రోడ్డు మీద నుండి గాల్లోకి ఎగిరే సూపర్ కార్.. కేవలం 3 నిమిషాల్లో విమానంల మారిపోతుంది..
మనము ఆకాశంలోకి ఎగిరే విమానాలను చూస్తుంటాం... కానీ ఎప్పుడైన ఎగిరే కారు చూసారా... గాల్లోకి ఎగరాలి అనే ప్రతిఒక్కరి కల త్వరలోనే నెవెరాబోతుంది... స్లోవేకియా సంస్థ ఎయిర్‌కార్ అని పిలిచే ఫ్లయింగ్ కారుని ఇటీవల టెస్టింగ్ చేసింది.
క్లైన్ విజన్ అనే రీసర్చ్ అండ్ డెవెలప్మెంట్ సంస్థ 30 సంవత్సరాలుగా ఎగిరే కారును అభివృద్ధి చేయడానికి కృషి చేస్తోంది. ఈ కారు సొంత ప్రయాణాలకు లేదా వాణిజ్య టాక్సీ సేవలకు ఉపయోగకరంగా ఉంటుందని డెవలపర్లు అంటున్నారు. ఈ కారు కేవలం మూడు నిమిషాల్లోనే విమానంగా మారిపోతుంది.
"ప్రొఫెసర్ స్టీఫన్ క్లీన్ రూపొందించిన 5వ జనరేషన్ ఫ్లయింగ్ కారుని స్లోవేకియాలోని పియస్టనీ విమానాశ్రయంలో రెండు 1500 'ఎజిఎల్ లను పూర్తి చేసింది. ఈ మోడల్ రెండు టేకాఫ్‌లు, ల్యాండింగ్‌లతో సహా రెండు పూర్తి విమానాశ్రయ నమూనాలను సురక్షితంగా సాధించింది." రెండు సీట్ల మోడల్ బరువు 1,100 కిలోలు, అలాగే 200 కిలోల అదనపు బరువు మోయగలదని ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ ఎయిర్‌కార్ బిఎండబల్యూ 1.6l ఇంజిన్‌తో పనిచేస్తుంది. 140హెచ్‌పి ఉత్పత్తి చేయగల ఈ కార్ 1,000 కి.మీ వరకు ప్రయాణిస్తుంది.
ప్రొఫెసర్ క్లీన్ మాట్లాడుతూ ఇప్పటికే ఎయిర్ కార్ కోసం కొనుగోలుదారులు ఉన్నారు అని చెప్పారు. క్లీన్విజన్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం ఎయిర్ కార్ ఫ్లయింగ్ ప్రోటోటైప్‌ను 2019 నవంబర్‌లో షాంఘైలోని చైనా ఇంటర్నేషనల్ ఇంపోర్ట్ (సిఐఐఇ) లో సాధారణ ప్రజలకు పరిచయం చేశారు. ఈ ఫ్లయింగ్ కార్ సాధారణ పెట్రోల్‌తోనే నడుస్తుంది. దీనిలో ఇద్దరు కలిసి ఒకేసారి ప్రయాణించొచ్చు.
స్లొవేకియాలోని నిట్రా సిటీ నుంచి ఈ ఎయిర్‌కార్ 8 వేల అడుగుల (సుమారు రెండున్నర కిలోమీటర్లు) ఎత్తులో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి 35 నిమిషాల తర్వాత బ్రటిస్లావా నగరంలో ల్యాండ్ అయింది. అయితే ఎయిర్‌కార్‌ను 300 హెచ్‌పీ ఇంజిన్‌తో రూపొందిస్తున్నామని కంపెనీ ప్రకటించింది. ఇది గంటకు 300 కిలోమీటర్ల వేగంతో వెయ్యి కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని ఏడాదిలోపు దీనిని మార్కెట్‌లోకి తీసుకొస్తామని వెల్లడించింది. ధర, దీని ఫీచర్లు వంటి ఇతర సమాచారాన్ని మాత్రం వెల్లడించలేదు.