరికొత్త ఫీచర్లు, ప్రీమియం క్యాబిన్‌తో వస్తుంది. ఎక్స్‌యూవి700 లేటెస్ట్ ఫీచర్ల గురించి టీజర్ వీడియో ద్వారా కంపెనీ ఇప్పటికే సమాచారాన్ని వెల్లడించింది. ఈ సెగ్మెంట్‌లోని కార్లలో మొదటిసారిగా ఇచ్చిన చాలా ఫీచర్లు దీనికి ఇచ్చారు. ఎక్స్‌యూవి700 డాష్‌బోర్డ్ డిజైన్, ఫిట్ అండ్ ఫినిష్, క్వాలిటీ ఎక్స్‌యూవి 500 కంటే చాలా మెరుగ్గా ఉంటుంది. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ క్రింద ఏసి కంట్రోల్ బటన్‌లు ఇచ్చారు మహీంద్రా ఎక్స్‌యువి 700 డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్, ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి హై-ఎండ్ ఫీచర్లను పొందుతుంది.
కొత్త ఎక్స్‌యూవి700 ఎస్‌యూవిలో కనిపించే 5 గొప్ప ఫీచర్లను మహీంద్రా అధికారికంగా వెల్లడించింది. వీటిలో స్మార్ట్ డోర్ హ్యాండిల్స్, ఆటో బూస్టర్ హెడ్‌ల్యాంప్‌లు, పర్సనలైజ్డ్ సేఫ్టీ అలర్ట్ సిస్టమ్, డ్రైవర్ డ్రోస్నెస్ డిటెక్షన్, అతిపెద్ద పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్నాయి. మహీంద్రా ఎక్స్‌యూవి700 విభాగంలో లెవల్ 1 ఏడిఏఎస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) వంటి ఫీచర్లను అందించే మొదటి కారు అని కూడా స్పష్టం చేస్తుంది.