MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Automobile
  • Bike Mileage : మీ పాత బైక్ పెట్రోల్ ఎక్కువ తాగుతోందా? మైలేజ్ పెంచే 5 సీక్రెట్ టిప్స్ ఇవే

Bike Mileage : మీ పాత బైక్ పెట్రోల్ ఎక్కువ తాగుతోందా? మైలేజ్ పెంచే 5 సీక్రెట్ టిప్స్ ఇవే

పాత బైక్‌లు వాడేవాళ్లకు అతిపెద్ద టెన్షన్ మైలేజే. మీ పాత బండిని 'పెట్రోల్ తాగే రాక్షసి'లా కాకుండా, మంచి మైలేజ్ ఇచ్చే 'గుర్రం'లా మార్చేందుకు ఇక్కడ కొన్ని సూపర్ టిప్స్ ఉన్నాయి.

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 30 2026, 05:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎయిర్ ఫిల్టర్‌ను శుభ్రం చేయండి
Image Credit : stockPhoto

ఎయిర్ ఫిల్టర్‌ను శుభ్రం చేయండి

బైక్‌కు ఎయిర్ ఫిల్టర్ మన ఊపిరితిత్తుల్లాంటిది. ఇందులో దుమ్ము చేరితే, ఇంజిన్ గాలి పీల్చుకోవడానికి ఎక్కువ పెట్రోల్ లాగేస్తుంది. ప్రతి 2,000 కి.మీ.లకు ఒకసారి దీన్ని శుభ్రం చేస్తే మైలేజ్ పెరుగుతుంది. ఇక సర్వీసింగ్ సమయంలో మెకానిక్ సూచనను బట్టి ఎయిర్ ఫిల్టర్ మార్చండి… దీంతో మీ బైక్ మైలేజ్ పెరిగి మెయింటెనెన్స్ ఖర్చులు భారీగా తగ్గుతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
టైర్ 'గాలి' - గమనించడం మర్చిపోవద్దు
Image Credit : Pinterest

టైర్ 'గాలి' - గమనించడం మర్చిపోవద్దు

బైక్ నడపడం గొప్పవిషయం కాదు… దాన్ని సరిగ్గా మెయింటెయిన్ చేయడం ముఖ్యం. బైక్ పర్ఫెక్ట్ గా ఉంటేనే మన రైడింగ్ సాఫీగా సాగేది… అందుకే ఎప్పుడు దాన్ని పరిశీలిస్తూ ఉండాలి. ముఖ్యంగా ప్రయాణ సమయంలో టైర్లలో గాలి చూసుకోవడం తప్పనిసరి. 

బైక్ టైర్లలో గాాలి తక్కువగా ఉంటే మైలేజ్ తగ్గుతుంది… ఎందుకంటే రోడ్డు, టైర్‌కు మధ్య ఘర్షణ (Friction) ఎక్కువయి ఇంజిన్ ఎక్కువ శక్తిని వాడాల్సి వస్తుంది. ఇందుకోసం ఎక్కువ పెట్రోల్ వాడుతుంది. అందుకే వారానికి ఒకసారి గాలిలో ప్రెజర్ చెక్ చేయండి. వీలైతే నైట్రోజన్ గాలి నింపండి, బండి తేలిగ్గా వెళ్తుంది.

Related Articles

Related image1
Best Mileage Cars : ఈవి, సీఎన్‌జీ లతో పనే లేదు.. వీటిని తలదన్నేలా మైలేజ్ ఇచ్చే టాప్ 5 పెట్రోల్ కార్లు ఇవే
Related image2
Car Mileage Tips : కారు ఏ స్పీడ్ లో నడిపితే ఎక్కువ మైలేజ్ ఇస్తుంది? తెలుసుకుంటే పెట్రోల్ ఖర్చులు కంట్రోలే..!
35
చైన్ లూబ్ - స్మూత్ డ్రైవింగ్
Image Credit : Pinterest

చైన్ లూబ్ - స్మూత్ డ్రైవింగ్

మీ బైక్ చైన్ పొడిగా (Dry) అయిపోతే అది ఇంజిన్‌పై భారం పెంచుతుంది.  అందుకే  ముఖ్యంగా పాత బండి అయితే, ప్రతి 500 కి.మీ.లకు ఒకసారి సరైన చైన్ లూబ్ వాడండి. చైన్ లూజ్‌గా లేకుండా టైట్‌గా ఉందో లేదో మెకానిక్‌తో చెక్ చేయించండి. చైన్ ను సరిగ్గా మెయింటెయిన్ చేయడం  కూడా బైక్ మైలేజ్ పెంచుతుంది.

45
అనవసరమైనప్పుడే "యాక్సిలరేటర్" వాడండి
Image Credit : Pinterest

అనవసరమైనప్పుడే "యాక్సిలరేటర్" వాడండి

చాలామంది సిగ్నల్ దగ్గర ఆగి కూడా అనవసరంగా యాక్సిలరేటర్ తిప్పుతూ ఉంటారు. పాత బైక్‌లకు ఇది అస్సలు మంచిది కాదు. ఒకే వేగంతో (40-50 కి.మీ/గం) వెళ్లడం వల్ల మీ జేబులో డబ్బు ఆదా అవుతుంది. సడన్ బ్రేకులు వేయకుండా ఉంటే చాలు, మైలేజ్ పెరుగుతుంది.
55
నాణ్యమైన ఆయిల్... సరైన సమయంలో వేయండి
Image Credit : AI

నాణ్యమైన ఆయిల్... సరైన సమయంలో వేయండి

పాత బండి కదా అని నాసిరకం ఆయిల్ వాడొద్దు. ఇంజిన్ ఆయిల్ నల్లగా మారితే, అది ఇంజిన్‌ను వేడి చేసి ఎక్కువ పెట్రోల్ తాగేలా చేస్తుంది. మంచి క్వాలిటీ సెమీ-సింథటిక్ లేదా మినరల్ ఆయిల్ వాడితే ఇంజిన్ లైఫ్, మైలేజ్ రెండూ పెరుగుతాయి. మంచి ఇంజన్ ఆయిల్ మంచి మైలేజ్ ను ఇస్తుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Best Diesel Cars : రూ.10 లక్షల బడ్జెట్‌లో బెస్ట్ డీజిల్ కార్లు ఇవే
Recommended image2
Car Loan : సెలబ్రిటీలు భార్య పేరుపైనే కారు కొంటుంటారు.. ఎందుకో తెలుసా?
Recommended image3
Electric Scooter : లక్ష కిలోమీటర్ల బ్యాటరీ వారంటీతో ఈవి స్కూటీ... ధర కేవలం లక్ష రూపాయలే..!
Related Stories
Recommended image1
Best Mileage Cars : ఈవి, సీఎన్‌జీ లతో పనే లేదు.. వీటిని తలదన్నేలా మైలేజ్ ఇచ్చే టాప్ 5 పెట్రోల్ కార్లు ఇవే
Recommended image2
Car Mileage Tips : కారు ఏ స్పీడ్ లో నడిపితే ఎక్కువ మైలేజ్ ఇస్తుంది? తెలుసుకుంటే పెట్రోల్ ఖర్చులు కంట్రోలే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved