కరోనా పేషెంట్ల కోసం నీటిపై తేలే అంబులెన్స్.. దీని వెనుక ఉన్న ఎమోషనల్ స్టోరీ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది..
కాశ్మీర్ డివిజన్ శ్రీనగర్ నివాసి తారిక్ అహ్మద్ పట్లూ కరోనాపై పోరాడేందుకు అలాగే దాల్ లేక్ ప్రాంత ప్రజలకు సహాయం చేయడానికి ఒక అంబులెన్స్‌ను రూపొందించారు.
ఈ షికారా అంబులెన్స్‌లో పిపిఇ కిట్, స్ట్రెచర్, వీల్‌చైర్ సదుపాయాలను కూడా ఉన్నాయని తెలిపారు. కరోనా వ్యాప్తి సమయంలో తాను ఎదుర్కొన్న సమస్యల కారణంగా ఈ అంబులెన్స్ నిర్మించడానికి తనని ప్రేరేపించిందని ఆయన చెప్పారు.
దాల్ లేక్ ప్రాంతంలో నివసించే జనాభా చాలా ఎక్కువ. ఎవరైనా అనారోగ్యనికి గురైతే వారిని ఒడ్డున ఉన్న హాస్పిటల్ తీసుకెళ్లడానికి ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో సరస్సు నివాసితులు రోగిని షికారా సహాయంతో ఒడ్డుకు తీసుకురావాలి. ఈ సమస్యల దృష్ట్యా తారిక్ అహ్మద్ పట్లూ తన కుటుంబం, స్నేహితుల సహాయంతో గత సంవత్సరం దాల్ సరస్సులో షికారా అంబులెన్స్ సేవను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు.
దాదాపు రెండు నెలల కృషి, రూ.12 లక్షల ఖర్చుతో అతను ఈ షికారా అంబులెన్స్‌ను సిద్ధం చేయగలిగాడు. 1865 సంవత్సరంలో జీలం నదిలో కూడా రోగులను తీసుకెళ్లడానికి, తీసుకురావడానికి ఒక పడవ ఉండేదని ఆయన చెప్పారు.
2020 సంవత్సరంలో కరోనా వైరస్ కాశ్మీర్‌లో వినాశనం సృష్టించింది. తారిక్ అహ్మద్ పట్లూ కూడా కరోనా భారీన పడ్డాడు. కోవిడ్ -19 ప్రోటోకాల్ ప్రకారం అతను మొదట ఐసోలేషన్ కోసం హౌస్ బోట్ వద్దకు వెళ్ళాడు, కాని పరిస్థితి క్షీణిండంతో ఆసుపత్రికి వెళ్ళవలసి వచ్చింది.
అతను ఆసుపత్రి నుండి తిరిగి వచ్చిన తరువాత దాల్ సరస్సు ఒడ్డున ఉన్న వారు అతనిని తిసుకెళ్లడానికి నిరాకరించారు.
చాలా అతి కష్టంతో కుటుంబ సభ్యులు అతన్ని ఇంటికి తీసుకెళ్లారు. అప్పుడే షికారా అంబులెన్స్ నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఇది ప్రస్తుతం ప్రజలకు చాలా సహాయపడుతుంది.